విజయవాడ (ప్రజా అమరావతి);
*45,46,52 వ డివిజన్ లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన దేవాదాయ శాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాస్*
పశ్చిమ నియోజకవర్గంలోని 45,46,52 వ డివిజన్ లలో పలు అభివృద్ధి పనులకు దేవాదాయ శాఖామంత్రి వెలంపల్లి శ్రీనివాస్ గురువారం నాడు శంకుస్థాపన చేసారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 45 వ డివిజన్ లో 75 లక్షల రూపాయల వ్యయంతో దశరధ టింబర్ డిపో ద్వారకా వీధులకు సిసి రోడ్ అదేవిధంగా 46 వ డివిజన్లో కె ఎల్ రావు పార్క్ నుండి కెటి రోడ్ వరకు 35. 30 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్ నిర్మిస్తున్నామన్నారు మరియు 52 వ డివిజన్ కొండా ప్రాంతంలో 50 లక్షల రూపాయల వ్యయంతో పాత G.I నీటి సరఫరా పైప్లను తొలగించి కొత్త పైపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు గత ప్రభుత్వంలో చంద్రబాబు అమరావతి అమరావతి అన్ని విజయవాడ నగర అభివృద్ధికి రావలసిన నిధులను అమరావతికి మళ్లించారన్నారు. నేడు మా ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి గారు విజయవాడ నగరం పై ప్రత్యేక ద్రుష్టి సారించి నగరంలో ఉన్నటువంటి పార్కులను, రోడ్లను, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను అభివృద్ధి పరిచేందుకు అవసరమైన నిధులను కేటాయించారన్నారు. కొండా ప్రాంతవాసులకు ఇళ్ల పట్టాలు త్వరితగతిన ఇచ్చేందుకు రంగాని సిద్ధం చేశామన్నారు. మన పశ్చిమ నియోజకవర్గ ప్రజల కలయిన భవానీపురం స్టేడియం ను త్వరితగతిన నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ రంజిత్ బాషా, నగర మేయర్ రాయన బాగ్యలక్ష్మి, ఆయా డివిజన్ ల కార్పొరేటర్లు, ఇంఛార్జ్ లు వివిధ కార్పొరేషన్ల చైర్మన్ లు డైరెక్టర్ లు పార్టీ నాయకులూ కార్యకర్తలు పాల్గొన్నారు.
addComments
Post a Comment