అర్బన్ హెల్త్ క్లినిక్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలి.
: జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
ధర్మవరం (అనంతపురం), ఫిబ్రవరి 16 (ప్రజా అమరావతి) :
అర్బన్ హెల్త్ క్లినిక్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. బుధవారం ధర్మవరం పట్టణంలోని ఎర్రగుంటలో ఉన్న అర్బన్ హెల్త్ క్లినిక్ నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.*
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్బన్ హెల్త్ క్లినిక్ నిర్మాణ పనులు బాగా జరుగుతున్నాయని, వెంటనే నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. 80 లక్షల రూపాయలతో అర్బన్ హెల్త్ క్లినిక్ నిర్మాణాన్ని చేపట్టడం జరగగా, ఇప్పటివరకు 52 లక్షల వరకు నిర్మాణ పనులు పూర్తి కావడం జరిగిందని, మిగిలిన నిర్మాణ పనులు ఈ నెలాఖరులోపు పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వరప్రసాద్, కమిషనర్ మల్లికార్జున, మున్సిపల్ ఈఈ సత్యనారాయణ, ఏఈ హరీష్, తహసీల్దార్ నీలకంఠారెడ్డి, ఈఓఆర్డీ శంకర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment