*"ప్రజా సంక్షేమమే లక్ష్యం" - కాకాణి
.*
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లిగూడూరు మండలం, వెంకన్నపాళెం గ్రామంలో పర్యటించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .
వెంకన్నపాళెం సచివాలయంలో గ్రామస్తుల సమక్షంలో, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో సమీక్షించి, సంతృప్తి వ్యక్తం చేసిన కాకాణి.
సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల పనితీరు "భేష్" అంటూ కితాబిచ్చిన కాకాణి.
సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలోనే కొనసాగడం మన అందరి అదృష్టం.
సర్వేపల్లి నియోజకవర్గాన్ని, నా విన్నపాన్ని మన్నించి, నెల్లూరు జిల్లాలోనే కొనసాగించడం, మన పాలిట జగనన్న ప్రసాదించిన వరం.
జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
తెలుగుదేశంతో సహా ప్రతిపక్ష పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న పథకాల తీరును తప్పు పట్టలేకపోతున్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందకుండా అడ్డుకుంటే, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక భావం ఏర్పడి, తద్వారా లబ్ధి పొందేందుకు తెలుగుదేశం నాయకులు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు కోట్లాది రూపాయలు అప్పులు చేస్తున్నాడంటూ, అనవసర రాద్ధాంతం చేసి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటున్న ప్రజాద్రోహులు తెలుగుదేశం నాయకులు.
సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం హయాంలో పెత్తనం వెలగబెట్టిన వారు ఆర్బాటంగా ఉపన్యాసాలు చేయడం, ప్రజలు సమస్యలు చెప్పుకుంటే, ఆగ్రహించి వెళ్ళి పోవడం తప్ప, ఒరగబెట్టిందేమి లేదు.
వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజల సమక్షంలో గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించి, అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం.
వెంకన్నపాళెం సచివాలయ పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం, గ్రామ ప్రజలకు మౌలిక సదుపాయాల కోసం, సుమారు 5 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేశాం.
గ్రామాల్లో ధైర్యంగా ప్రజల సమక్షంలో సమీక్ష నిర్వహిస్తున్న సందర్భంలో, సాంకేతిక లోపాలవల్ల ఒకరికి లేదా ఇద్దరికో సంక్షేమ కార్యక్రమాలు అందడంలేదు తప్ప, 99 శాతం ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నట్లు అర్ధమవుతుంది.
ప్రభుత్వ పథకాలు అందించడంలో సాంకేతిక లోపాలను సవరించి, అర్హులైన వారందరికీ 100శాతం అందజేసే బాధ్యత నాది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థకు, వాలంటీర్లను అనుసంధానం చేయడం, క్షేత్రస్థాయిలో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
ప్రజలకు సమర్థవంతంగా సంపూర్ణంగా, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న అధికారులకు, ప్రత్యేకించి సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు, స్థానిక ప్రజాప్రతినిధులకు, సహకరిస్తున్న నాయకులకు నా హృదయపూర్వక అభినందనలు.
addComments
Post a Comment