శ్రీ శైలం (ప్రజా అమరావతి); మహాశివరాత్రి ఉత్సవములు-2022 సందర్భముగా శ్రీ భ్రమరంభా మల్లిఖార్జున స్వామివార్ల దేవస్థానం, శ్రీశైలం లోని శ్రీ భ్రమరంభా మల్లిఖార్జున స్వామివార్లకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం,ఇంద్రకీలాద్రి తరుపున శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ గారు మరియు అర్చక బృందం శ్రీశైలం దేవస్థానం చేరుకోగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి(శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం) వారు శ్రీ భ్రమరంభా
మల్లిఖార్జున స్వామివార్లను దర్శనము చేసుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీ భ్రమరంభా మల్లిఖార్జున స్వామివార్ల దేవస్థానం వేదపండితులు వీరికి వేద ఆశీర్వచనము చేయగా, కార్యనిర్వహణాధికారి(శ్రీశైలం) శ్రీ లవన్న , శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ వారికి స్వామివార్ల చిత్రపటము, శేషవస్త్రము మరియు ప్రసాదములు అందజేసినారు. ఈ కార్యక్రమములో ఆలయ ఆలయ వైదిక కమిటీ శ్రీ ఆర్.శ్రీనివాస శాస్త్రి , వేదపండితులు, అర్చకులు, మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment