చిత్తూరు జిల్లా లో చైన్ స్నాచింగ్, హౌస్ బ్రేకింగ్ దొంగతనాలు చేసే అంతరాష్ట్ర ముఠా అరెస్టు..


* చిత్తూరు జిల్లా లో చైన్ స్నాచింగ్, హౌస్ బ్రేకింగ్ దొంగతనాలు చేసే అంతరాష్ట్ర ముఠా అరెస్టు..


* ప్రజలను మాటలతో మభ్యపెట్టి, వారి దృష్టిని మరల్చి దొంగతనాలకు పాల్పడే మహిళా దొంగల ముఠా అరెస్ట్.

* సుమారు 50 లక్షల రూపాయల విలువైన 1 KG బంగారు ఆభరణాలు, 50 వేల రూపాయల విలువైన వెండి ఆభరణాలు స్వాదీనం..  

          చిత్తూరు జిల్లా (ప్రజా అమరావతి);, DIG శ్రీ సెంథిల్ కుమార్, IPS గారి ఆదేశాల మేరకు చిత్తూరు డి.యస్.పి శ్రీ సుధాకర్ రెడ్డి స్వీయ పర్యవేక్షణలో చిత్తూర్ ఒకటవ పట్టణ ఇన్స్ పెక్టర్ శ్రీ. పి. నరసింహరాజు, చిత్తూర్ రూరల్ ఈస్ట్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీ. బాలయ్య మరియు పాకాల సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీ ఆశీర్వాదం ల ఆద్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి దృష్టి మరల్చి (attention diversion) చోరికి పాల్పడే ముఠాను అనగా తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రానికి చెందిన నలుగురు ముద్దాయిలు 1).N.ఉష, 2). శాంతి @ ఉమ, 3). V. సెల్వి మరియు 4). వల్లి అను వారిని మరియు పూతలపట్టు, పెనుమూరు పోలీస్ స్టేషన్ పరిదిలో కన్నపు దొంగతనాలు (House breaking) చేసే కరంబూర్, తిరుపత్తూర్, తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరు ముద్దాయిలు 1. శక్తీ వేలు, 2. రాజు అను అరెస్ట్ చేసి వారి నుండి దొంగ సొత్తు, నగదు మరియు గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్ పరిదిలో గొలుసు దొంగతనాలు (Chain snatching) చేసే తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరు ముద్దాయిలు 1. C. రఘు (ఇతను తమిళనాడు పోలీసు శాఖలో AR విభాగంలో పోలీసు కానిస్టేబుల్ గా పనిచేసి ప్రస్తుతం సస్పెన్షన్ నందు ఉన్నారు) 2. A. హమీద్ లను ఈ దినం అనగా 24.02.2022 వ తేది ఉదయం చిత్తూర్ RTC బస్సు స్టాండ్, పూతలపట్టు-రంగంపేట క్రాస్, తుగుండ్రం క్రాస్ వద్ద అరెస్ట్ చేసి వారి వద్ద నుండి దొంగ సొత్తు బంగారు ఆభరణాలు స్వాదీనం చేయడమైనది.  వీరు 23 కేసు లలో నేరములను అంగీకరించి నందున అరెస్ట్ చేసి వీరి వద్ద నుండి సుమారు 1 KG బంగారు ఆభరణాలు (విలువ సుమారు రూ. 50 లక్షలు), 500 గ్రాములు వెండి ఆభరణాలు (విలువ సుమారు Rs.50,000-00) మరియు కొంత నగదు స్వాదీనం చేయడమైనది.  

 చోరికి పాల్పడి బంగారు మరియు వెండి ఆభరణాలు అపహరించిన ముద్దాయిలు సుమారు నలుగురు  అనగా N.ఉష, శాంతి @ ఉమ, V. సెల్వి మరియు వల్లి అను వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 1 KG బంగారు ఆభరణాలు (సుమారు 50 లక్షలు) మరియు 200 గ్రాములు వెండి ఆభరణాలు స్వాధీనము చేసుకోవడమైనది.  

