సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల మరియు క్లస్టర్ విశ్వవిద్యాలయం పరిపాలన భవన సముదాయ నిర్మాణానికి భూమి పూజ

 కర్నూలు (ప్రజా అమరావతి);




కర్నూలు నగర శివార్లలోని దిన్నెదేవరపాడు గ్రామం జగన్నాథగట్టు ప్రాంతంలో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో 50 ఎకరాల్లో స్టేట్ ఫండ్స్ రూ.88.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల మరియు క్లస్టర్ విశ్వవిద్యాలయం పరిపాలన భవన సముదాయ నిర్మాణానికి భూమి పూజ




చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ , రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ .


భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు గారు, వైస్ ఛాన్స్లర్ క్లస్టర్ విశ్వవిద్యాలయం డివిఆర్ సాయి గోపాల్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి గారు, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, కోడుమూరు శాసనసభ్యులు డాక్టర్ జె.సుధాకర్ గారు,  రిజిస్ట్రార్ డి శ్రీనివాసులు గారు, సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ వివి సుబ్రహ్మణ్య కుమార్ గారు, ఏపీఈడబ్ల్యూఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ సీఎన్ దీవన్ రెడ్డి గారు, చీఫ్ ఇంజనీర్ కే నాగరాజు గారు, ఎస్ ఈ కే జనార్ధన్ రెడ్డి గారు, తదితరులు.



Comments