వై.ఎస్.ఆర్. జగనన్న భూరక్ష సర్వే పనులను వేగవంతం చేయాలి


 వై.ఎస్.ఆర్. జగనన్న భూరక్ష సర్వే పనులను వేగవంతం చేయాలి


ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. పనులు జరిగే ప్రాంతాల వద్ద నీడ షెడ్ల నిర్మాణం

జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి

విజయనగరం ఫిబ్రవరి, 23 (ప్రజా అమరావతి):  బొండపల్లి మండలం తమటాడ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పర్యటించారు.  తమటాడ గ్రామం బద్దిచెరువులో జరుగుతున్న ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. పనులను పరిశీలించారు.  వేసవిని దృష్టిలో పెట్టుకొని ఉపాధి పనులకు వచ్చే వారు తమ వెంట మంచినీటిని ఎక్కువగా తెచ్చుకోవాలన్నారు. ఉపాధి కూలీలు ఉదయం నిర్ణీత సమయానికి వచ్చి పనులను చేపట్టాలన్నారు.  ఆ ప్రాంతంలో నీడ కోసం షెడ్డును నిర్మించాల్సిందిగా  డ్వామా ఎపిడి లక్ష్మణరావును ఆదేశించారు.  చెరువు పనులకు సంబంధించి చెరువును సర్వే చేసి సరిహద్దు వెంబడి మొక్కలను నాటాల్సిందిగా సర్వే అధికారులను ఆదేశించారు.  

వై.ఎస్.ఆర్. జగనన్న భూరక్ష పధకంలో భాగంగా పంట పొలాలు, స్థలాలలో ఏర్పాటు చేసిన సరిహద్దు రాళ్లను పరిశీలించారు. ఈ పధకానికి సంబంధించి వేగవంతంగా సర్వే పూర్తిచేయాల్సిందిగా సర్వే అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.  

అనంతరం జిల్లా కలెక్టర్ బొండపల్లి మండలం ముద్దూరు గ్రామ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసారు.  సచివాలయ సిబ్బంది యూనిఫారంను ధరించాల్సింది వుంటుందన్నారు.  సచివాలయ తనిఖీలో భాగంగా ప్రజలకు అందిస్తున్న సేవలను శాఖల వారిగా అడిగితెలుసుకున్నారు.  సచివాలయ పరిధిలో వస్తున్న సర్వీసులు వాటి పరిష్కారం ఎంతవరకు జరిగిందన్న వివరాలను అడిగారు.   ఫించన్లు, కుల దృవీకరణ, ఆదాయ సర్టిఫికేట్లు, రేషన్ కార్డులు తదితరాల వివరాలను అడిగి నిర్థేశిత సమయంలోగా అందించాలని ఆదేశించారు. వాలంటీర్లు, సిబ్బందిల బయోమెట్రిక్ అటెండెన్సును పరిశీలించారు.  సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, స్పందన అర్జీల రిజిష్టర్, సంక్షేమ పధకాల క్యాలండర్లు, పోస్టర్లు పరిశీలించారు. నాడు–నేడు పనులకు సంబంధించి సచివాలయ పరిధిలో గల అంగన్వాడీ, పాఠశాలలు, ఆర్.బి.కె.లు, సిసి రోడ్లు తదితర పనులపై ఆరా తీసారు.  మార్చి నాటికి సంబంధిత పనులన్నింటిని పూర్తి చేయాలన్నారు.  గృహ నిర్మాణ పనులు లే-అవుట్ల పనులు మందకొడిగా జరుగుతున్నాయని లబ్దిదారులకు రుణ సౌకర్యం కల్పిస్తున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు.  లబ్దిదారులలో అవగాహన కల్పించి గృహాలను కట్టించాల్సిన బాధ్యత గ్రామ సర్పంచ్ దేనని స్పష్టం చేసారు.  జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకం (ఒటిఎస్)కు సంబంధించి సచివాలయ పరిధిలో ఎన్ని చేసారని విఆర్ఓను అడుగగా మొత్తం 53 మందిని గుర్తించగా 44 మందికి రిజిస్ట్రేషన్ అయ్యాయని కలెక్టర్ కు తెలిపారు.  మిగిలినవి కూడా వేగవంతం చేయాలని, ప్రతీ ఒక్కరు ఒటిఎస్ ను సద్వియోగం చేసుకొనే విధంగా అవగాహన కల్పించాలన్నారు.  కోవిడ్ వ్యాక్షినేషన్ కు సంబంధించి మొదటి, రెండు డోసులు ఎంత శాతం అయిందని ఎఎన్ఎం ను అడిగారు.  అదేవిధంగా మూడవ డోసుకు సంబంధించి ఫ్రంట్ లైన్ వర్కర్సుకు వ్యాక్షినేషన్ కవర్ అయినది లేనిది అడిగారు.  కోవిడ్ వ్యాధితో  మరణించిన వారి లిస్టును అప్లోడ్ చేయాలన్నారు. మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారా, చిన్నారులకు గోరుముద్ద కిట్ సమయానికి ఇస్తున్నారా, సచివాలయ పరిధిలో అంగన్వాడీ కేంద్రాలు ఎన్ని వున్నాయి, బరువు తక్కువ వున్న పిల్లలు ఎవరైనా వున్నారా, వారి ఎత్తు, బరువులను చూస్తున్నారా, హెచ్.బి. టెస్టులు చేస్తున్నారా,  పాఠశాలలో మధ్యాహ్నం భోజన మెనూ పరిశీలిస్తున్నది లేనిది తదితరాలను వివరంగా అడిగితెలుసుకున్నారు.  

అనంతరం జిల్లా కలెక్టర్ ఆ ప్రాంత రైతులతో మాట్లాడారు.  రైతు బాలిపెంటం నాయుడు మాట్లాడుతూ తమ గ్రామంలో ఈ-క్రాప్ పూర్తిస్థాయిలో జరగలేదని, ఎప్పుడు వెళ్లినా సిస్టం సరిగ్గా పనిచేయడం లేదని చెప్పుతున్నారని, రికార్డులు కూడా సరిగ్గా లేవని, సర్వే కూడా పూర్తి స్థాయిలో జరగడం లేదని ఫిర్యాదు చేసారు.  అందుకు కలెక్టర్ స్పందిస్తూ ప్రతీ ఒక్కరికి ఈ-క్రాప్ చేస్తారని, సర్వే పనులు కూడా జరుగుతున్నాయని, ప్రతీ పని చేయడం జరుగుతుందని తెలిపారు.  వ్యవసాయంలో ఆధునిక పద్దతులలో సాగు విధానంలో మెళుకవలు తెలుసుకోవాలని, యూరియా వాడకాన్ని తగ్గించుకొని,  కషాయాల వాడకం ద్వారా ప్రకృతి సేధ్యం చేయాలని సూచించారు.  

      కలెక్టర్ పర్యటనలో డ్వామా ఎపిడి, ఇఓ పిఆర్డి, సర్వే, వ్యవసాయ శాఖాధికారులు పాల్గొన్నారు.

Comments