రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ.


అమరావతి (ప్రజా అమరావతి);


రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ.



*క్యాంప్‌ కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్ధి విడుదల చేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*


*ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, రైతులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*


*కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి*


సార్‌...మొట్టమొదటగా ఈ రాష్ట్ర రైతాంగం తరుపున మనస్పూర్తిగా కృతజ్ఙతలు తెలుపుతున్నాను. దేశంలోనే వ్యవసాయ రంగంలో ఏపీ నెంబర్‌ వన్‌ స్ధానంలో ఉందని కేంద్రం నిర్ణయించి ప్రకటించిన సందర్భంగా, గత రెండున్నర ఏళ్ళ కాలంలో మీ దిశానిర్ధేశం, మీ కష్టం, మీ దర్శకత్వం ఏ విధంగా ఈ వ్యవసాయ రంగాన్ని భవిష్యత్‌ తరాలకు అందించాలనే మీ లక్ష్యం వైపు చాలా వేగంగా అడుగులు వేస్తున్న విషయాన్ని అందరూ గుర్తించేలా కేంద్రం ఆ ప్రకటన చేయడం చాలా సంతోషం. వ్యవసాయం, అనుబంధ రంగాలకు మీరిచ్చే ప్రాధాన్యత, ప్రణాళికలు, ఖర్చు పెట్టే నిధులు చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో దాని ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక విషయాన్ని ప్రస్తావించాలి, ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు ఒక వ్యాఖ్య చేశారు, ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖను మూసేసినట్లు ఉందన్నారు, నిజమే...టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయశాఖను మూసేస్తే తిరిగి తెరిచిన ఘనత మీదే అన్న విషయం రైతాంగం అంతా గుర్తించింది. ఇన్‌పుట్‌ సబ్సిడీని తీసుకుంటే ఒక్క సంవత్సరం ఒక్క సీజన్‌లో సకాలంలో ఇన్‌పుట్‌ సబ్సిడీని ఇవ్వని సీఎంగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారు. 2018లో సుమారు రూ. 1900 కోట్లు బాకీ పెట్టిన చంద్రబాబు కూడా ఈ రాష్ట్రంలో వ్యవసాయశాఖను మూసేశారా అని మాట్లాడుతుంటే రైతాంగం ఏ విధంగా అర్ధం చేసుకుంటుందో మనకు అర్ధమవుతుంది, కానీ చంద్రబాబుకే అర్ధం కావడం లేదు. అబద్దాలు అలవోకగా ప్రచారం చేయడం అలవాటైన చంద్రబాబుకు చెప్పాలనే ఈ వేదిక మీద ప్రస్తావించాను. కేంద్ర ప్రభుత్వమే ఏపీని వ్యవసాయంలో అగ్రగామిగా తీర్చిదిద్దింది సీఎం శ్రీ జగన్‌ అని సర్టిఫికెట్‌ ఇచ్చిన తర్వాత చంద్రబాబుకు కనువిప్పు కలుగుతుందనుకుంటే వారి దాడి ఇంకా పెంచినట్లు కనిపిస్తుంది. ఈ ప్రభుత్వంలో ఏ సీజన్‌ నష్టాన్ని ఆ సీజన్‌లో ఇస్తున్నారు. మీరు మాట ఇస్తే నిలబెట్టుకుంటూ, రైతాంగానికి ముద్దుబిడ్డగా పేరు తెచ్చుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ. మీ హయాంలో రాష్ట్ర రైతాంగం ఇంకా ముందుకెళుతుందని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను, ధ్యాంక్యూ.


*ప్రమీల, మహిళా రైతు, ఉప్పర్లపల్లి గ్రామం, బత్తలపల్లి మండలం, అనంతపురం జిల్లా*


అన్నా నాకు ముగ్గురు పిల్లలు, మూడెకరాల పొలంలో వర్షాల వల్ల వరి దెబ్బతింది, ఆ బాధలో ఉన్నప్పుడు అధికారులు వచ్చారు, మీకు పంట నష్టం వస్తుందని భరోసా ఇచ్చారు, కానీ ఇంత త్వరగా వస్తున్నందుకు మాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, గతంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం ఎదురుచూసే వాళ్ళం కానీ ఇప్పుడు వెంటనే వస్తుంది. మాకు రైతు భరోసా కూడా వస్తుంది, ఆర్బీకేలలో అన్నీ అందుతున్నాయి, సలహాలు ఇస్తున్నారు, మా గ్రామంలో ఆర్‌బీకేలో ఏది కావాలన్నా కూడా ఇస్తున్నారు. ఆర్‌బీకే చానల్‌ ద్వారా సలహాలు, సూచనలు అందుతున్నాయి, వ్యవసాయ సలహా మండలి ద్వారా కూడా సలహాలు తీసుకుంటున్నాం. మేం యంత్ర పరికరాలు తీసుకుని లబ్ధిపొందుతున్నాం. ఈ రోజు మేం మిషన్‌ కావాలంటే దొరుకుతుంది, తక్కువ ధరకే వస్తుంది.మాకు నవరత్నాల పధకాలు అందుతున్నాయి, చాలా ఆనందంగా ఉంది, మేం మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాం, మేమంతా మీరే మళ్ళీ సీఎం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం. 


*బాలనరసింహారెడ్డి, రైతు, వనిపెంట, మైదుకూరు, వైఎస్‌ఆర్‌ కడప జిల్లా*


అన్నా నాకు ఐదెకరాల పొలంలో మూడెకరాలు టమాట, రెండెకరాలు ఉల్లి సాగు చేశాను, నవంబర్‌లో వర్షాలకు పంట నష్టపోయాను, పంట పూర్తిగా దెబ్బతింది, వెంటనే వ్యవసాయ అధికారి, స్ధానిక అధికారులు వెంటనే భరోసా కల్పించారు, ఈ రోజు సాయం అందుతుంది. నాకు ఎకరాకు రూ. ఆరు వేల సాయం అందుతుంది, ఈ డబ్బు రబీకి ఉపయోగంగా ఉంటుంది. అన్నా మాకు ఆర్‌బీకేలలో అన్నీ దొరుకుతున్నాయి, వేరే ఊరు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మేం సీహెచ్‌సీల ద్వారా లబ్ధిపొందాం, చిన్న, సన్నకారు రైతులకు దీని వల్ల లబ్ధి జరుగుతుంది. మేం గతంలో మండల కేంద్రం చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఆర్‌బీకేల వల్ల చాలా ఉపయోగం జరుగుతుంది. మీ నాన్నగారి హయాంలో సాగునీరు అందింది, వర్షాలు బాగా కురిశాయి, ఆ తర్వాత కాలంలో కరువుతో ఇబ్బంది పడ్డాం. మీరు రైతు భరోసా ఇస్తూ బటన్‌ నొక్కగానే ఐదు నిముషాలలో నా ఫోన్‌లో మెసేజ్‌ వచ్చింది, నేను సున్నా వడ్డీ ద్వారా కూడా లబ్ధి పొందాను. కరోనా కష్టకాలంలో మీరు ఇంత సాయం చేస్తున్నారు. మాకు నిరంతరాయంగా 9 గంటలు పగటిపూట కరెంట్‌ ఇస్తున్నారు. మీరు మా రైతులకు ఇంత సాయం చేస్తున్నారు, మేం రైతులంతా కూడా మీతో నడవడానికి సిద్దంగా ఉన్నాం. మీరే ముఖ్యమంత్రిగా కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 


*ప్రతాప్‌ రెడ్డి, రైతు, చెర్లోపల్లి, చిత్తూరు జిల్లా*


జగనన్నా, నేను చిన్న రైతుని, నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు వస్తుంది తక్కువే అయినా ఈ సాయం నాకు వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. గతంలో జిల్లా కేంద్రానికి వెళ్ళి ఏది కావాలన్నా తిరగాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఏది కావాలన్నా మా ఊరిలోనే దొరుకుతుంది. మీరు రైతులకు ఎన్ని సేవలు చేయాలో అన్ని చేస్తున్నారు. మీరు మా రైతులను వేలు పట్టి నడిపిస్తున్నారు. మా కోసం ఇన్ని పథకాలు ప్రవేశపెట్టి సాయం చేస్తున్నందుకు మీకు రుణపడి ఉంటాం. నేను డిగ్రీ చదివి కూడా వ్యవసాయం మీద మక్కువతో చేస్తున్నాను. మాకు రాజన్న అంటే చాలా అభిమానం, ఆయన లేని లోటును మీరు భర్తీ చేస్తున్నారు. మీరు మాకే కాదు మా బిడ్డల తరానికి కూడా సీఎంగా ఉండాలి. మీరు మాటల సీఎం కాదు చేతల సీఎం, మాకు చాలా సంతోషంగా ఉంది, వ్యవసాయంలో మెలుకువలు అన్నీ కూడా తెలుసుకుంటున్నాం, మేం యంత్ర సేవా పథకం క్రింద లబ్ధిపొంది, తోటి రైతులకు కూడా సాయం చేయాలనుకుంటున్నాం. మీరు వచ్చిన తర్వాత మాకు కరువు కూడా లేదు. మీరు రాష్ట్రానికే తండ్రి స్ధానంలో ఉంటూ ప్రజలందరి బాగోగులు చూసుకుంటున్నారు. మీ నిరంతర ఆలోచనలకు ధన్యవాదాలు అన్నా. మాకు పగటిపూట 9 గంటల నిరంతరాయ కరెంట్‌ ఇస్తున్నారు. రైతు బావుంటే రాష్ట్రం బావుంటుందని మీరు నమ్మారు, అమలుచేస్తున్నారు. మేం చిన్న రైతులం, మాకు ఆరోగ్య భద్రత కూడా ఇచ్చారు. మేం ధైర్యంగా భరోసాతో జీవిస్తున్నాం. మీరిచ్చే ప్రతీ రూపాయిని జాగ్రత్తగా ఖర్చు పెట్టి నేను వృద్ది చెందాను. మేం అనేక పథకాల ద్వారా లబ్ధిపొందాం. మా కరువు సీమపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి జలకళ అందించారు. మీరున్నంత కాలం మాకు ఎలాంటి భయాలు లేకుండా భరోసాగా ఉంటాం. మీరు రైతు పక్షపాతి అని రుజువు చేసుకున్నారు. గ్రామ స్వరాజ్యాన్ని మా గడప వరకూ తీసుకొచ్చిన మీకు ధన్యవాదాలు. ప్రతీ ఒక్కటీ ఇంటి ముంగిట్లోకి వచ్చాయి, మా నాన్న కూడా మిమ్మల్ని తన పెద్ద కొడుకులా భావిస్తున్నారు. మీరే ముఖ్యమంత్రిగా కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం సార్, ధ్యాంక్యూ


*నక్కా సింహాచలం, కౌలు రైతు, వెదురుమూడి, తూర్పుగోదావరి జిల్లా*

 

జగనన్నా నేను 30 ఏళ్ళుగా కౌలు పొలం సాగుచేస్తున్నాను. గత నవంబర్‌లో వర్షాల వల్ల మా గ్రామంలో పంట నష్టపోగానే అధికారులు వచ్చి నష్టం వివరాలు రాశారు, నేను నిన్న ఆర్‌బీకేకు వెళ్ళి లిస్ట్‌లో చూడగానే నా పేరు ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది, గతంలో అధికారులు వచ్చి పంట నష్టం చూసినా డబ్బు అందేది కాదు. గతంలో నాన్నగారు రైతుపక్షపాతిగా ఉండేవారు, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను. మాకు ఈ డబ్బు పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతుంది. మాకు ఇప్పుడు ఆర్‌బీకే దగ్గరలోనే ఉన్నాయి, గతంలో మండల కేంద్రాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. మేం యంత్రసేవా పథకం క్రింద గ్రూప్‌ అయి నాన్న పేరు పెట్టుకున్నాం, మాతో పాటు పక్క రైతులకు కూడా తక్కవ రేటుకే సేవలందిస్తున్నాం. పెట్టుబడి దబ్బు కూడా ఆదా అవుతుంది. నేను యూరియా కొరత ఉందని పేపర్లో చూశాను, దీంతో వెళ్ళి ఆర్‌బీకేలో విచారించగా కావాల్సినంత నిల్వ ఉందని చూపారు. కొన్ని పత్రికలు మీ ప్రభుత్వంపై తప్పుగా రాస్తున్నాయి. రంగు మారిన ధాన్యంపై మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు మాకు మద్దతు ధర వచ్చింది. మేం సలహామండలిలో సలహాలు తీసుకుంటూ వ్యవసాయం చేస్తున్నాం. మా కుటుంబం వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందింది. నేను ఏడాదికి మీ వల్ల లక్ష రూపాయల లబ్ధిపొందుతున్నాను. నాన్నగారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వల్ల లబ్ధిపొందాను, నా పిల్లలు పెద్ద చదువులు చదువుతున్నారంటే మీరే కారణం. మేం జీవితాంతం రుణపడి ఉంటాం. మీరు కులాలకు, మతాలకు అతీతంగా దళారీలకు తావులేకుండా నేరుగా పథకాలు అందిస్తున్నారు. నేను ఇంటి పట్టా పొందాను. సచివాలయ వ్యవస్ధ అందరికీ ఉపయోగపడుతుంది. నేను ఇప్పటివరకూ ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు. మీరే ఎల్లప్పుడూ ముఖ్యమంత్రిగా ఉండాలి. మా జిల్లాకు మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసి కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటున్నాను అని రైతు కోరగా అందుకు అంగీకరించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్, ఈసారి తన పర్యటనలో రైతును కలిపించాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు.

Comments