పొన్నూరు (ప్రజా అమరావతి);
జడ్పి చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పచ్చలతాడిపర్రు పొన్నూరు మండలం ను ఆకస్మికంగా తనిఖీ చేపట్టినారు.
ఈ సందర్బంగా సిబ్బంది మరియు విద్యార్థుల హజరును పరిశీలించారు, పాటశాల పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజన పథకం అమలు నాణ్యతా ప్రమాణాలను స్వయం గా రుచి చూసి తెలుసుకున్నారు, అనంతరం అమ్మ ఒడి పథకం ద్వారా యూనిఫాం మరియు షూస్ అందాయా లేదా అని పిల్లలని అడిగి తెలుసుకున్నారు.
పాటశాలలో చదువుతున్న 10 వ తరగతి విద్యార్థుల తో ముచ్చటించి, అందరూ బాగా కష్టపడి చదివి ఎగ్జామ్స్ మంచిగా రాసి పాస్ అవ్వాలి అని ఆకాంక్షించారు.
ఈ సంధర్బంగా పాటశాల పసతులను పరిశీలించి ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి k. ప్రమీల దేవీ మరియు సిబ్బంది తో పాటశాల అవసరాలను అడిగి తెలుసుకున్నారు.
addComments
Post a Comment