దోపిడీ చేసే చట్టాలను ఉల్లంఘించాల్సిందే




దోపిడీ చేసే చట్టాలను ఉల్లంఘించాల్సిందే 


మత్స్యకారుల ఉనికిని దెబ్బ తీసే జీవో 217ను చించేస్తున్నా 

తక్షణమే ఆ జీవోను ఉపసంహరించుకోవాలి... లేని పక్షంలో ఆందోళనలకు దిగుతాం 

అవసరమైతే జైలుకు వెళ్ళేందుకు సిద్ధం

లేని సమస్యలు సృష్టించడంలో వైసీపీవాళ్ళు సిద్ధహస్తులు 

పరిష్కరించండని వంగి వంగి దండాలు పెట్టాలా? ఇదేమైనా రాచరికమా?

ప్రజలు అధికారం ఇచ్చింది మటన్ కొట్లు... చికెన్ కొట్లు పెట్టుకోవడానికా?

మద్యం అమ్ముకొంటున్నారు కదా... ఆ పక్కనే చీకుల కొట్లు కూడా పెట్టుకోండి 

సార్వత్రిక ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలో మార్చి 14న ఆవిర్భావ దినోత్సవ సభలో మాట్లాడుకుందాం 

నరసాపురంలోని మత్స్యకార అభ్యున్నతి సభలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ .

నరసాపురం (ప్రజా అమరావతి);

చట్టాలను పాటించడం ఎంత అవసరమో... మనల్ని దోపిడి చేసే చట్టాలను ఉల్లంఘించడం అంతే అవసరం అన్నారు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ . అందుకే మత్స్యకారుల పొట్టకొట్టే జీవో నెంబర్ 217 ప్రతులను చించివేస్తున్నాను అన్నారు. లక్షలాది మత్స్యకారుల ఉనికి, ఉపాధికి ప్రమాదంగా మారిన జీవో నెంబర్ 217ను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మత్స్యకారులకు అండగా రోడ్లు మీదకు వచ్చి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సమస్యలు తీరుస్తారని ప్రజలు అధికారం ఇస్తే ... వైసీపీ ప్రభుత్వం మాత్రం ఆ అధికారాన్ని సమస్యలు సృష్టించడానికి, మటన్ కొట్లు, చికెన్ కొట్లు, చేపల కొట్లు పెట్టుకోవడానికి ఉపయోగిస్తుందని వ్యాఖ్యానించారు.  మటన్ కొట్లు, చేపల కొట్లుతో ప్రభుత్వానికి ఏం పని ప్రశ్నిస్తూ -మద్యం ఎలాగూ అమ్ముతున్నారు కదా ఆ బ్రాందీ షాపుల పక్కన చీకుల కొట్లు పెట్టుకోండి అన్నారు. మత్స్యకారుల అభివృద్ధి, అభ్యున్నతి కోసం పార్టీ మత్స్యకార వికాస విభాగం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మత్స్యకార అభ్యున్నతి సభ జరిగింది. 

నరసాపురంలో నిర్వహించిన ఈ సభకు భారీ సంఖ్యలో మత్య్సకారులు, జనసేన నాయకులు, జన సైనికులు హాజరయ్యారు. పార్టీ పి.ఏ.సి. ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ , పార్టీ పి.ఏ.సి. సభ్యులు శ్రీ నాగబాబు , పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అర్హం ఖాన్  పాల్గొన్నారు. మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ శ్రీ బొమ్మిడి నాయకర్ నేతృత్వంలో సభ జరిగింది. ఈ సభలో పార్టీ పి.ఏ.సి. సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, నియోజకవర్గాల ఇంచార్జులు, మత్స్యకార వికాస విభాగం సభ్యులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ... “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 70 నుంచి 80 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు. మన రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. తీరం వెంబడి దాదాపు 555 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి.. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 217తో ఇన్ ల్యాండ్ ఫిషింగ్ చేసే సుమారు 4.5 లక్ష మంది మత్సకారుల ఉనికి, ఉపాధి ప్రమాదంలో పడనుంది. చెరువులు ఆన్లైన్ ద్వారా వేలం నిర్వహిస్తే 2500 మత్స్యకార సంఘాలు నిర్వీర్యం అవుతాయి. ఈ రోజు జనసేన పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉండి ఉంటే ప్రభుత్వం 217 లాంటి దోపిడీ జీవో ఇచ్చే ధైర్యం చేసేది కాదు. అక్కడే చించేసేవాళ్లం. మత్స్యకారుల కోసం జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. 


