మోదీ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించారు: సీఎం కేసీఆర్‌

 మోదీ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించారు: సీఎం కేసీఆర్‌


 హైదరాబాద్‌ (ప్రజా అమరావతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించారని సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. మోదీ అబద్ధాలు ఎక్కువగా చెబుతున్నారని, విద్యుత్‌ సంస్కరణలపైనా అబద్ధాలే చెబుతున్నారని మండిపడ్డారు. మీటర్లు పెడుతున్న రాష్ట్రాలకు 0.5 శాతం ఎఫ్‌ఆర్‌బీఎం అదనంగా ఇస్తామంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయక, వచ్చే డబ్బులు కూడా ఆపేస్తున్నారని తెలిపారు. తెలంగాణకు 25 వేల కోట్ల నష్టం వస్తుందని తెలిసినా తను మీటర్లు పెట్టలేదని స్పష్టం చేశారు. విద్యుత్ సెక్టార్‌లో సవరణలు వెనక్కి తీసుకోవాలని గతంలో ప్రధానమంత్రికి లేఖలు రాసినట్లు పేర్కొన్న సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపినట్లు తెలిపారు.

‘మోదీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు పెట్టాల్సిందేనని ముసాయిదా బిల్లులో ప్రస్తావించారు. పార్లమెంటులో ఆమోదం పొందక ముందే బిల్లును అమలు చేస్తున్నారు. మోదీ వల్ల దేశం ఎంత నాశనమవుతోందో వివరిస్తూ ఎంతోమంది పుస్తకాలు రాస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి ఏమీ తెలీదు.మిషన్‌ భగీరథ ప్రారంభ సభలోనూ మోదీ అబద్ధాలే చెప్పారన్నారు

Comments