రాజకీయాల్లో మాట్లాడితే ఆధారం ఉండాలి.


తాడేపల్లి, వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం (ప్రజా అమరావతి);


*వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్‌మీట్‌ పాయింట్స్‌...* 


*వివేకానందరెడ్డి హత్యకేసులో ఎల్లో మీడియా దుష్ప్రచారం* 


*బాబు అబద్ధాన్ని ఎల్లో మీడియా వండి ప్రజల మెదళ్లలోకి ఎక్కిస్తారు*


*పచ్చి అబద్ధాలు చార్జిషీటులో సీబీఐ వండివార్చింది* 


*చార్జిషీటు ఆధారంగా అవినాష్‌ రెడ్డికి శిక్ష వేయాలని చంద్రబాబు తీర్మానమా?*


*మొదట్నుంచి చంద్రబాబుది కుట్రల స్వభావం* 


*అందుకే వివేకా కేసులో బాబు నీచమైన ప్రచారం*


*మేం అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి*


*దెయ్యాల గుంపుగా టీడీపీ. దాన్ని లీడ్‌ చేసే పెద్ద దెయ్యంలా బాబు మాటలు* 


*గుండెపోటు అని చెప్పినంత మాత్రాన అది దర్యాప్తును ఎలా ప్రభావితం చేస్తుందని సూటిగా ప్రశ్నించిన సజ్జల* 


*ఎదురుగా ఉన్న సాక్ష్యాలను సీబీఐ పరిగణలోకి తీసుకోదా?* 


*రాజకీయ నేతలు ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలుండాలి*


*వివేకా లేకపోవడం వైయస్‌ఆర్‌సీపీకి పెద్ద ఎదురుదెబ్బ. సీఎం జగన్‌ పెద్ద అండను కోల్పోయారు* 


*వైయస్‌ఆర్‌ కుటుంబంపైనే చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. బాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదు*


*చంద్రబాబులాగే లోకేష్‌ కూడా పనికి రాకుండా తయారయ్యాడు*


*ఫోన్‌కాల్‌తో వచ్చిన అవినాష్‌ మీద చంద్రబాబు ఆరోపణలు అన్యాయం*


*వివేకా ఇంట్లో వారికంటే సన్నిహితంగా ఎర్రగంగిరెడ్డి ఉండేవారు*


*సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..*


*రాజకీయాల్లో మాట్లాడితే ఆధారం ఉండాలి*


ఎప్పుడూ చిటపటలాడుతుంటే చంద్రబాబు ఈ మధ్య వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఒక సీరియస్‌ విషయాన్ని హాస్యధోరణిలో చెప్పబోయి అపహాస్యం పాలవుతున్నారని చంద్రబాబు గుర్తిస్తే బావుంటుందని సజ్జల మండిపడ్డారు. 

రాజకీయాల్లో.. రాజకీయ విమర్శలు చేయటం, ప్రజలకు సంబంధించిన అంశాలపై నిలదీయటం జరుగుతాయి. రాజకీయ పార్టీల మధ్య చాలా అంశాల మీద విబేధాలుంటాయి. రాజకీయ పార్టీ ఉనికి వేరు కాబట్టి  విబేధాలుంటాయి. అవి వెల్లడించవచ్చు. కానీ అవి చెప్పేటప్పుడు దానికి ఒక ప్రాతిపదిక ఉండాలి. ఒక ఆధారం ఉండాలి. చెప్పిన విషయం సూటిగా దీనిపై మాట్లాడుతున్నామని స్పష్టంగా చెప్పాలి. ఈ మధ్య లోకేశ్‌ ట్విట్టర్‌లో జోకులు వేస్తున్నాడు. ఎదిగే అవకాశం ఉన్న నాయకుడు దేనికీ పనికిరానివాడిలా తయారయ్యాడు. ఎదగటానికి అవకాశంలేని చంద్రబాబు వెనకదారిలో వచ్చి మ్యానిప్యులేట్, మేనేజ్‌మెంట్‌ ద్వారా బ్రతికారు. ఈ వయస్సులో చంద్రబాబు జోక్‌లు వేస్తున్నారు. 