ప్రజలకు నష్టం కలిగితే ఉల్లంఘించాలి 

మన సమాజం కులాల సమాహారం. అన్ని కులాలకు సమాన ఆర్ధిక పరిస్థితులు ఉండవు. రెక్కాడితే గానీ డొక్కాడని కులాలు ఉన్నాయి.  ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. భయపడటానికి, వంగివంగి దండాలు పెట్టడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల వల్ల ప్రజలకు నష్టం జరిగితే దానిని ఉల్లంఘించడానికి సిద్ధంగా ఉంటాను.  

నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా? అని ఒక మహాకవి అన్నారు. అలాంటి సాహస వీరులు మత్స్యకారులు. చేతిలో ఒక వలను పట్టుకొని నడి సముద్రంలోకి పోతారు. అలా వెళ్లాలంటే ఎంతో సాహసం కావాలి. మీ సాహసాన్నే స్ఫూర్తిగా తీసుకొని గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఆ రోజు కపాసుకుద్దిలో పోరాటయాత్ర ప్రారంభించాను. పోరాట యాత్ర సమయంలో మత్స్యకారుల కష్టాలు స్వయంగా తెలుసుకున్నాను.  తీరప్రాంత గ్రామాల్లో కనీస మౌలిక వసతులు లేవు. మత్స్యకారులు ఆర్ధికంగా చితికిపోతున్నారు. ఇవన్నీ కాక ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టాల వల్ల వారి ఉనికి, ఉపాధి ప్రమాదంలో పడింది. మత్స్యకార కుటుంబాల్లో ఆర్ధిక ప్రగతి ఎందుకు లేదు? ఇప్పటికీ దేహీ అనే పరిస్థితి ఎందుకు దాపురించింది. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొనే జనసేన పార్టీ వారికి అండగా నిలబడింది. 

పైలెట్ ప్రాజెక్ట్ అంటారు రాష్ట్రమంతా వర్తింపజేస్తారు 

లేని సమస్యను సష్టించడంలో వైసీపీ నాయకులు ఉద్దండులు. సమస్యను వాళ్లే సృష్టించి పరిష్కారం కోసం మనల్ని రోడ్ల మీదకు తీసుకొస్తారు. ఇప్పటి వరకు సహకార సంఘాల ద్వారా మత్స్యకారులు ఇన్ ల్యాండ్ ఫిషింగ్ చేసుకొని పొట్టపోసుకునేవారు. కొంత ఆదాయం పంచాయతీలకు పన్ను కట్టేవారు. ఇప్పుడు ప్రభుత్వం దానికి ఆన్లైన్ చేయడం, మత్స్యకారులు కానీవారికి కూడా అవకాశం కల్పించడం చూస్తుంటే పంచాయతీల ఆదాయం ముసుగులో బడా ఆసాములకు చెరువులను కట్టబెట్టాలని ప్రభుత్వం చూస్తోంది. దీంతో పేద మత్స్యకారులు అన్యాయం అయిపోతారు. ఆన్లైన్ లో వేలం పాడుకొని, 25 శాతం కట్టాలంటే మత్స్యకారులు ఎక్కడ నుంచి అంత సొమ్ము తీసుకొస్తారు. 100 హెక్టార్లు దాటిన ఏ చెరువునైనా వేలం వేస్తామని చెబుతున్న ప్రభుత్వం... పైలెట్ ప్రాజెక్టుగా నెల్లూరులో ప్రారంభించింది. రేపు రాష్ట్రం మొత్తం అమలు చేస్తారు. దీనిని ఇప్పుడే ఆపకపోతే పేద మత్స్యకారుల పొట్ట కొట్టిన వాళ్లమవుతాం.  మీకు జరుగుతున్న అన్యాయం పై మీరు తిరగబడితే ... మీకు అండగా నేను నిలబడతాను. దెబ్బలు కాయాల్సిన పరిస్థితే వస్తే మొదటి దెబ్బ నేను తింటాను. 

