ఉక్రెయిన్ లో చిక్కుకున్నతెలుగువారందరినీ క్షేమంగా తిరిగి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు

 ఉక్రెయిన్ లో చిక్కుకున్నతెలుగువారందరినీ క్షేమంగా తిరిగి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు


రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్సు కమిటీ-1902 నంబరుతో కూడిన కంట్రోల్ రూమ్ 

జిల్లా కలక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు

0863-2340678తో హెల్ప్ లైన్ కేంద్రం,+91-8500027678 వాట్సప్ గ్రూప్ 

కేంద్ర విదేశాంగశాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు,సమన్వయం

ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగువారెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

   ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ

అమరావతి,25 ఫిబ్రవరి (ప్రజా అమరావతి):ఉక్రెయిన్ సంక్షోభం నేపధ్యంలో అక్కడ చిక్కుకున్నవిద్యార్ధులు, తెలుగువారందరినీ క్షేమంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని కావున విద్యార్ధులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ స్పష్టం చేశారు.శుక్రవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకులో ప్రత్యేక అధికారి గితేశ్ శర్మ(ఇంటర్నేషనల్ కోఆపరేషన్)తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్ లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన వారందరినీ సుక్షితంగా తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఎప్పటికప్పుడు విదేశాంగశాఖ అధికారులతో సంప్రదిస్తున్నట్టు తెలిపారు.ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారిని స్వరాష్ట్రానికి తీసుకువచ్చేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో వివిధ అధికారులతో ఒక టాస్క్ ఫోర్సు కమిటీని ఏర్పాటు చేశామని సిఎస్ చెప్పారు.ఈటాస్క్ ఫోర్సు కమిటీలో రాష్ట్ర టిఆర్అండ్బి శాఖ ముఖ్య కార్యదర్శి యం.టి కృష్ణ బాబు,ఎపి డైరీ డెవలప్మెంట్ ఎండి డా.ఎ.బాబు,ఢిల్లీలోని ఎపి భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాశ్,రాష్ట్ర రైతు బజారుల సిఇఓ శ్రీనివాసులు,ఎపి ఎన్ఆర్టి సొసైటీ సిఇఓ కె.దినేష్ కుమార్,ప్రత్యేక అధికారి (ఇంటర్నేషనల్ సహకారం) గితేశ్ శర్మ,రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కమీషనర్ కె.కన్నబాబు,అందరు జిల్లా కలక్టర్లు సభ్యులుగా ఉన్నారని సిఎస్ తెలిపారు.ఉక్రెయిన్ లో చిక్కున్న మన రాష్ట్రానికి చెందిన వారందరూ తిరిగి వచ్చే వరకూ ఈటాస్క్ ఫోర్సు కమిటీ పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే ఈఅంశంపై సమీక్షించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయడంతో పాటు కేంద్ర విదేశాంగ శాఖమంత్రి వర్యులకు లేఖ కూడా వ్రాశారని చెప్పారు.

ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్ధులు,ఇతర తెలుగు వారిని ఆదుకునేందుకు 1902 టోల్ ప్రీ డెడికేటెడ్ నంబరుతో హెల్ప్ లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఇది 24గంటలూ పనిచేస్తుందని ఎవరైనా దీనికి సమాచారం అందించవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ చెప్పారు.అలాగే 0863-2340678 నంబరుతో కూడిన హెల్ప్ లైన్ కేంద్రాన్ని+91-8500027678 నంబరుతో కూడిన వాట్సప్ గ్రూపును కూడా ఏర్పాటు చేయడమైనదని తెలిపారు.అదే విధంగా https://www.apnrts.ap.gov.in/ వైబ్ సైట్ ను కూడా అందుబాటులో ఉంచామని చెప్పారు.అంతేగాక జిల్లా స్థాయిలో జిల్లా కలక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మండల స్థాయిలో తహసిల్దార్లు వారి మండలాల పరిధిలో ఎవరైనా ఉక్రెయిన్ లో చిక్కుకుని ఉంటే వారి  బంధులు తదితరలు నుండి వివరాలు సేకరించి జిల్లా,రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ తో సమన్వయం చేస్తారని తెలిపారు.ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్దులు,తదితరులు ఎవరైనా పై పేర్కొన్న హెల్ప్ లైన్ నంబర్లను సంప్రందించి వారి వివరాలను తెలియజేస్తే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని సిఎస్ డా.సమీర్ శర్మ పేర్కొన్నారు.