*ఈ ప్రశ్నలకు సీబీఐ లేదా వివేకా మరణాన్ని రాజకీయం చేస్తున్న చంద్రబాబు సమాధానం చెప్పాలి....* 


*1) వివేకానందరెడ్డిగారి మరణవార్త తనకు శివ ప్రకాశ్‌రెడ్డిద్వారా తెలిసిందని, అది కూడా గుండెపోటు అని తెలిసింది అని ఆదినారాయణరెడ్డి చెప్పిన విషయం మీద సిబిఐ ఎందుకు దర్యాప్తు  చేయటం లేదు? అదే శివ ప్రకాశ్‌రెడ్డి ఫోన్‌ చేస్తేనే అవినాష్‌ అక్కడికి వెళ్ళాడు.*


*2) ఎంపీగా పోటీ చేసిన అవినాష్‌ క్యాంపెయిన్‌ కోసం... అక్కడ నాయకులను అవినాష్‌కు అనుకూలంగా ఒప్పించటం కోసం తన తండ్రి ముందురోజు రాత్రి వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని వివేకానందరెడ్డిగారి కుమార్తె సునీతమ్మ చెప్పటం నిజం కాదా?  గుండెపోటు అని ప్రాపగేట్‌ చేశారంటున్న సిబిఐవారు... ఆ విషయం చెప్పింది శివప్రకాశ్‌రెడ్డి అన్న విషయం మీద దర్యాప్తు చేయటం లేదు* 


*3) కృష్ణారెడ్డి దగ్గరే వివేకానందరెడ్డిగారు రాసిన చివరి లేఖ ఉంది. అది ఎందుకు వెంటనే బయటపెట్టలేదు? ఎవరు బయటపెట్టవద్దన్నారు? శవాన్ని ముట్టుకోకుండా ఉండేలా ఈ లేఖను ఎందుకు బయటపెట్టలేదు? ఆ లేఖ బయటపెడితే ఎవరూ శవాన్ని ముట్టుకోకుండా పోలీసులు ఆపేవారు కదా?* 


*4) లేఖ బయటపెట్టకుండా ఆపిన రాజశేఖర్‌రెడ్డి ఎవరు? శివప్రసాదరెడ్డికి సొంత సోదరుడు, వివేకానందరెడ్డిగారి బావమరిది కాదా? మరి ఇంత కీలకమైన విషయం మీద దర్యాప్తు ఎందుకు జరగలేదు? రాజశేఖరరెడ్డి ఆపటం వల్లే కృష్ణారెడ్డి ఆ లేఖ ఇవ్వలేదన్న విషయం మీద ఎందుకు దర్యాప్తు జరగలేదు?  ఆదినారాయణరెడ్డి ఫోన్‌ కాల్స్‌మీద సిబిఐ విచారణ ఎందుకు జరగలేదు?* 


*5) వివేకాగారి ఓటమికి కారణమైన బీటెక్‌ రవి, ఆదినారాయణరెడ్డి; వీరిద్దరితో చంద్రబాబు నాయుడు నడిపిన వ్యవహారాలమీద, వారి ఫోన్‌ కాల్స్‌మీద ఎందుకు దర్యాప్తే చేయలేదన్నది కూడా ఆశ్చర్యంగా ఉంది. 

సునీతమ్మను టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టాలి... కుటుంబాన్ని ఎలాగోలా చేర్చాలి... నేరాన్ని కుటుంబం మీదే తొయ్యాలి... ఇది చంద్రబాబు వ్యూహం. ఈ నిజాలన్నీ బయటకు రావాలి. దర్యాప్తుకు సంబంధించి అసలు నిజాలు తెలియాలంటే... ఈ అంశాలన్నింటినీ విస్మరించి అవినాష్‌ను ఎందుకు ఇరికించాలని అనుకుంటున్నారన్నది అందరికీ అర్థమవుతుంది* *గుండెపోటు దర్యాప్తును ఎలా ప్రభావం చూపగలదు*

గుండెపోటు అని ఎవరు అన్నారో మొన్న చెప్పటం జరిగింది. ఎవరి రెస్పాన్సబులిటీ లేదు. ఈరోజు అవినాశ్‌ రెడ్డి బాధ్యత కూడా లేదు. వివేకా బాడీ దొరికింది. అప్పుడు కాకపోయినా గంటకైనా మర్డర్‌ అని తెలుస్తుంది. గుండెపోటు అనే మాట వచ్చినా ఇన్వెస్టిగేషన్‌ను ఎవరు ఏమి చేయగలరు? ఏరకంగా ఆ అంశం దర్యాప్తును మారుస్తుంది. ఈ ఆలోచన, ఈ ఇంగితం చిన్న పిల్లాడికైనా ఉంటుంది. ఆ మాట అన్నారా? లేదా అన్నది మళ్లీ చెబుతా. 


