శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి కోటప్పకొండ తిరునాళ్ళ కొరకు పోలీస్ శాఖ తరపున పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాం

 గుంటూరు జిల్లా.  నర్సరావుపేట   (ప్రజా అమరావతి);                    శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి కోటప్పకొండ తిరునాళ్ళ కొరకు పోలీస్ శాఖ తరపున పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాం



 గుంటూరు రూరల్ ఎస్పీ  విశాల్ గున్ని మాట్లాడతు


భక్తులకు భద్రతా పరంగా మరియు ట్రాఫిక్ పరంగా సమస్యలు తలెత్తకుండా తగినంత మంది పోలీసులతో ప్రణాళిక సిద్ధం చేసాం.


తిరునాళ్లకు విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా వ్యవహరించాలని మా సిబ్బందికి సూచించాము.


 నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగనున్న కోటప్పకొండ తిరునాళ్లకు సంబంధించి పోలీస్ మరియు ఇతర శాఖల అధికారులు చేస్తున్న ఏర్పాట్ల గురించి స్థానిక ఎమ్మెల్యే  గోపిరెడ్డి.శ్రీనివాసరెడ్డి  మరియు ఆయా శాఖల అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించిన  రూరల్ ఎస్పీ.


 తిరునాళ్ల రోజు దేవుని దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఇతర శాఖల అధికారులు సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలని మా పోలీస్ అధికారులను ఆదేశించాం.


గత పది రోజుల నుండి మా డీఎస్పీ ,సీఐలు మరియు ఎస్సైలు తిరునాళ్ల భద్రత ఏర్పాట్ల గురించి ఇప్పటికే రెండు సార్లు వివిధ శాఖల అధికారులతో సమీక్ష.

Comments