వైఎస్ఆర్ జిల్లా కడప (ప్రజా అమరావతి);
ఒక్క రోజు జిల్లా పర్యటన నిమిత్తం.. ఆదివారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.50 గం.లకు కడప విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
కడప విమానాశ్రయంలో అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ప్రత్యేక హెలికాప్టర్లో 11.05 గంటలకు పలు కార్యక్రమాల(పుష్పగిరి కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవం, ఉపముఖ్య మంత్రి అంజాద్ బాషా కుమార్తె వివాహ కార్యక్రమం)ల్లో పాల్గొనేందుకు రిమ్స్ ప్రాంగణముకు బయలుదేరిన ముఖ్యమంత్రి.
ముఖ్యమంత్రి తోపాటు హెలికాఫ్టర్ లో బయలుదేరి వెళ్లిన.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, ఎంపీ అవినాష్ రెడ్డి, కడప నగర మేయర్ సురేష్ బాబు.
కడప విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, డిఐజీ వెంకట్రామిరెడ్డి, ఎస్పీ అన్బు రాజన్ లతో పాటు.. బీసీ సంక్షేమ శాఖామంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, శాసన మండలి ఉప చైర్మన్ జఖియా ఖానమ్, విజయవాడ ఎమ్మెల్సీ మహ్మద్ రాహుల్లా, ఎమ్మెల్యేలు డా.దాసరి సుధ, ఎస్.రఘురామిరెడ్డి, రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, డా.ఎం.సుధీర్ రెడ్డి, జెడ్పి చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కడప నగర మేయర్ సురేష్ బాబు, ఎపి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పి.గౌతమ్ రెడ్డి, ఎపిఎస్ ఆర్టీసీ చైర్మన్ ఏ.మల్లికార్జునరెడ్డి, పద్మశాలీ కార్పొరేషన్ చైర్ పర్సన్ జింకా విజయలక్ష్మి, కడప ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి తదితరులు.
కోవిడ్ నేపథ్యంలో కడప విమానాశ్రయంలో స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ (SoP) మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
addComments
Post a Comment