తిరుమల, ఫిబ్రవరి 10 (ప్రజా అమరావతి);
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న
ఏపీ రాష్ట్ర గవర్నర్ గౌ|| శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్
తిరుమల శ్రీవారిని గురువారం ఏపీ రాష్ట్ర గవర్నర్ గౌ|| శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ దర్శించుకున్నారు.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| గవర్నర్‌కు టిటిడి ఛైర్మెన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి. ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ''ఇస్తికఫాల్'' ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు.
దర్శనానంతరం మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తరువాత రంగనాయకుల మండపంలో గౌ|| శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్ కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్, ఈవోలు తీర్థప్రసాదాలు అందించారు.
అంతకుముందు తిరుమల శ్రీ పద్మావతి వసతి సముదాయం వద్దకు చేరుకున్న ఏపీ రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ కు టిటిడి ఛైర్మెన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి స్వాగతం పలికారు.
శ్రీవారిని దర్శించుకున్న భారత పర్యాటక శాఖ మంత్రి
భారత పర్యాటక శాఖ మంత్రి గౌ|| శ్రీ కిషన్ రెడ్డి, ఏపీ రాష్ట్ర గవర్నర్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఈవో తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో ఒడిశా ఎల్ఎసి ఛైర్మన్ శ్రీ దుష్యంత్ కుమార్, డెప్యూటీ ఈవోలు శ్రీ రమేష్‌బాబు, శ్రీ లోకనాథం. శ్రీ భాస్కర్, తిరుపతి అదనపు ఎస్పీ శ్రీమతి సుప్రజ, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment