శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


(ప్రజా అమరావతి):     దేవస్థానము మహామండపము 6 వ అంతస్తు నందు ఆలయ పాలక మండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు , శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారి ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల సమావేశము నిర్వహించి పలు అంశాలపై చర్చించి తీర్మానములు చేయడం జరిగినది. సమావేశము అనంతరం, సమావేశం నందు చర్చించిన అంశముల గురించి తెలియజేశారు. ఈ సమావేశ కార్యక్రమము నందు పాలక మండలి సభ్యులు శ్రీ  కనుగుల వెంకటరమణ(బాల) , శ్రీమతి నేలపట్ల అంబిక , శ్రీమతి బండారు జ్యోతి , శ్రీమతి కత్తిక రాజ్యలక్ష్మి , శ్రీమతి  కటకం శ్రీదేవి , శ్రీమతి బుసిరెడ్డి సుబ్బాయమ్మ ,  శ్రీమతి ఎన్. సుజాత , శ్రీ నెరుసు సతీష్ , శ్రీమతి చక్కా నాగవెంకట వరలక్ష్మి , శ్రీమతి పులి చంద్రకళ , కార్యనిర్వాహక ఇంజనీరు శ్రీ కె.వి.ఎస్.కోటేశ్వరరావు , శ్రీమతి లింగం రమాదేవి , ఉప కార్యనిర్వహక ఇంజనీర్లు, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.