మూడేళ్లలో మీరిచ్చింది కేవలం 64 మందికే 

సముద్రంలో వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతుంది ఇప్పటి వరకు మీరు ఇచ్చింది కేవలం 64 మందికి, అది కూడా రూ. 5 లక్షల చొప్పున. మిగిలిన పరిహారం కోసం అడిగితే కేంద్రం ఇవ్వలేదంటూ సాకులు చెబుతున్నారు. ప్రతి ఏటా వేటకు వెళ్లి దాదాపు 140 మంది చనిపోతున్నారని గణాంకాలు చెబుతుంటే మీరు మాత్రం నిబంధనలు పేరిట వేధింపులకు గురిచేస్తున్నారు. మేము ఈ రోజు అధికారంలో లేకపోయినా మా జనసైనికులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి రూ.5 లక్షలు ఇచ్చేలా బీమా తీసుకొచ్చాం. ఇప్పటి వరకు దాదాపు 45 మందికి చెక్ లు అందించారం. అధికారంలో లేని మేమే అంతా చేస్తే అధికార పీఠంలో కూర్చున్న మీరెంత చేయాలి? 

ఏటా 25వేల మంది వలస పోతున్నారు

మత్స్యకార గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం నుంచి సహకారం లేక ఏటా 25 వేల మంది మత్స్యకారులు పక్క రాష్ట్రాలకు వలస పోతున్నారు. వారి కష్టాలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. తుపాన్లు వచ్చి సముద్రంలో ఇరుక్కుపోయి పక్క దేశాలకు పోతుంటే వాళ్లను టెర్రరిస్టులుగా జైల్లో పెడుతున్నారు. కరోనా సమయంలో చెన్నైలో మన రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు చిక్కుకుపోతే అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి తీసుకొచ్చాం. మత్స్యకారులు ఇళ్లు నిర్మించుకోవడానికి రూ. 70 వేలు అదనంగా ఇచ్చేవారు. దీనికి కారణం తుపాన్లకు తట్టుకొని నిలబడేలా ఇళ్లు నిర్మించుకోవాలని... ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆ రూ. 70 వేలుకు కోత పెట్టి అందరితో పాటు సమానంగా ఇస్తుంది.  ప్రకృతి విపత్తుల సమయంలో పడవలు కొట్టుకుపోవడం, వలలు కోల్పోవడం వంటివి జరిగినప్పుడు పరిహారం అందడం లేదు. గతంలో బోట్లకు ఇన్సురెన్స్ ఉండేది. ఇప్పుడు అదీ లేదు. కొంత మంది అక్రమంగా ఇన్సురెన్సులు కాజేస్తున్నారన్న నెపంతో దాన్ని కూడా ఎత్తేశారు. 

భయం ఎలా ఉంటుందో జనసేన చూపిస్తుంది  

వైసీపీ నాయకుల సిద్ధాంతం ఒక్కటే. వారి దగ్గర తప్ప ఎవరి దగ్గర డబ్బు ఉండకూడదు. అందరూ వారి దగ్గరకు వచ్చి దేహీ అనాలి. ఎంత పెద్దవాళ్లయినా మీరే సాయం చేయాలి సార్ అంటే అప్పుడు వాళ్ల ఈగో శాటిస్ ఫై అవుతుంది. ఇదేమైనా రాజరికామా? ప్రజాస్వామ్యమా? నేను చావడానికైనా సిద్ధమే గానీ, తలవంచేందుకు మాత్రం సిద్ధంగా లేను. మీకే ఇంత తెగింపు ఉంటే స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని నింపుకున్న మాకెంత ఉండాలి. వైసీపీ నాయకులకు భయం లేకుండా పోయింది. భయం ఎలా ఉంటుందో జనసేన చూపిస్తుంది. ప్రజల కోసం పోరాటం చేసి జైలుకు వెళ్లడానికై నా సిద్ధంగా ఉన్నాను. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ జీవో 217ను తీసుకొచ్చారు. వైసీపీ నాయకులు ఇప్పటికీ మించి పోయింది లేదు. సమయం తీసుకోండి. పేద మత్స్యకారులకు న్యాయం చేయండి. 

మీరు హింసిస్తే ఏ స్థాయికైనా తెగిస్తాం 

వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని గోతుల మయం చేసింది. రాజమండ్రి నుంచి వస్తున్నప్పుడు దారిపొడువునా గోతులే దర్శనమిచ్చాయి. రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు మాయబజార్ సినిమాలో లాహిరి లాహిరి పాటే గుర్తొచ్చింది. మా పార్టీ తరపున పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వాళ్లు ఇళ్లు కూల్చేసి, జనసైనికులను బెదిరించి, భయపెట్టి  కేసులు పెట్టాలని చూస్తే... వైసీపీకి నేను చెప్పేది ఒక్కటే మీరు బెదిరిస్తే బెదిరిపోయే వాళ్లు ఎవరు లేరు ఇక్కడ. బెదిరిస్తాం, భయపెడతాం వంటి పిచ్చి పిచ్చి వేషాలు మానుకోండి. సంయమనం పాటిస్తున్నాం అంటే అది మా బలం బలహీనత కాదు. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఎలా పడితే అలా మాట్లడను. అక్రమంగా కేసులు బనాయించి, ఇదే పనిగా హింసిస్తే మాత్రం ఏ స్థాయికైనా తెగించి నిలబడతాం. 