*ఎవరు చేశారో, ఎవరి ప్రోద్భలంతో అనేది దర్యాప్తులో తేలాలి*

ఫస్ట్‌ గుండెపోటు అన్నారు. తర్వాత గొడ్డలిపోటు అన్నారని చంద్రబాబు అంటున్నారు. రెండో అంశంలో సాక్ష్యాలను టాంపర్‌ చేసి క్లీన్‌ చేయటమనేది పెద్ద నేరం. అది ఎవరు చేసినా శిక్షించాల్సిందే. ఎవరు చేశారో ఊర్లో అందరికీ తెలుస్తుంది. ఎర్ర గంగిరెడ్డి అనే వ్యక్తి అక్కడే ఉన్నాడు. అతని ప్రోద్భలంతో ఎవరైనా చెప్పి చేయించారా అన్నది దర్యాప్తులో తేలుతుంది. ఇప్పుడు దాని జోలికి పోవటం లేదు. 


*సిట్‌ విచారణ తర్వాత గుండెపోటు అన్నది ఆదినారాయణ రెడ్డే*

గుండెపోటు అన్నది ఎవరో వీడియో వేసి చూపించాం. ఆదినారాయణ రెడ్డి మా పార్టీలో ఎన్నికై ఫిరాయించి టీడీపీలో మంత్రి అయ్యాడు. ఆయన సిట్‌తో మాట్లాడిన తర్వాత చెప్పాడు. శివప్రకాశ్‌ రెడ్డి ఫోన్‌ చేస్తే.. స్మోకింగ్‌ ఆపలేదు. స్టంట్‌ వేసుకొని ఉన్నారు. హెమరాయిడై.. హార్ట్‌ అటాక్‌ వచ్చి చనిపోయారని అన్నారు. అది వీడియోలో ఉంది. సీబీఐ లాంటి సంస్థ అలాంటివి చూడరా. ఇన్వెస్టిగేషన్‌ అంటే.. ఎదురుగా ఉన్న సాక్ష్యాలు చూడరా. ఇవి అబద్ధం. ఇది ఫ్యాబ్రికేటెడ్‌ వీడియో అని చెప్పాలా? దాన్ని తీసుకోకుండా ఇన్వెస్టిగేషన్‌ చేయటం ఏమిటి?


*లెటర్‌ ఉందని తెలిస్తే ఎవరైనా బాడీ దగ్గరకు వెళ్లనిచ్చేవారా?*

*సాయంత్రం వరకు లెటర్, ఫోన్‌ ఎందుకు దాచారు?*

ఆ లెటర్‌ ఉందని సీఐ, మొదటి వచ్చిన వారికి చెప్పినా ఎవరినైనా ఆ బాడీ దగ్గరకు వెళ్లనిస్తారా? ఈ ప్రశ్న వస్తుందా? రాదా? ఆ ప్రశ్నకు చంద్రబాబు ఏమి సమాధానం ఇస్తారు. సీబీఐ కన్నా ఎక్కువ ఇన్వెస్టిగేషన్‌ చేయగలిన వ్యక్తి కదా. అందుకే చంద్రబాబునే అడుగుతున్నాం. దాన్ని వదిలేసి మా సీబీఐ రాసిందని ఇక అయిపోయిందని చంద్రబాబు అంటున్నారు. ఆ లెటర్‌ వచ్చినట్లైతే అది జరిగి ఉండేది కాదు. సాయంత్రం వరకు లెటర్, ఫోన్‌ ఎందుకు బయటకు రాలేదు. రాజశేఖర్‌ రెడ్డి ఎందుకు దాచి పెట్టమన్నారు. అది లోతుగా దర్యాప్తు చేయాల్సిన అంశం కాదా? అందరం దగ్గర వాళ్లు. బావుండాలని అనుకునేవాళ్లం కాబట్టి ఇందులో ద్రోహ చింతన ఉంటుందని ఎవరూ అనుకోలేదు. అప్పుడు ఎవరి కారణాలు వారికి ఉంటాయి. 


