రథసప్తమికి వేకనూరులో పోటెత్తిన భక్తజన సంద్రం.

 


అవనిగడ్డ నియోజకవర్గం (ప్రజా అమరావతి);


రథసప్తమికి వేకనూరులో పోటెత్తిన భక్తజన సంద్రం.


సకల జీవ రాశుల జీవనానికి ఆద్యుడు సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత నమోస్తుతే అంటూ ప్రతి రోజు సూర్య భగవానుని దర్శనం చేసుకుని ఈ మంత్రం జపిస్తాం ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించే సూర్య భగవానుడు సప్త అశ్వాల రథం పై పయనిస్తూ సకల జీవులను పరిరక్షిస్తున్నారు. 


మాఘమాసం రథసప్తమి నాడు సూర్య జయంతి, రథసప్తమి


రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అరసవల్లి లోను దేశంలోని కోణార్క్ లో ప్రసిద్ధ సూర్య దేవాలయాలు ఉన్నాయి. వాటిని పోలిన ఆలయమే మన రాష్ట్రంలోని కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం వేకనూరు లో ఉంది. గ్రామానికి చెందిన తుంగలవీర వసంతరావు, ఇందిరా దంపతులు కోటి రూపాయల వ్యయంతో వేకనూరు లో సూర్య దేవాలయాన్ని 12 ఏళ్ల క్రితం నిర్మాణం చేశారు. అభివృద్ధి చెందుతూ మంగళవారం 12వ వార్షికోత్సవం నిర్వహించారు. అలాగే రథసప్తమిని పురస్కరించుకుని ఆదిత్యుడికి116 లీటర్ల ఆవు పాలతో క్షీరాభిషేకం నిర్వహించి భక్తులకు స్వామివారి నిజస్వరూపాన్ని దర్శనం కల్పించారు. లోకకళ్యాణార్థం సమస్త భక్త ఆరోగ్య పరిరక్షణ కోసం మహా మార్తాండ పుత్రకామేష్టి యజ్ఞ క్రతువు వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం పండితులు దీవి నరసింహ మూర్తి ఆధ్వర్యంలో రుత్వికులు నిర్వహించారు. అనంతరం తెనాలికి చెందిన వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు నిర్వహించారు. అనంతరం ఉషా పద్మిని సమేత సూర్యనారాయణ స్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్త బృందానికి ఆలయ ప్రాంగణంలో గ్రామానికి చెందిన తుంగల శ్రీనివాస పెరుమాల్లు ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించారు భక్తులతో వేకనూరు కిటకిటలాడింది.

Comments