తాడేపల్లి (ప్రజా అమరావతి); ఫ్రాన్స్ కు చెందిన గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ఈఎస్ఐజిఈఎల్ఈసి తో కె.ఎల్.విశ్వవిద్యాలయం శనివారం ఒప్పందం కుదుర్చుకుందని సైన్స్ అండ్ హ్యూమనిటీస్ డీన్ డాక్టర్ కిషోర్ బాబు తెలిపారు. ఈ ఒప్పంద పత్రాలను విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ సారధి వర్మ ఈఎస్ఐజిఈఎల్ఈసి ప్రతినిధులు థియరీ బెర్థెలాట్, వసుధ మురళికృష్ణ మార్చుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కిషోర్ బాబు మాట్లాడుతూ, ఈఎస్ఐజిఈఎల్ఈసి మరియు కె.ఎల్.యూ పరస్పర నైపుణ్యాలు, వనరుల సహకారం పంచుకుని నిబద్ధతో కలిసి పని చేస్తామని
తెలిపారు. ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ఒప్పందం వల్ల విద్యార్థులు ఇంటర్న్షిప్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తమ విశ్వవిద్యాలయం విద్యార్థులు అక్కడికి వెళ్ళి చదువుకొనే అవకాశం ఉందని అన్నారు. విద్యార్థులు ఫ్రాన్స్ వెళ్లి చదువుకోవడం వలన అక్కడి విద్యా విధానాలు తెలుసుకుంటారని వెల్లడించారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో ప్రో ఛాన్సలర్ డాక్టర్ జగన్నాధ రావు, రీసెర్చ్ డీన్ డాక్టర్ జైకుమార్ సింగ్, ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, బీబీఏ విభాగాధిపతి, అధ్యాపకులు పాల్గొన్నారు.
addComments
Post a Comment