తిరుమల శ్రీ పద్మావతి అతిథిగృహం నకు చేరుకున్న గౌ. ఉప రాష్ట్రపతి.
తిరుమల, ఫిబ్రవరి 9 (ప్రజా అమరావతి);
రెండు రోజుల పర్యటనలో భాగంగా జిల్లాకు విచ్చేసిన గౌ.* *ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి తిరుమల శ్రీ పద్మావతి అతిథి* *గృహం వద్ద ఘన స్వాగతం లభించింది.
బుధవారం మధ్యా హ్నం తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్, తిరు పతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు, టి టి డి సి వి ఎస్ ఓ గోపీనాథ్ జెట్టి, తిరుపతి ఆర్డీవో కనక నరసా రెడ్డి ఘన స్వాగతం పలికారు..
బుధవారం రాత్రి శ్రీ పద్మావతి అతిథి గృహం నందు గౌ. ఉపరాష్ట్రపతి గారు బస చేసి గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు..
addComments
Post a Comment