రాజీవ్ గృహకల్ప పక్కనే చేనేత మగ్గం షెడ్లు ఏర్పాటు చేయటానికి స్థలం కేటాయించడం జరిగింది

 ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతు , ఎమ్మెల్యే ఆర్కే  జిల్లా చేనేత అధికారులతో కలిసి MTMC  కార్యాలయంలో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు...

మంగళగిరి (ప్రజా అమరావతి);

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి  చేనేత వృత్తి ని బ్రతికించడానికి అప్పటి  మంత్రివర్యులు మురుగుడు హనుమంతరావు  ఆధ్వర్యంలో మంగళగిరిలో రాజీవ్ గృహకల్ప నిర్మాణం చేపట్టారని దాంతోపాటు నేతన్నలు చేనేత వృత్తిని కొనసాగించడానికి రాజీవ్ గృహకల్ప పక్కనే చేనేత మగ్గం షెడ్లు ఏర్పాటు చేయటానికి స్థలం కేటాయించడం జరిగింద


ని అన్నారు. 


రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం మగ్గం షెడ్ల గురించి ఎవరూ పట్టించుకోలేదని ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మగ్గం షెడ్లను నిర్మించడానికి ప్రతిపాదనలు తయారు చేయాల్సిందిగా అధికారులకు సూచనలు చేయటం జరిగిందని, సొంత మగ్గం షెడ్డులు లేకపోవటం వలన చేనేత కార్మికులు మాస్టర్ వివర్స్ వద్ద కార్మికులుగా పని చేస్తున్నారని అన్నారు.


రాజీవ్ గృహకల్ప వద్ద మగ్గం షెడ్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్థిక నిధుల నుండి మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిధుల నుండి సమాకుర్చుకుని నిర్మాణం చేయటం జరుగుతుందని అన్నారు.


దాదాపు 100 నుండి 125 మందికి కామన్ మరియు ఇండివిడ్యువల్ షెడ్ల నిర్మాణాన్ని చేయటం జరుగుతుందని, ఇందుకు కావలసినటువంటి పర్మిషన్స్ రెండు నెలల్లో పూర్తి చేసి రెండు నెలల్లో నిర్మాణం పనులను ప్రారంభించడం జరుగుతుందని అన్నారు.

Comments