విజయవాడ (ప్రజా అమరావతి);
ముస్లింలు పవిత్రంగా భావించే మక్కా యాత్రకు అవసరమైన సహకారాన్ని ఏ పి హజ్ కమిటీ ద్వారా ప్రభుత్వం అందిస్తుందని,
ఆంధ్ర ప్రదేశ్ హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ షేక్ గౌస్ లాజామ్ అన్నారు.
విజయవాడ ఎమ్ జి రోడ్ లో గల ఏ పి హజ్ కమిటీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో హజ్ కమిటీ సభ్యులు బద్వేల్ షేక్ గౌస్ లాజామ్ ను నూతన అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో బద్వేల్ షేక్ గౌస్ లాజామ్ మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. ఆంధ్ర ప్రదేశ్ హజ్ కమిటీ ద్వారా మక్కా యాత్రకు వెళ్లే యాత్రీకులను గుర్తించి వారికి ప్రభుత్వ పరంగా మక్కా యాత్రకు సంబందించిన సౌకర్యాలను, ప్రభుత్వ సహకారాన్ని అందించేందుకు కృషి చేస్తానన్నారు. గత ప్రభుత్వం కంటే హజ్ కమిటీ మరింత సమర్థవంతంగా పనిచేసేలా సభ్యులందరమూ కృషి చేస్తామన్నారు. ఏ పి హజ్ కమిటీ ద్వారా మక్కా యాత్రకు సంబంధించి ప్రభుత్వం యాత్రీకులకు కల్పిస్తున్న సహాయ సహకారాలను వివరించేందుకు ప్రతి జిల్లా లోను మూడు ప్రాంతాల్లో అవగాహనా సదస్సులు నిర్వహిస్తామని బద్వేల్ షేక్ గౌస్ లాజామ్ అన్నారు. గత ప్రభుత్వాల కంటే వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఇందులో బాగంగానే మంత్రివర్గంలో ముస్లింలకు ఉప ముఖ్య మంత్రి పదవిని కల్పించారన్నారు. రాష్ట్రంలో ముస్లింలకు సంబంధించి ముగ్గురు శాసన సభ్యులు, నలుగురు ఎమ్ ఎల్ సి లు, 11 మంది కార్పొరేషన్ చైర్మన్ లు, ఒక డిప్యూటీ చైర్మన్ పదవులను ఇచ్చి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముస్లింలను ప్రోచాహించారన్నారు. అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చి వారి సంక్షేమానికి పాటు ఈ ప్రబుత్వమ్ పాటుపడుతున్నారన్నారు. అల్లా కృపతో హజ్ కమిటీ చైర్మన్ గా నియమింప బడ్డానని ఎంతో నమ్మకంతో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నాపై పెట్టిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానన్నారు. నూతనంగా నియమింప బడిన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి చేపట్టిన పధకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని వచ్చే ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి ముస్లింల సోదరులందరు అండగా నిలబడాలని ఏ పి హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ షేక్ గౌస్ లాజామ్ అన్నారు.
ఈ సమావేశంలో ఏ పి మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్ బాషా, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహమ్మెద్, ఆంధ్ర ప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి జి. షమీమ్ అస్లాం, ఏ పి హజ్ కమిటీ సభ్యులు మహమ్మద్ నవాజ్ బాషా (ఎం ఎల్ ఏ), షేక్ ఇసాక్ బాషా (ఎం ఎల్ సి), మునీర్ బాషా, మహమ్మద్ ఇమ్రాన్, షేక్ అతావుల్లా (ఎం పి టి సి), షేక్ గులాబ్ జాన్, సయ్యద్ వలీ వుల్లా హుస్సేన్, మహమ్మద్ తారీఖ్, షేక్ మొహమ్మద్ బాషా, మహమ్మద్ ఇబాదుల్లా, షేక్ ఖదీర్, మౌలానా షాక్ మంజూర్ అహమ్మెద్, ముఫ్తి అబ్దుల్ బాసిత్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment