శివరాత్రి సందర్భంగా పట్టిసం ఆలయానికి వొచ్చే భక్తు లకు శీఘ్ర దర్శన ఏర్పాట్లు..




పోలవరం (పట్టిసం) (ప్రజా అమరావతి);  


శివరాత్రి సందర్భంగా పట్టిసం ఆలయానికి వొచ్చే భక్తు లకు శీఘ్ర దర్శన ఏర్పాట్లు..



పట్టిసం ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు నిచ్చి నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నందున ఆలయ అభివృద్ధి కి నిధులు కేటాయింపు ఇవ్వడం జరిగిందని దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఎమ్.వి. సురేష్ బాబు తెలిపారు.


శివరాత్రి సందర్భంగా పట్టిసం లోని భద్ర కాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం వద్ద భక్తులకు త్వరితగతిన దర్శనం కలిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టామని, సమన్వయ శాఖలు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తహసీల్దార్ బి. సుమతి  పేర్కొన్నారు. 


బుధవారం ఉదయం స్థానిక పట్టిసం ఆలయ ప్రాంగణంలో  శివరాత్రి వేడుకలు నిర్వహణపై అధికారులు, తదితరులతో రెండోసారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జనవరి 31న సమన్వయ శాఖల అధికారులతో, కమిటీ సభ్యులతో శివరాత్రి వేడుకల ఏర్పాట్లు పై సమీక్ష నిర్వహించామన్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు అత్యంత జాగ్రత్తగా శివరాత్రి వేడుకలు నిర్వహించనున్నందున రెండు రాత్రులు, ఒక పగలు భక్తుల తాకిడి ని దృష్టిలో పెట్టుకొని రూట్ మ్యాప్ సిద్ధం చేసామన్నారు. కోవిడ్ మార్గదర్శకాలు తూ. ఛా. తప్పకుండా పాటించాలని ఆమె స్పష్టం చేశారు. 


కోవిడ్ ను దృష్టిలో పెట్టుకొని దర్శనానికి వొచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ధ్రువపత్రం /మొబైల్స్ లో కోవిడ్ సర్టిఫికెట్ వ తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. అందుకు అనుగుణంగా దేవస్థానం, పోలీస్, రెవెన్యూ, పంచాయతీ శాఖలు చర్యలు తీసుకోవాలని కోరారు. రేవు వద్ద బోట్స్ రవాణా, పెర్రీ సామర్ధ్యం పై పోర్ట్ అధికారులు  భద్రత పరమైన సిఫార్సు లు చెయ్యాలన్నారు. ఫైర్, ఫారెస్ట్, విద్యుత్తు, పంచాయతీ రాజ్,  ఆర్.డబ్ల్యూ.ఎస్. విద్యుత్ తదితర శాఖలు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఎటువంటి ఘటనలు జరగకుండా చూసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్తు సరఫరా లో ఆటంకాలు లేకుండా రెండు జనరేటర్లు ఏర్పాటు చేయాలన్నారు.


డిఎస్పీ కె.లతాకుమారి మాట్లాడుతూ, దర్శనానికి వొచ్చే భక్తులు వాహనాలు పార్కింగ్, క్యూ లైన్ ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సజావుగా భక్తులు దర్శనం చేసుకోవదానికి ఇద్దరు ఏసీపీ, 54 మంది ఎస్ ఐ లు, 500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వేడుకల్లో ఎటువంటి అవాంతరాలు లేకుండా పోలీసు వారి సూచనలు పాటించవలసినదిగా కోరుతున్నామన్నారు. అందుకు అనుగుణంగానే పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.


దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 100 అడుగులతో కంపార్టమెంట్స్, క్యూ లైన్స్, కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ క్యూ లైన్స్ క్రమబద్ధీకరణ, ప్రసాదాలు వితరణ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉప కమిషనర్ ఎమ్. విజయరాజు,  తెలిపారు.. రూ.20/50/300 దర్శనం టికెట్స్ భక్తులకు అందుబాటులో ఉంచుతున్నాము. లింగోద్భవ సమయంలో ఒక గంట పాటు ప్రత్యేక పూజలు సమయంలో దర్శనాలు నిలుపుదల చేస్తున్న ట్లు తెలిపారు.  రూ.2 కోట్ల 20 లక్షలతో  శాశ్వత ప్రాతిపదికన క్యూ లైన్స్, క్షురసాల, టికెట్ కౌంటర్, వేచిఉండే హాల్, బోట్, తదితర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.  భవిష్యత్తు లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో  జంగిల్ క్లీయరెన్సు, బ్యార్రికేట్ తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసీ వారిచే వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు కోసం ప్రత్యేక తాత్కాలిక బస్ స్టాండ్,  మైక్ అనౌన్స్మెంట్ ద్వారా ప్రయాణికులకు సమాచారం అందచేయ్యడం జరుగుతుంది. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆటోలు, ఇతర ప్రజా రవాణా వాహనాలు యజమానులతో సమావేశం నిర్వహించడం ద్వారా అధిక ధరలు వసూలు చెయ్యకుండా అవగాహన కల్పిస్తాము. సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో త్రాగునీరు, ఆహారం, చిన్నారులకు పాలు అందచేయ్యడం జరుగుతుందని హామీ ఇచ్చారు.

 ఆర్టీసీ వారి ద్వారా కొవ్వూరు/రాజమండ్రి నుంచి పట్టిసం కి గతంలో 22 బస్సులు , జంగారెడ్డిగూడెం నుంచి 32, తాడేపల్లిగూడెం నుంచి 25 బస్సులు గతంలో ఏర్పాటు చేశారని ,భక్తులు రద్దీకి అనుగుణంగా ఈ ఏడాది ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఆర్.డబ్ల్యు.ఎస్. అధికారులు త్రాగునీరు సరఫరా, మరుగుదొడ్లు ఏర్పాటు, అటవీ శాఖ , ఆర్ అండ్ బి జంగిల్ క్లీయరెన్సు పనులు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో పట్టిసం శివరాత్రి వేడుకల పోస్టర్ ను ఆవిష్కరించారు.


ఈ సమావేశంలో పట్టిసం సర్పంచ్ ఎస్. శ్రీరామ మూర్తి, పాత పట్టిసం సర్పంచ్ ఎమ్. విజయదుర్గా, ఎంపిపి సుంకర వెంకటరెడ్డి,   సంబంధించిన శాఖలు అధికారులు, ఏసీ ఎండోమెంట్ సీహెచ్. చంద్రశేఖర్, తహశీల్దార్ బి. సుమతి,ఎంపీడీఓ సీహెచ్. శ్రీనివాస్ బాబు, సి ఐ కె. విజయబాబు, సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధి కృష్ణా రావు, స్థానిక ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.



Comments