చిరు వ్యాపారులకు అండగా నిలవడమే జగనన్న తోడు లక్ష్యమన్నారు


                     

 గుంటూరు (ప్రజా అమరావతి);


  యస్. ఆర్. శంకరన్ హల్, కలెక్టర్ ఆఫీస్ గుంటూరు నందు జరిగిన జగనన్న తోడు (మూడోవ విడత) పథకం అమలు కార్యక్రమం లో  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్  పాల్గొన్నారు.


     తాడేపల్లి క్యాంపు ఆఫీస్ నుంచి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ‘జగనన్న తోడు’ మూడో విడత కింద డబ్బుల్ని బటన్ నొక్కి లబ్దిదారుల అకౌంట్లలో జమ చేశారు. చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం వడ్డీ లేకుండా వారికి రూ.10 వేలు అందిస్తోంది.పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానని.. వారికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే జగనన్న తోడు పథకం తీసుకొచ్చామన్నారు. రుణాలు క్రమం తప్పకుండా చెల్లిస్తుంటే మళ్లీ రుణం ఇస్తారని చెప్పారు. ఇప్పటి వరకూ 14 లక్షల మందికి మంచి చేయగలిగామన్నారు.


     ఈ సంధర్బంగా  చైర్ పర్సన్  మీడియా ప్రతినిధుల తో మాట్లాడుతూ చిరు వ్యాపారులకు అండగా నిలవడమే జగనన్న తోడు లక్ష్యమన్నారు


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి లక్ష్యం అని, చిరు వ్యాపారులు తమకు తాము ఉపాధి కల్పించుకోవడం గొప్ప విషయమన్నారు.ఇప్పుడు మూడో విడతతో కలిపి మొత్తం 14.16 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుంది అని తెలియజేశారు.

Comments