మన రాష్ట్రం క్రీడాకారులకు పుట్టినిల్లు అని గ్రామీణ క్రీడాకారులను వెలికితేయాలన్నదే మా ఉద్దేశం



 ఏలూరు (ప్రజా అమరావతి);


రాష్ట్ర  ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  కోటి 25 లక్షల కుటుంబాలకు 1లక్ష 30 వేల కోట్లు సంక్షేమం పథకాల ధ్వారా అందించారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు యువజన సంక్షేమం క్రీడా శాఖ శ్రీ మొత్తం శెట్టి శ్రీనివాస రావు తెలిపారు.

 శనివారం  తణుకు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోరాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలు ప్రారంభించారు .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకుప్రోత్సాహంగా

7 కోట్లు రూపాయలు 1500 మంది క్రీడాకారులకు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ వైయస్ 

 జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుండి దేశానికి పేరు తెచ్చిన పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, రషీద్ లను పోత్సహిం ఇచ్చారని ఆయన అన్నారు.


గత ప్రభుత్వం పబ్లిసిటీ పందాలో ఉండేదని ఆయన అన్నారు.


మన రాష్ట్రం క్రీడాకారులకు పుట్టినిల్లు అని గ్రామీణ క్రీడాకారులను వెలికితేయాలన్నదే మా ఉద్దేశం


అన్నారు.


అర్హత ఉన్న  పేదవారికి సంక్షేమం వారి గడప వద్దకే చేర్చడంజరుగుతుందని అన్నారు. ఎన్నిక ఏదైనా

ప్రజలకు జగన్మోహన్ రెడ్డి పై ఉన్న విశ్వసనీయత తో  పట్టం కడుతున్నారు అన్నారు.


175 నియోజకవర్గాల్లో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నాము.


ఖేల్ ఇండియా,రాష్ట్ర ప్రభుత్వ నిధులు, స్పానసర్ షిప్  ధ్వారా మూడు విధానాలలో పోత్స హిస్తున్నాము అన్నారు.


క్రీడల వల్ల ఆత్మ విశ్వాసం, ఫిజికల్, మెంటల్ ఫిట్నెస్ వస్తుందని తెలిపారు.


ప్రవేటు పాఠశాలల్లో కూడా క్రీడలు నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.  క్రీడల ద్వారా ఆత్మహత్యలు నివారించ వచ్చునాని  ,తల్లిదండ్రులు విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సాహించాలని అన్నారు.


క్రీడల ధ్వారా యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఉంటారని తెలిపారు


ఏపీ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ఎదగడానికి కృషిచేయడం జరుగుతుందని అన్నారు.


స్పోట్స్ కోటాలో సచివాలయ వ్యవస్థ లో3 వేల మంది క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు.



రాష్ట్ర  ఉపముఖ్యమంత్రి , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  శ్రీ ఆళ్ల  కాళీ క్రిష్ణ శ్రీనివాస్ (నాని ) మాట్లాడుతూ విద్య ద్వారానే కాక ఇతర రంగాల ధ్వారా విద్యార్థుల  బంగారు భవిష్యత్తు బాటలు పడాలనేదే సీఎం  ఆలోచన  అని అన్నారు.

మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి వారిధ్వారా రాష్ట్రనికి ,దేశానికి పేరు తెచ్చేలా సీఎం కృషి చేస్తున్నారు అన్నారు.  15 నియోజకవర్గల నుండి విద్యార్థులు పాల్గొనడం శుభపరిణామం.


తణుకు ఎమ్మెల్యే శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు

100 క్రికెట్, 100 వాలీబాల్ కిట్ లు,  రెండు కబడి కోర్టు మెట్ లు అందించడం శుభపరిణామం అన్నారు.


గత ప్రభుత్వంలో క్రీడలను నీరు కార్చా రని ,క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వలేదని అన్నారు.


సీఎం వై యస్ జగన్మోహన్ రెడ్డి విద్య తో పాటు క్రీడలకు పెద్ద పీఠ వేశారన్నారు.  రాష్ట్రం నుండి 

ప్రపంచ స్థాయిపోటీలకు వెళ్లే క్రీడాకారులు

76 మందికి 8 కోట్లు సీఎం ప్రోత్సహం క్రింద అందించారని అదేవిధంగా రాష్ట్ర నుండి దేశ స్థాయిలో వెళ్లే 1500 మందికి 4 కోట్లుసీఎం ప్రోత్సహం ఇచ్చారన్నారు. వివిధ

ప్రభుత్వ శాఖల ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. విద్యార్థులు

పుట్టిన ఊరు,జిల్లా, రాష్ట్రం,దేశం కు మంచి పేరు తేవాలి అని ఆయన ఆకాంక్షించారు.


     ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి చైర్మన్ శ్రీ కొయ్యే మోషేన్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చినప్పటినుండి క్రీడలకు అత్యంత ప్రోత్సాహం అందిస్తుందని ఆయన తెలిపారు.  నగదు బహుమతులు అందించి క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర , దేశ  ,అంతర్జాతీయ క్రీడాకారులను గౌరవించడం జరుగుతుందని ఆయన తెలిపారు. క్రీడల వల్ల విద్యార్థులకు మనో వికాసం,  శరీర ఆరోగ్యం కలుగుతుందని ఆయన అన్నారు.



     జిల్లా కలెక్టర్ శ్రీ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలోని 15 నియోజకవర్గాల నుండి క్రీడాకారులతో 14  విభాగాలలో  ఎపి సియం కప్ ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ పోటీలు మూడు రోజుల పాటు జరగనున్న ఆయన అన్నారు.

 కోవిడ్ ప్రభావంతో జిల్లాలో ఇప్పటి వరకు క్రీడలు నిర్వహించలేదని కోవిడ్  తగ్గుముఖం పట్టిందని ఆయన అన్నారు.  నాడు నేడు లో పాఠశాలలు , గ్రౌండ్ రూపురేఖలు మారాయని ఆయన అన్నారు.

 ఎంత ధనవంతుడైన ఫిజికల్ గా , మెంటల్ ఫిట్నెస్ లేకపోవడం వల్ల కోవిడ్ సమయంలో ఒత్తిడిని తట్టుకోలేక చాలా మంది చనిపోయారు అని ఆయన అన్నారు . ప్రతి విద్యార్థి క్రీడలు లో పాల్గొని దృఢంగా ఇవ్వాలని ఆయన సూచించారు . ప్రతి ఒక్కరు విద్యతోపాటు క్రీడలను ప్రోత్సహించాలి అని ఆయన సూచించారు .తల్లిదండ్రులు పిల్లలను చదివించడం తోపాటు క్రీడల్లో రాణించే విధంగా వారిని ప్రోత్సహించాలని ఆయన అన్నారు.



 ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన  తణుకు శాసనసభ్యులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు వల్ల వారికి శారీరక , మానసిక వికాసం  పెరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది క్రీడాకారులకు రెండు కబడి కోర్టు మెట్ లు మంజూరు చేయడం జరిగిందని  ,అలాగే  100 చొప్పున క్రికెట్ ,  వాలీబాల్ కిట్ లు క్రీడాకారులకు అందించడం జరిగిందని ఆయన తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పోటీలు 14 ఈవెంట్లలో పోటీలు జరుగుతాయని ఆయన తెలిపారు. రాష్ట్ర క్రీడా కారులు రాష్ట్రం నుండి మంచి విజయాలు సాధించి పుట్టిన ఊరు ,  జిల్లాకు  ,రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.


     ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ కౌవురు శ్రీనివాస్  , ఏలూరు పార్లమెంటు సభ్యులు శ్రీ కోటగిరి శ్రీధర్  , నిడదవోలు శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు ,  నరసాపురం శాసనసభ్యులు ముదునూరి నాగరాజు వరప్రసాద్ రాజు ,శ్రీ పుప్పాల  శ్రీనివాస రావు ,  గోపాలపురం శాసనసభ్యులు శ్రీ తలారి వెంకట్రావు ,  చింతలపూడి శాసనసభ్యులు ఉన్నామట్ల ఎలీజా , రాష్ట్ర  సాహిత్య అకాడమీ చైర్మన్ శ్రీమతి శ్రీ మతి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి ,  వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ,  డైరెక్టర్లు  , ఎంపీపీ లు , సీఈవో సెట్ వెల్ ఎం డి హెచ్  మెహరాజ్ , క్రీడా శిక్షకులు క్రీడా ప్రాధికార సంస్థ  యెస్ ఏ అజీజ్ ,  క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.



Comments