సీబీఐ చార్జిషీటులో మేం పాయింట్‌ అవుట్‌ చేసింది ఇంకొకటి ఏమిటి అంటే.. వివేకానంద రెడ్డి కానీ, షర్మిలమ్మ, విజయమ్మ కానీ కావాలి తప్ప అవినాష్‌ రెడ్డి కాకూడదని అనుకోవటం వల్ల ఎంపీ అవినాష్‌ రెడ్డి తన మనుషులతో చంపించారని నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ ఇంత అడ్డగోలు కామెంట్‌ చేస్తుందా? ఎంపీ మీద ఇలా అడ్డగోలు ఆరోపణలు చేస్తారా? 


మీడియా, ప్రపంచం మొత్తానికి తెల్సు. అప్పటికీ సిట్టింగ్‌ ఎంపీ. ఆయన విజయం కోసమే అందరి కంటే ఎక్కువ బాధ్యత తీసుకొని వివేకానంద రెడ్డి పనిచేస్తున్నారు. ఆ పార్లమెంట్‌ మొత్తం వివేకానందకు కొట్టిన పిండి. జిల్లా మొత్తం చూస్తుండటం. ఆ పార్లమెంట్‌ వ్యవహారాలు చూడటంతో పాటు గతంలో వైయస్‌ఆర్‌ కోసం కృషి చేశారు కూడా. సహజంగా వివేకానంద రెడ్డి సారధ్యం వ్యవహరించారు. జగన్‌ అన్నను సీఎం చేయటం, అవినాష్‌ను ఎంపీగా గెలిపించటం అనే టాస్క్‌ మీదనే ఉన్నారని సునీతమ్మ కూడా మాట్లాడారు. ఇంత ఓపెన్‌గా అందరికీ తెల్సింది. కానీ సీబీఐ అడ్డగోలుగా చార్జిషీటులో వేస్తే.. దాన్ని ఆధారంగా చంద్రబాబు మాపై బండ వేస్తామంటే మేం ఎలా ఒప్పుకుంటాం? 


*ఫోన్‌కాల్‌తో వచ్చిన అవినాష్‌ మీద చంద్రబాబు ఆరోపణలు అన్యాయం*

*ఇంట్లో వారికంటే సన్నిహితంగా ఎర్రగంగిరెడ్డి ఉండేవారు*

ఫ్యామిలీ మెంబర్స్‌ ఎవ్వరూ లేనప్పుడు ఎక్కడైనా ఏదైనా జరిగితే మొదట షాక్‌ అవుతాం. సమాచారం పంపిస్తాం. అందులో పబ్లిక్‌ లైఫ్‌లో ఉన్న ఫ్యామిలీ. దాంట్లో ఉండే కన్‌ప్యూజన్‌ కొంత పనిచేసి ఉండొచ్చు. ఏ రకంగా ఈ ఫ్యాక్టర్‌. మధ్యలో చంద్రబాబు పాయింట్‌ అవుట్‌ చేసిన ఎర్ర గంగిరెడ్డి, మిగిలిన వారు ఇంట్లో వారికంటే సన్నిహితంగా ఉండేవాళ్లు. అలాంటి వాళ్లు టాంపరింగ్‌ చేసే ప్రయత్నం చేస్తే.. దాన్ని అడ్డుకోలేదో.. దాన్ని చేయమన్నారని చంద్రబాబు ఆరోపించటం సరికాదు. ఫోన్‌ కాల్‌ మీద వచ్చిన వ్యక్తిని (అవినాష్‌) తీసుకొచ్చి నేరుగా ముడివేసేసి ప్రయత్నం చేయటమనేది అన్యాయం గాక న్యాయం అవుతుందా చంద్రబాబు గారూ అని సజ్జల ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీబీఐని ఎలా ఇగ్నోర్‌ చేస్తారని అడిగాం.ఈ రోజు చంద్రబాబును అడుగుతున్నామన్నారు.  


*సీబీఐ పది అడుగులు చార్జిషీట్‌ వేస్తే బాబు వంద అడుగుల స్టేట్‌మెంటా*

చంద్రబాబు లాంటి ఒక అబద్ధాన్ని ఆయన మాటల్లో వీడియో వేసుకొని చూస్తే కనిపిస్తోంది. సీబీఐ పది అడుగులు అడ్డగోలుగా చార్జిషీటులో చేస్తే.. దానికి చంద్రబాబు వంద అడుగులు ముందుకు వేసి ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చేశాడు. మొదటి వచ్చిన అవినాష్‌ రెడ్డి ఆధ్వర్యంలోనే మొత్తం అంతా జరిగిపోయిందని. మర్డర్‌ జరిగిందనో, క్లీనింగ్‌ జరిగిందనో మీడియా వాళ్లు అనుకోవచ్చు. 


*పచ్చి అబద్ధాలు చార్జిషీటులో సీబీఐ వండివార్చింది* 

*చార్జిషీటు ఆధారంగా అవినాష్‌ రెడ్డికి శిక్ష వేయాలని చంద్రబాబు తీర్మానమా?*

– సీబీఐ పచ్చి అబద్ధాలు వండివార్చిందని మేం అంటున్నాం. దాన్ని తీసుకొని అవినాష్‌ రెడ్డికి శిక్ష వేయాలని తీర్మానం చేసేరకంగా చంద్రబాబు మాట్లాడటంతో ప్రశ్నిస్తున్నాం. రెండు, మూడు బేసిక్‌ అంశాలున్నాయి. అవినాష్‌ రెడ్డి విజయం కోసమే వివేకానంద రెడ్డి పనిచేస్తుంటే టిక్కెట్‌ కోసం అవినాషే చంపించారనే వైఖరిని చంద్రబాబు తీసుకుంటున్నావా? లేక కాదంటున్నావా? కాదంటే ఇన్వెస్టిగేషన్‌ సరైన మార్గంలో పోనట్టే కదా.


*నిజాలు బయటకు రావాలి. దర్యాప్తు సక్రమంగా జరగాలి* 

– ఎవరు చేసేది బయటకు రావాలి. కచ్చితంగా తేలాలి. ఇన్వెస్టిగేషన్‌ సక్రమంగా జరిగినట్టు కనిపించాలి. ఆ పాయింట్స్‌ చూస్తే కరెక్టు అనిపించాలి. దానికి భిన్నంగా ఏమైనా ఉంటే వాటికి సమాధానాలు ఇవ్వాలి. సీబీఐ వాళ్లు కాకపోతే చంద్రబాబు ఇవ్వాలని ఆయన్ను అడుగుతున్నాం. అక్కడ యంగ్‌ లీడర్‌ తయారవుతున్నాడు. గతంలో శ్రీ జగన్‌ మీద సూట్‌ కేసు బాంబు అని అలాగే పడ్డారు. రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో ఎమోషనల్‌ అయి మాట్లాడాల్సి వచ్చింది. అంతకంటే నీచమైంది ఎక్కడా ఉండదు. ఒక లీడర్‌ తయారవుతుంటే..మొక్కలో తుంచేద్దాం అనేది చంద్రబాబు తీరు.

Popular posts
కేంద్రప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్ టిసి ద్వారా ఇసుక టెండర్ల ప్రక్రియ జరిగింది.
Image
Gudivada - Kankipadu road widening, development works start
Image
ముందస్తుగా సాగునీటి విడుదలకు ప్రణాళికను ఖరారు చేసిన క్యాబినెట్
Image
మెడల్ హౌస్.... - రూ. 3.24 లక్షల్లోనే డబుల్ బెడ్‌రూం ఇల్లు - 15 రోజుల్లో పదిమంది కూలీలతో నిర్మాణం - కరీంనగర్‌లో యువబిల్డర్ ప్రయోగం సక్సెస్ ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండు పనులూ కష్టసాధ్యమనే ఉద్దేశంతోనే అలా చెప్పారు. ఇప్పుడు రోజులు మారాయి. అంతా రెడీమేడ్ యుగం. కేవలం పదిహేను రోజుల్లోనే డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించవచ్చు! మీరు విన్నది నిజమే. కరీంనగర్ శివారు బొమ్మకల్ బైపాస్ సమీపంలో నిర్మించిన ఈ ఇంటిని చూస్తే మాత్రం ఇల్లు కట్టడం ఇంత సులభమా? అనిపించకమానదు. అతితక్కువ ఖర్చుతో రెండు పడకగదులున్న పక్కాభవంతిని కట్టి చూపించాడు కరీంనగర్‌కు చెందిన యువబిల్డర్ పేరాల కృష్ణారావు. వాల్యూ కన్‌స్ట్రక్షన్స్ నిర్మాణ సంస్థ ఎండీగా ఉన్న ఈయన, కేవలం పదిమంది కూలీలతో 15 రోజుల్లో రూ.3.24 లక్షల తో ఈ ఇంటిని నిర్మించారు. దీనికి మోడల్ హౌస్ అని నామకరణం కూడా చేసేశారు. డిజైన్‌లో మార్పులు చేస్తే కేవలం రూ.3 లక్షల్లో నిర్మించి ఇవ్వవచ్చని చెప్తున్నారు. ఇదీ ఇంటి ప్లాన్: 128 చదరపు గజాల(1155 చదరపు అడుగుల) స్థలంలో 510 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా (కింది విస్తీర్ణం), 815 చదరపు అడుగుల స్లాబ్ ఏరియా(పైన స్లాబ్ విస్తీర్ణం)తో ఇల్లు ఉంటుంది. మెట్లు పోను 10 ఫీట్లు, ఇంటిపక్కన 8 ఫీట్లు ఖాళీ స్థలం మిగులుతుంది. నిర్మాణం ఇలా: మొదట కందకం తీసి, బేస్‌మెంట్ నిర్మించారు. పిల్లర్లు, గోడలు, స్లాబ్ కోసం ఒకరోజులో అల్యూమినియం ఫ్రేమ్‌లు బిగించారు. తలుపులు, కిటికీలు అమర్చా రు. మరోరోజు రాడ్లు నిలిపి, అల్లారు. మరుసటి రోజు రెడీమిక్స్‌తో కాంక్రీట్ నింపారు. తర్వాత అల్యూమీనియం ఫ్రేం లను తొలగించి, నాలుగు నుంచి ఐదురోజులు క్యూరింగ్ చేశా రు. ఈ ఇంటికి ప్లాస్టరింగ్ అవసరం ఉండదు. అందుకే కొద్ది గా లప్పం కోటింగ్ చేసి, మిషన్ ద్వారా ఒకేరోజు కలర్ కూడా వేసేయొచ్చు. మిగిలిన రోజులు చిల్లరపనులకు పోతుంది. ఖర్చు పెట్టారిలా: గోడలు, స్లాబ్‌కు 33 క్యూబిక్‌మీటర్ల కాం క్రీట్ మిక్స్ (రెడీమిక్స్) సరిపోయింది. క్యూబిక్‌మీటర్‌కు రూ.2800చొప్పున రూ.84వేల ఖర్చు వచ్చింది. రెండు టన్నుల రాడ్‌కు రూ.85వేలు. నాలుగు తలుపులు, కిటికీలకు రూ.25వేలు. మేస్త్రీ, కూలీలకు రూ.60వేలు. కరెంట్ ఖర్చు రూ.15వేలు, ప్లంబర్ చార్జి రూ.15వేలు. మొత్తం రూ.3.24 లక్షలు. ధరలు పెరిగినా, డిజైన్‌లో మార్పు ఉన్నా ధరల్లో కొం త వ్యత్యాసం ఉండవచ్చు. ఎలివేషన్(ఇంటి ముందు భాగపు డిజైన్) మారిస్తే మరో రూ.60వేలు అదనపు ఖర్చు ఉంటుం ది. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తే ఖర్చు తగ్గడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది. చైనా, జర్మనీల్లో చూసి ప్లాన్‌చేశారు పేరాల కృష్ణారావు, ఎండీ, వాల్యూ కన్‌స్ట్రక్షన్స్ ఇంటి నిర్మాణానికి మనం పెట్టే ఖర్చు ప్రపంచంలో ఎక్కడా పెట్టరు. తక్కువ ఖర్చుతో ఇల్లు ఎలా నిర్మించవచ్చో తెలుసుకునేందుకు చైనా, జర్మనీ, అమెరికాలో పర్యటించారు. చైనా, జర్మనీల్లో కాంక్రీట్ గోడలు, రోబోసాండ్‌తో ఇండ్లను నిర్మిస్తున్నారు. ఇది నాకు నచ్చింది. పేద ప్రజల కలను నిజం చేసేందుకు ఈ విధానం సరిపోతుంది. అందుకే ఈ ఇంటిని కట్టి మోడల్ హౌస్ అని పేరుపెట్టారు
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image