అమరావతి, ఫిబ్రవరి 24 (ప్రజా అమరావతి):
ఆందోళన వద్దు...అండగా ఉంటాం.
ఉక్రెయిన్లోని విద్యార్థుల క్షేమం కోసం నిరంతరం సమీక్ష.
విద్యార్థుల క్షేమం పట్ల ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ద.
ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను రప్పించేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాసి ప్రత్యేక శ్రద్ధతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధ వాతావరణం నేపథ్యంలో తెలుగు విద్యార్థుల కుటుంబాల్లో నెలకొన్న ఆందోళన పై మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు.
ఉక్రెయిన్ లోని మెడికల్ విద్యార్థి యశ్వంత్ తో ఫోన్లో మాట్లాడి అక్కడి పరిస్థితులు తెలుసుకున్నాం.
తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందవద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది.
ఉక్రెయిన్ లో ఉన్న తెలుగు విద్యార్థులు క్షేమంగానే ఉన్నారు
తల్లిదండ్రులు ఆందోళన పడకండి.
సీఎం జగన్ కేంద్ర మంత్రికి లేఖ రాశారు.
ఏపి ప్రభుత్వం విద్యార్థులను రప్పించేందుకు ప్రయత్నిస్తోంది.
ప్రస్తుతం ఉక్రెయిన్ లో విమాన సర్వీస్ లు రద్దయ్యాయి. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాం.
విద్యార్థుల కు సహాయం కోసం నోడల్ అధికారి, స్పెషల్ ఆఫీసర్ ని నియమించాం.
ఏ పి భవన్ లో అధికారులను అప్రమత్తం చేశాం.
పరిస్థితులు చక్కబడగానే విద్యార్థులను రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు సహకారం అందించటానికి అధికారులను నియమించిన ప్రభుత్వం.
నోడల్ అధికారిగా *రవి శంకర్ 9871999055. ఏపీ భవన్*
అంతర్జాతీయ సహకారం ప్రత్యేక అధికారిగా రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ *గీతేష్ శర్మ. సంప్రదించాల్సిన నెంబర్ 7531904820*
ఏపీ ఎన్ ఆర్ టి సిఈఓ *దినేష్ కుమార్* *9848460046*
addComments
Post a Comment