*"కాకాణి చేతులు మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం
"*
*" గౌతమ్ రెడ్డిని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురైన కాకాణి"*
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, పోలంరాజుగుంట గ్రామంలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .
*పొలంరాజు గుంట గ్రామంలో రెండు కోట్ల రూపాయలతో పూర్తి చేసిన సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లు, ఆర్వో ప్లాంట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి.*
*సచివాలయ సిబ్బందికి సెల్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి*
యువతకు క్రికెట్ కిట్లు, క్రీడా పరికరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.
సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించడం జగనన్న మనకు ఇచ్చిన వరం.
సర్వేపల్లిని నా విన్నపాన్ని మన్నించి, నెల్లూరు జిల్లాలోనే కొనసాగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సర్వేపల్లి ప్రజల పక్షాన ధన్యవాదాలు.
సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు పార్లమెంట్ నుండి విడగొట్టి, తిరుపతి పార్లమెంట్ లో కలిపినప్పుడు మౌనం వహించిన నాయకులు, సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలో కాకుండా, బాలాజీ జిల్లాలో కలిపి ఉంటే, మా సత్తా చూపించి ఉండేవాళ్లమని ప్రగల్భాలు పలుకుతున్నారు.
సర్వేపల్లి నియోజకవర్గంలోని గ్రామాల్లో సమగ్రంగా, సంపూర్ణంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి, సక్రమంగా పూర్తి చేసి ప్రారంభిస్తున్నాం.
ప్రజలకు సంక్షేమ పథకాలు అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి పార్టీలకతీతంగా అందిస్తున్నాం.
ప్రజలకు ప్రభుత్వ పథకాలు సమగ్రంగా అందజేయడంతో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నిరాజనాలు పట్టడం చూసి, తెలుగుదేశం నాయకులు తట్టుకోలేక పోతున్నారు.
ప్రతిపక్ష పార్టీలు పేదలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అడ్డుకోవడానికి ప్రభుత్వంపై అనేక రకాలుగా బురదజల్లడానికి ప్రయత్నిస్తున్నారు.
తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీల సభ్యుల జోక్యంతోనే పెన్షన్ల పంపిణీ జరిగేవి.
తెలుగుదేశం పాలనలో పెన్షన్ పొందేందుకు అర్హత ఉన్నా, జన్మభూమి కమిటీలు మంజూరు చేయకపోవడంతో, సాక్షాత్తూ గవర్నర్ కు మొరపెట్టుకున్నా ప్రయోజనం శూన్యం.
వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అర్హత కలిగిన వారందరికీ, సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్లను ఏర్పాటు చేసి, ప్రభుత్వ పథకాలు ఇంటి ముంగిటకే చేరుస్తున్నాం.
గౌతమ్ రెడ్డి అకాల మరణం, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి, నాకు వ్యక్తిగతంగా తీరని లోటు.
గౌతమ్ రెడ్డి మనమధ్య ఉన్నప్పుడే, పోలంరాజు గుంట గ్రామంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసి, శిలాఫలకాలు నిర్మించాం.
గౌతమ్ రెడ్డి మనల్ని వదిలి వెళ్ళాక, అధికారులు ప్రోటోకాల్ ప్రకారం తిరిగి ముద్రిస్తామన్నా, నా మనసు అంగీకరించలేదు.
గౌతమ్ రెడ్డిని స్మరించుకుంటూ, గౌతమ్ రెడ్డి పేరును శిలాఫలకంలో చూస్తుంటే, గుండె తరుక్కుపోతుంది.
👉 గౌతమ్ రెడ్డికి సర్వేపల్లి నియోజకవర్గ పక్షాన ఘనమైన నివాళులర్పిస్తున్నాం.
👉 సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అన్ని విధాలా అవసరమైన వసతి సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తాం.
addComments
Post a Comment