కాలుష్య సమస్యను పరిష్కరించాలని కవులూరు రైతుల నిరసన దీక్ష

 కాలుష్య సమస్యను పరిష్కరించాలని కవులూరు రైతుల నిరసన దీక్ష



కొండపల్లి ఐడిఏలో జి.ఎం.కె ల్యాబ్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీలో బైఠాయించిన కవులూరు రైతులు


జి.కొండూరు, ఫిబ్రవరి 28 (ప్రజా అమరావతి):


కృష్ణాజిల్లా జి.కొండూరు మండల పరిధిలోని కవులూరు గ్రామ రైతులు కొండపల్లి ఐడిఏ కాలుష్యం కారణంగా నానా అవస్థలు పడుతున్నారు. దాదాపు రెండు వేల ఎకరాలు భూములు చౌడు భూములుగా మారిపోయాయి. పశుపక్ష్యాదులు మృత్యువాత పడుతున్నాయి. రైతులకు ప్రజలకు అంతుచిక్కని వ్యాధులు సోకుతున్నాయి. దీనిపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు స్పందించారు. రైతుల పక్షాన నిలబడిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు సమస్యపై చర్యలు తీసుకోవాలని సొసైటీ అధ్యక్షులు గొట్టుముక్కల ఓంకార్ కు సూచించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు ఓంకార్ బాబు స్పందించారు. కవులూరు గ్రామపంచాయతీ కూడా ఈ కాలుష్యం అరికట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. కవులూరు రైతులు అందరూ పార్టీలకతీతంగా తరలివచ్చారు. కాలుష్యం వెదజల్లుతున్న కంపెనీలకు పంచాయతీ తీర్మానం కాపీలని అందజేశారు. అనంతరం జి.ఎం.కె ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రైతులు బైఠాయించారు. కాలుష్య సమస్య పరిష్కారమయ్యే వరకు తాము నిరసన కొనసాగిస్తామని రైతులు వెల్లడించారు.

Comments