మౌలానా స్పూర్తితో జగన్ విద్యారంగ సంస్కరణలు : షేక్ ఆసిఫ్
విజయవాడ (ప్రజా అమరావతి);
దేశంలో తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌కలామ్ ఆజాద్ స్పూర్తితో జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని ఆంధ్రప్రదేశ్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ షేక్ ఆసిఫ్ అన్నారు. మౌలానా అబుల్‌కలామ్ ఆజాద్ వర్ధంతి కార్యక్రమాన్ని నగరంలోని ఏపీ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసిఫ్ ఇతర అధికారులు ఆజాద్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ దేశంలో స్వాతంత్య్ర సమరయోధునిగా నాడు ఆజాద్ విరోచిత పోరాటాన్ని కొనసాగించారన్నారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతూ సుమారు పది సంవత్సరాలు జైలు శిక్షను అనుభావించారన్నారు. అనంతరం 11 సంవత్సరాలుగా కేంద్ర మంత్రిగా దేశంలో విద్యారంగ పటిష్టతకు పాటుపడ్డారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో నాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను ప్రవేశ పెట్టారన్నారు. నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆజాద్ స్ఫూర్తిని కొనసాగిస్తూ విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులను తీసుకొస్తున్నారన్నారు. అమ్మ ఒడి, విద్యాదీవెన వంటి కార్యక్రమాలు విద్యారంగ విస్తరణకు పటిష్టతకు ఉపకరిస్తాయన్నారు. అదేవిధంగా చట్టసభల్లోనూ మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని వివరించారు.
addComments
Post a Comment