నేటి ఆధునిక కాలంలో పిల్లలు కంప్యూటర్, ఆన్లైన్ ఆటలకు బానిసలు అవుతున్నారని, ఆత్మ విశ్వాసం పెంచే కరాటే వంటి శారీరక క్రీడలను నేర్చుకోవాలి

 


కొవ్వూరు (ప్రజా అమరావతి); 


నేటి ఆధునిక కాలంలో పిల్లలు కంప్యూటర్, ఆన్లైన్ ఆటలకు బానిసలు అవుతున్నారని, ఆత్మ విశ్వాసం పెంచే కరాటే వంటి శారీరక క్రీడలను నేర్చుకోవాలని


రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.


శనివారం సాయంత్రం ఏ వి రావు మునిసిపల్ ఇండోర్ స్టేడియంలో.షోటోకన్ కరేటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కరేటే పోటీలను మంత్రి జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, కరేటే వంటి శారీరక క్రీడలతో నేటి యువతి యువకులు ఎవరికి వారు స్వీయ రక్షణ పొందవోచ్చని తెలిపారు.  నేడు పిల్లలు టివి లకు అతుక్కుపోవడం, సెల్ ఫోన్ గేమ్స్ ఆదుకోవడం నిత్య కృత్యం అవ్వడం జరుగుతోందన్నారు. పిల్లలకు శరీర దృఢత్వం పెంచే దిశలో రాధ ఆధ్వర్యంలో కొవ్వూరు లో పిల్లలకు  కరేటే నేర్పించడానికి ముందుకు రావడం అభినంద నీయమన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల్లో ఉన్న సృజనాత్మక ను ప్రోత్సహించాలని, తద్వారా వారిలో నిబ్బరత పెరుగుతుందని ఆమె తెలిపారు. టివి లు, ఆన్లైన్ గేముల వలన ఆత్మ నూన్యత భావం తో మనో నిబ్బరత ను కోల్పోవడం చేస్తున్నామన్నారు. ఈరోజు ఇక్కడ శిక్షణ పొందుతున్న పిల్లలు అదృష్ట వంతులన్నారు. ఆత్మ రక్షణ తో పాటు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడంతో పాటు శారీరక దృఢత్వం పెంచుకోవడానికి కరేటే ఒక చక్కని అవకాశమన్నారు. పిల్లలే కాదు పెద్దలు కూడా ఇటువంటి క్రీడలు నేర్చుకోవాలన్నారు. ఆరోగ్యాన్ని ఎవరు నిర్లక్ష్యం చెయ్యవద్దని తానేటి వనిత పేర్కొన్నారు. 


ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి, రాధ, తదితరులు పాల్గొన్నారు.
Comments