          ఈ దొంగల ముఠా గుడిపాల, యాదమరి, పూతలపట్టు, సోమల మరియు పెనుమూరు మండలాలలో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకోవడమైనది. పై ముద్దాయిలలో ముగ్గురు ఇంతకు ముందు కూడా పలు కేసులలో ముద్దాయిలుగా వున్నారు.  

 అరెస్టు కాబడిన ముద్దాయిల వివరములు:

 దృష్టి మరల్చి చోరికి పాల్పడే ముద్దాయిల వివరాలు (Attention diversion): 

1.  N. ఉష, వయసు: 40 సంవత్సరములు, నా భర్త పేరు: నారాయణ స్వామి, మాది నయనపల్లి, గుమిరేడిపుర పోస్టు, కోలార్ తాలుకా, కర్ణాటక రాష్ట్రం.

2.  శాంతి @ ఉమా, వయసు: 55 సంవత్సరములు, నా భర్త పేరు: గగన్@కగన్@కన్నన్, మాది 3వ మైను, అమరావతి లేఔట్, బంగారు పేట , కోలార్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం.

3.  వి. సెల్వి, వయసు: 40 సంవత్సరములు, నా భర్త పేరు: వేల్పండి, మాది కొరపల్లి పంపు, బంగార్పేట్, కోలార్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం.

4.  వల్లి, వయసు: 39 సంవత్సరములు, నా భర్త పేరు: అరుణ్, మాది జైమతా నగర్, జోలర్పెట్టై, తిరుపత్తుర్ తాలుక, తమిళనాడు రాష్ట్రం

గతంలో పై ముద్దాయిలు పాల్గొన్న కేసు వివరములు

1.  తమిళనాడు రాష్ట్రంలో ప్రధాన పట్టణాలైన  సేలం, కోయంబత్తూరు, తిరువారూరు, మదురై, తుతుకుడి, చెన్నై లలో దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడినారు.

2.  కర్ణాటక రాష్ట్రం లో ప్రధాన పట్టణాలైన  బెంగళూరు, దర్వాడ, హుబ్లి, హసన్ దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడినారు.

3.  ఆంధ్ర ప్రదేశ్ లో చిత్తూరు జిల్లా లోని చిత్తూరు పట్టణం లో పలు దొంగతనాలు పాల్పడినారు.


కన్నపు దొంగతనాలు చేయు ముద్దాయిల వివరాలు (House breaking): 

1.   శక్తీ వేలు, కరంబూర్, తిరుపత్తూర్, తమిళనాడు 

2.   రాజు, కరంబూర్, తిరుపత్తూర్, తమిళనాడు


గతంలో పై ముద్దాయిలు పాల్గొన్న కేసు వివరములు

1.  తమిళనాడు రాష్ట్రంలో ప్రధాన పట్టణాలైన  వెల్లూరు, సముల్పట్టి, క్రిష్ణగిరి, ధర్మపురి, మేల్పడి, పోన్నై నగరాలలో కన్నపు నేరాలు పాల్పడినారు.

2.  ఆంధ్ర ప్రదేశ్ లో చిత్తూరు జిల్లా లోని బైరెడ్డి పల్లె, కుప్పం, పలమనేరు, వి.కోట, చిత్తూరు, పాలసముద్రం, G.D.నెల్లూరు, పూతలపట్టు  పట్టణాలలో కన్నపు నేరాలు పాల్పడినారు.గొలుసు దొంగతనాలు చేయు ముద్దాయిల వివరాలు (Chain snatching):

1.  C. రఘు s/o చంద్ర బాబు, పల్లిపట్టు, తమిళనాడు. 

2.  A. హమీద్ s/o మహమ్మద్ హనిఫ్, అంబూరు, తమిళనాడు.


గతంలో పై ముద్దాయిలు పాల్గొన్న కేసు వివరములు