కేఆర్ పురం పరిధిలో నిర్మాణాల పురోగతి చాలా బాగా జరుగుతోందని పేర్కొన్నారు



కోట రామచంద్రపురం (ప్రజా అమరావతి);


గిరిజన ప్రాంతాల్లో, జిల్లాలో గిరిజన సంక్షేమ కార్యక్రమాలు అమలు తీరును పరిశీలించేందుకు ఐటిడిఎ ప్రాంతాల్లో పర్యటించడం జరుగుతోందని గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు చిన వీరభద్రుడు పేర్కొన్నారు. 


బుధవారం కె ఆర్ పురం అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో  తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన వీరభద్రుడు మాట్లాడుతూ, ఇప్పటికే నెల్లూరు, పాడేరు ఐటిడిఎ లలో పర్యటించి పనులు తీరును పరిశీలించామన్నారు. బోతప్ప గూడెం ఏకలవ్య గిరిజన సంక్షేమ వసతి గృహాన్నీ  సందర్శించామని, విప్పాలపాడులో నిర్మాణం లో ఉన్న గురుకుల పాఠశాల పనులనీ పర్యవేక్షణ చేశామన్నారు. కేఆర్ పురం పరిధిలో నిర్మాణాల పురోగతి చాలా బాగా జరుగుతోందని పేర్కొన్నారు


. పాఠశాలలు తనిఖీ ల్లో భాగంగా భోదన విధానాన్ని పరిశీలించమన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇంగ్లీష్ భోదనకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్న దృష్ట్యా సామర్ధ్యాన్ని కూడా పరీక్షించామన్నారు. 


 రెండు రోజుల పాటు ఈ ప్రాంతంలో పర్యటన చేస్తున్నామని, ముఖ్యంగా జరుగుతున్న అభివృద్ధి పనులు, పునరావాస పనుల ప్రగతిపై సమీక్షించడం జరిగిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలో పునరావాస పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, వాటి అమలు చేస్తున్న తీరును రెండు రోజుల పర్యటన లో పరిశీలన చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో విద్య కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో మొత్తం 1953 గిరిజన పాఠశాలలు,   378 ఆశ్రమ పాఠశాలు,   199 గురుకుల పాఠశాల లు ఉన్నాయి, వాటిలో 89 గిరిజన సంక్షేమ వసతి గృహాలు మార్పు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతొందని వీర భద్రుడు తెలిపారు.







ఈ పర్యటన లో పిఓ ఐటీడిఏ ఓ. ఆనంద్, ట్రైబుల్ వెల్ఫేర్ డిడి వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్, తదితర అధికారులు పాల్గొన్నారు.


Comments