నిలబెట్టుకోలేని హామీలు ఎందుకు చేశారు 

2021 అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం నాడు వర్చ్యువల్ విధానంలో ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు మేజర్ ఫిషింగ్ హార్బర్లు, జెట్టీలు నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు నామమాత్రంగానే పనులు జరిగాయి. నిలబెట్టుకోలేని హామీలు ఎందుకు ఇచ్చి జనాలను మోసం చేస్తారు. గంగవరం పోర్టు దగ్గర జెట్టీ నిర్మిస్తామని అక్కడ మత్స్యకారులను నిరాశ్రయులను చేశారు. 

పేద మత్స్యకారుల కోసం చెరువులు వదిలేయండి 

ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి లక్షలాది మత్స్యకారుల ఉపాధిని ప్రమాదంలోకి నెట్టే జీవో నెంబర్ 217ను  వెంటనే ఉపసంహరించుకోవాలి. లేనిపక్షంలో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో దానిని రద్దు చేస్తాం. అలాగే చెరువులపై పెట్టుబడులు పెట్టాలని చూస్తున్న కోటీశ్వరులకు ఒకటే చెబుతున్నాం. పేద మత్స్యకారులకు చెరువులు వదిలేయండి. కాదని ఈ రోజు పెట్టుబడి పెడితే మాత్రం 2024లో మా ప్రభుత్వం వచ్చాక మీ పెట్టుబడులు నష్టపోతారు. అలాగే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక మత్స్యకారుల కోసం ప్రత్యేక మ్యానిఫెస్టోని తీసుకొస్తాం. యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటాం. మత్స్యకార యువతను సిమ్మింగ్ లో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలి? క్షేత్రస్థాయిలో సమస్యలపై ఎలా యుద్ధం చేయాలి?  

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలన్న దానిపై మార్చి 14 పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు మాట్లాడుకుందాం. రాష్ట్ర భవిష్యత్ ఎలా ఉండాలి.. ఎలా ఉండబోతుంది... ఎలా యుద్ధం చేయాలి లాంటివి చర్చిద్దాం” అన్నారు. 

ఈ వేదిక నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో మత్స్యకార అభ్యున్నతి యాత్ర జరిగిన విధానాన్ని, ఈ యాత్రలో పార్టీ దృష్టికి వచ్చిన సమస్యలను పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ వివరించారు. మత్స్యకార గ్రామాల్లో కనీస వసతులు కూడా ఉండటం లేదని, మహిళలు తీవ్ర ఆవేదన చెందుతున్నారని తెలిపారు. నరసాపురం ప్రాంతానికి చెందిన మత్స్యకారులు శ్రీ పవన్ కల్యాణ్ గారికి సంప్రదాయరీతిలో వల, మత్స్యకారుల టోపీ, చేప అందించారు.

Popular posts
కేంద్రప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్ టిసి ద్వారా ఇసుక టెండర్ల ప్రక్రియ జరిగింది.
Image
ముందస్తుగా సాగునీటి విడుదలకు ప్రణాళికను ఖరారు చేసిన క్యాబినెట్
Image
Gudivada - Kankipadu road widening, development works start
Image
మెడల్ హౌస్.... - రూ. 3.24 లక్షల్లోనే డబుల్ బెడ్‌రూం ఇల్లు - 15 రోజుల్లో పదిమంది కూలీలతో నిర్మాణం - కరీంనగర్‌లో యువబిల్డర్ ప్రయోగం సక్సెస్ ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండు పనులూ కష్టసాధ్యమనే ఉద్దేశంతోనే అలా చెప్పారు. ఇప్పుడు రోజులు మారాయి. అంతా రెడీమేడ్ యుగం. కేవలం పదిహేను రోజుల్లోనే డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించవచ్చు! మీరు విన్నది నిజమే. కరీంనగర్ శివారు బొమ్మకల్ బైపాస్ సమీపంలో నిర్మించిన ఈ ఇంటిని చూస్తే మాత్రం ఇల్లు కట్టడం ఇంత సులభమా? అనిపించకమానదు. అతితక్కువ ఖర్చుతో రెండు పడకగదులున్న పక్కాభవంతిని కట్టి చూపించాడు కరీంనగర్‌కు చెందిన యువబిల్డర్ పేరాల కృష్ణారావు. వాల్యూ కన్‌స్ట్రక్షన్స్ నిర్మాణ సంస్థ ఎండీగా ఉన్న ఈయన, కేవలం పదిమంది కూలీలతో 15 రోజుల్లో రూ.3.24 లక్షల తో ఈ ఇంటిని నిర్మించారు. దీనికి మోడల్ హౌస్ అని నామకరణం కూడా చేసేశారు. డిజైన్‌లో మార్పులు చేస్తే కేవలం రూ.3 లక్షల్లో నిర్మించి ఇవ్వవచ్చని చెప్తున్నారు. ఇదీ ఇంటి ప్లాన్: 128 చదరపు గజాల(1155 చదరపు అడుగుల) స్థలంలో 510 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా (కింది విస్తీర్ణం), 815 చదరపు అడుగుల స్లాబ్ ఏరియా(పైన స్లాబ్ విస్తీర్ణం)తో ఇల్లు ఉంటుంది. మెట్లు పోను 10 ఫీట్లు, ఇంటిపక్కన 8 ఫీట్లు ఖాళీ స్థలం మిగులుతుంది. నిర్మాణం ఇలా: మొదట కందకం తీసి, బేస్‌మెంట్ నిర్మించారు. పిల్లర్లు, గోడలు, స్లాబ్ కోసం ఒకరోజులో అల్యూమినియం ఫ్రేమ్‌లు బిగించారు. తలుపులు, కిటికీలు అమర్చా రు. మరోరోజు రాడ్లు నిలిపి, అల్లారు. మరుసటి రోజు రెడీమిక్స్‌తో కాంక్రీట్ నింపారు. తర్వాత అల్యూమీనియం ఫ్రేం లను తొలగించి, నాలుగు నుంచి ఐదురోజులు క్యూరింగ్ చేశా రు. ఈ ఇంటికి ప్లాస్టరింగ్ అవసరం ఉండదు. అందుకే కొద్ది గా లప్పం కోటింగ్ చేసి, మిషన్ ద్వారా ఒకేరోజు కలర్ కూడా వేసేయొచ్చు. మిగిలిన రోజులు చిల్లరపనులకు పోతుంది. ఖర్చు పెట్టారిలా: గోడలు, స్లాబ్‌కు 33 క్యూబిక్‌మీటర్ల కాం క్రీట్ మిక్స్ (రెడీమిక్స్) సరిపోయింది. క్యూబిక్‌మీటర్‌కు రూ.2800చొప్పున రూ.84వేల ఖర్చు వచ్చింది. రెండు టన్నుల రాడ్‌కు రూ.85వేలు. నాలుగు తలుపులు, కిటికీలకు రూ.25వేలు. మేస్త్రీ, కూలీలకు రూ.60వేలు. కరెంట్ ఖర్చు రూ.15వేలు, ప్లంబర్ చార్జి రూ.15వేలు. మొత్తం రూ.3.24 లక్షలు. ధరలు పెరిగినా, డిజైన్‌లో మార్పు ఉన్నా ధరల్లో కొం త వ్యత్యాసం ఉండవచ్చు. ఎలివేషన్(ఇంటి ముందు భాగపు డిజైన్) మారిస్తే మరో రూ.60వేలు అదనపు ఖర్చు ఉంటుం ది. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తే ఖర్చు తగ్గడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది. చైనా, జర్మనీల్లో చూసి ప్లాన్‌చేశారు పేరాల కృష్ణారావు, ఎండీ, వాల్యూ కన్‌స్ట్రక్షన్స్ ఇంటి నిర్మాణానికి మనం పెట్టే ఖర్చు ప్రపంచంలో ఎక్కడా పెట్టరు. తక్కువ ఖర్చుతో ఇల్లు ఎలా నిర్మించవచ్చో తెలుసుకునేందుకు చైనా, జర్మనీ, అమెరికాలో పర్యటించారు. చైనా, జర్మనీల్లో కాంక్రీట్ గోడలు, రోబోసాండ్‌తో ఇండ్లను నిర్మిస్తున్నారు. ఇది నాకు నచ్చింది. పేద ప్రజల కలను నిజం చేసేందుకు ఈ విధానం సరిపోతుంది. అందుకే ఈ ఇంటిని కట్టి మోడల్ హౌస్ అని పేరుపెట్టారు
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image