శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .
జిల్లాలకు సంబంధించిన పునర్విభజన ప్రక్రియ చాలా ప్రశాంతంగా జరగడం సంతోషకరం .
జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన కొత్త జిల్లాలకు భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న మహనీయుడు అల్లూరి సీతారామ రాజు గారి పేరు , అదేవిధంగా పార్టీలకు అతీతంగా మాజీ ముఖ్యమంత్రి మరియు మహానటుడు శ్రీ ఎన్.టీ.రామారావు గారి పేర్లను కొత్త జిల్లాలకు పెట్టడం శుభపరిణామం.
చంద్రబాబునాయుడు గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తమ హయాంలో ఎన్టీఆర్ పేరు ఎక్కడ కనపడకూడదు అనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ పేరు పెట్టలేదు . ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక జిల్లా పేరును ఎన్టీఆర్ జిల్లాగా ప్రకటించడంతో తట్టుకోలేక కొంతమందిని రెచ్చగొట్టి గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.
నెల్లూరు పార్లమెంట్ లో భాగంగా ఉన్నటువంటి సర్వేపల్లి నియోజకవర్గాన్ని తిరుపతి పార్లమెంటులో కలిపి సర్వేపల్లి ప్రజలకు గతంలో తీవ్ర అన్యాయం చేయడం జరిగింది . ఆనాడు ఉన్నటువంటి నాయకులు సర్వేపల్లి నియోజకవర్గాన్ని తిరుపతిలో కలిపినప్పటికీ కిమ్మనకుండా మౌనం వహించడంతో అన్యాయం జరిగిన విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వివరించి ప్రజల ఆశలను, ఆకాంక్షలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో ఉంచాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది .
వైఎస్సార్సీపీ మ్యానిఫెస్టోలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తాం అని హామీ ఇవ్వడం జరిగినప్పటికీ నా విజ్ఞప్తి మేరకు సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు పార్లమెంటు పరిధిలోని జిల్లాలో కలిపినందుకు గానూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నియోజకవర్గ ప్రజలందరి తరుపున ధన్యవాదాలు తెలుపుతూ వారం రోజుల పాటు "జగనన్న వరం - సర్వేపల్లి ప్రజలు నీరాజనం" పేరుతో వారోత్సవాలు నిర్వహించడం జరిగింది .
పార్లమెంటుకు అదనంగా ఒక నియోజకవర్గాన్ని కలిపి జిల్లాను ఏర్పాటు చేయడమనేది అసాధారణ నిర్ణయం అందుకనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఘనంగా ధన్యవాదాలు తెలపాలనే ఉద్దేశ్యంతో వారంరోజులపాటు వారోత్సవాలు నిర్వహించాం .
సర్వేపల్లి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలిపి ఉన్నట్లయితే నియోజకవర్గంలోని ప్రజలు సాగునీటి పరంగా , వ్యవసాయపరంగా , వైద్య సేవల పరంగా ,విద్య పరంగా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది .
సర్వేపల్లి నియోజకవర్గాన్ని ప్రజల ఆకాంక్ష మేరకు నెల్లూరు జిల్లాలో కొనసాగించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు .
సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు పార్లమెంట్ నుండి విడతీసి తిరుపతి పార్లమెంట్ లో కలిపినప్పుడే ఆనాటి నాయకులు గళం విప్పి వుంటే సర్వేపల్లికి ఈనాడు ఈ పరిస్థితి తలెత్తేది కాదు .
సర్వేపల్లి ప్రజల మనోభావాలు తెలియజేసి గతంలో జరిగిన పొరబాటు సరిదిద్ది నెల్లూరు జిల్లాలో కొనసాగించమన్న నా విజ్ఞప్తిని మన్నించిన ముఖ్యమంత్రి గారికి నా దన్యవాదాలు .
సర్వేపల్లి నియోజకవర్గంలో ఊరు , వాడ అన్ని చోట్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని దైవ సమానంగా బావిస్తూ పాలాబిషేకం నిర్వహిస్తూ , పూలు చల్లి ప్రజలందరితో కలిసి గ్రామ స్థాయిలో ర్యాలీలు చేపట్టడం సంతోషకరం .
"జగనన్న వరం -సర్వేపల్లి ప్రజల నీరాజనం" పేరుతో జరిగిన వారోత్సవాల లో భాగంగా మహిళలతో ,యువతతో ,ఉద్యోగస్తులతో , ప్రజలతో కలిసి ర్యాలీలు నిర్వహించడం జరిగింది . అలాగే నియోజకవర్గంలోని విద్యార్థులందరికీ 50 వేల ప్యాకెట్ల చాక్లెట్లు పంచడం జరిగింది మరియు క్రీడాపోటీలు , వ్యాస రచన పోటీలు నిర్వహించి బహుమతులు అందించడం జరిగింది .
addComments
Post a Comment