ఉక్రెయిన్ లో చిక్కున్న భారతీయులను స్వదేశానికి తీసుకవచ్చేందుకు కేంద్ర విదేశాంగ శాఖ 4 బృందాలను ఏర్పాటు చేసిందని సిఎస్ డా.సమీర్ శర్మ వెల్లడించారు.ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను ఉక్రెయిన్ భూ సరిహద్దు దేశాల వరకూ తీసుకువచ్చి అక్కడి నుండి విమానాల ద్వారా హంగేరీ,పోలండ్,స్లోవక్ రిపబ్లిక్ మరియు రొమేనియాల ద్వారా స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర విదేశాంగశాఖ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈబృందాలతో సమన్వయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని సిఎస్ పేర్కొన్నారు. హంగేరీ టీం 1)ఎస్.రాంజీ మొబైల్ నం.+36305199944,వాట్సప్ నంబరు +917395983990.కు అలాగే 2) అన్కూర్ మొబైల్ మరియు వాట్సప్ నంబరు: 36308644597కు,3) మోనిత్ నాగ్ పాల్ మొబైల్ నం.+36302286566,వాట్సప్ నం.+918950493059కు సంప్రదించవచ్చును.అదే విధంగా పోలండ్ టీంకు సంబంధించి 1)ఫంకజ్ గార్గ్ మొబైల్ నం.+48660460814/-48606700105 సంప్రదించాలి.స్లోవక్ రిపబ్లిక్ టీంకు సంబంధించి మనోజ్ కుమార్ మొబైల్ నం.+421908025212ను మరియు ఇవాన్ కోజింకా మొబైల్ నం.+421908458724లను సంప్రదించాలి.రొమేనియా టీంకు సంబంధించి గుస్నల్ అన్సారి(Gausnul Ansari)+40731347728,ఉద్దేశ్య ప్రియదర్శి మొబైల్ నం.+40724382287ను,ఆండ్రా హర్లనోవ్(Andra Harlonov)మొబైల్ నం.+40763528454ను,అలాగే మారిస్ సిమా(Marius Sima)మొబైల్ నం.+40722220823లను సంప్రదించాల్సి ఉందని సిఎస్ డా.సమీర్ శర్మ పేర్కొన్నారు.

ప్రత్యేక అధికారి(ఇంటర్నేషనల్ కోఆపరేషన్)గితేశ్ శర్మ మాట్లాడుతూ ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు వారందరినీ తిరిగి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు.ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర విదేశాంగ శాఖమంత్రి వర్యులకు లేఖ వ్రాశారని చెప్పారు.ఈవిషయమై శుక్రవారం సియం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి విద్యార్ధులందరినీ సురక్షితంగా తీసుకువచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారన్నారు.ఇప్పటికే ఉక్రెయిన్ లో చిక్కుకున్న కొంతమంది విద్యార్ధులతో కూడా మాట్లాడడం జరిగిందన్నారు.

ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ సంస్ధ ఎండి డా.ఎ బాబు మాట్లాడుతూ కాల్ సెంటర్ కు ఇప్పటి వరకూ 130 కాల్స్ వచ్చాయని తెలిపారు.ఉక్రెయిన్ లో విద్యను అభ్యసించేందుకు వెళ్ళిన విద్యార్ధులు ఎక్కడెక్కడ ఉన్నది విశ్వవిద్యాలయాలు,పోస్టు కోడ్ ల ఆధారంగా వివరాలు సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

ఈమీడియా సమావేశంలో రాష్ట్ర సమాచారశాఖ కమీషనర్ టి.విజయకుమార్ రెడ్డి,ఎపి ఎన్ఆర్టి సొసైటీ సిఇఓ కె.దినేష్ కుమార్ పాల్గొన్నారు.

    

Comments