మీరు చేస్తున్న సాయం మాకు వ్యాపారాభివృద్దికి ఉపయోగపడుతుంది.


అమరావతి (ప్రజా అమరావతి);


*వరుసగా రెండో ఏడాది జగనన్న చేదోడు*


*రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసం శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న కానుక*


*ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, లబ్ధిదారులు ఏమన్నారంటే...*


*చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, బీసీ సంక్షేమశాఖ మంత్రి*


ఈ రోజు చేదోడు పథక రచనలోనే మీ మనస్సు ఆవిష్కరించారు, రథసప్తమి అంటే సూర్యుడికి తరతమ భేదం లేకుండా తన కాంతిని ప్రసరింపచేసి ఈ సృష్టిని ఆదుకునే ప్రత్యక్ష దైవం. ఈ రోజు పేదరికంలో ఉన్నవారిని అందులో నుంచి బయటపడేసేందుకు మీరు పాదయాత్ర అనే తపస్సు చేశారు. కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని మీకెన్ని కష్టాలు వచ్చినా వారిని ఆదుకున్నారు. కష్టాన్ని నమ్ముకుని జీవించే రజకులు కానీ ఇతరులు కానీ ఏ పథకం వచ్చినా వారికి అదనంగా ప్రోత్సాహం ఇవ్వాలని రూ. 10 వేలు రెండో ఏడాది ఇస్తున్నారు. పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ ఈ పథకం అమలుచేస్తున్నారు. తన అవసరాన్ని ఎవరికీ చెప్పుకోకుండా కేవలం భగవంతుడికే చెప్పుకున్నా అది జగనన్నకు వినపడింది. ఆ కుటుంబాల్లో ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడి ఇది మా ప్రభుత్వం అని భావిస్తున్నారు. బలహీనవర్గాల వారి కష్టాలను మీరు తీరుస్తున్నారు. బీసీలకు జరుగుతున్న మేలు చూస్తున్న నాకు నా జన్మ ధన్యమైందని భావిస్తున్నాను. మీకు సూర్యభగవానుడు మరింత శక్తిని ఇవ్వాలని, మీ ద్వారా రాష్ట్రంలో పేదలందరికీ మంచి జరగాలని, మీరు తలపెట్టిన యజ్ఞఫలం ప్రజలకు అందే సమయంలో మీకు ఆ భగవంతుడు మరింతగా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. శ్రమనే నమ్ముకున్న వారికి మీరిచ్చిన వరం ఈ పథకం. సెలవు. అందరికీ ధన్యవాదాలు. 


*తిరుమలశెట్టి వెంకటరమణమ్మ, టైలర్, కాకినాడ*


జగనన్నా నేను గత ఆరేళ్ళుగా టైలరింగ్‌ సెంటర్‌ నడుపుకుంటున్నాను. నా దగ్గర ఇంకా ముగ్గురు వర్క్‌ చేస్తున్నారు. మీకు ఎంతో రుణపడి ఉంటాను. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం మాకు అందలేదు. మీరు చేస్తున్న సాయం మాకు వ్యాపారాభివృద్దికి ఉపయోగపడుతుంది.



కరోనా కష్టకాలంలో ఈ సాయం మాకు చాలా ఉపయోగకరం, ఈ డబ్బుతో నేను టైలరింగ్‌ మెటీరియల్‌ తీసుకుంటాను. నేను గతంలో పిల్లలను ప్రేవేట్‌ స్కూల్‌లో చదివించాను కానీ ఇప్పుడు మీరు ప్రభుత్వ పాఠశాలల్లో చేస్తున్న అభివృద్ది చేసి అక్కడ చేర్పించాను, పిల్లల చదువుల కోసం చాలా ఇబ్బంది పడేదాన్ని. కానీ ఇప్పుడు మంచి చదువులు, పోషకాహారం అందుతున్నాయి. 

నాకు రూ. 5 లక్షల విలువైన ఇంటి స్ధలం వచ్చింది, మేం మా తల్లిదండ్రులకు సాయం చేసే పరిస్ధితుల్లో లేకపోయినా మీరు మా ఇంటి పెద్దకొడుకులా మీరు వారికి కూడా ఇంటి స్ధలం ఇచ్చారు. వారి తరపునా కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రేషన్‌ విషయంలో మాకు ఇబ్బంది లేకుండా వలంటీర్లు సాయం చేస్తున్నారు. సచివాలయ వ్యవస్ధ బావుంది, ఎక్కడా లంచం లేకుండా ప్రభుత్వ పథకాలు పొందుతున్నాం, మా మహిళలకు దిశ యాప్‌ బావుంది. మా ఇంటికి వలంటీర్‌ వచ్చి మీరు ప్రవేశపెట్టిన పథకాల గురించి తెచ్చిన పుస్తకంలో ఒక లైన్‌ ఉంది, అది నిన్న నేడు రేపు ఎప్పుడూ నేను మీ సేవకుడిని అన్నారు. ఆ మాట నా మనసుని చాలా కదిలించింది. మీరు నాకు దేవుడిచ్చిన సొంత అన్నయ్య. చిరకాలం మీరు మా హృదయాలలో సొంత అన్నగా నిలిచిపోతారు, మా అందరి తరపునా మీకు ధన్యవాదాలు. 


*స్వామి చంద్రుడు, నాయీబ్రాహ్మణ సంఘ నాయకుడు, కర్నూలు*


అన్నా నాకు గతంలో సాయం చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. మీరు గతంలో మా నాయీబ్రాహ్మణులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. ప్రముఖ దేవాలయాలైన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, శ్రీశైల మల్లిఖార్జుని సన్నిధిలో కూడా మాకు స్ధానం కల్పించారు. మాకు ఉచిత కరెంట్‌ ఇచ్చారు. సెలూన్‌షాప్‌లు ఉన్న నాయీబ్రాహ్మణులకు 150 యూనిట్లు ఉచిత కరెంట్‌ ఇస్తున్నారు. మేం ఎవరూ కూడా బిల్‌ కట్టడం లేదు, గతంలో కరెంట్‌ బిల్లు గురించి చాలా ఆందోళన చెందేవాళ్ళం కానీ ఇప్పుడు బిల్లు కట్టడం లేదు. 

గతంలో మీరు ఇచ్చిన సాయంతో ఒక కుర్చీ కొనుక్కున్నాను, ఇప్పుడు ఈ సాయంతో మరో కుర్చీ కొనుక్కుంటాను. గతంలో మేం చాలాసార్లు అందరినీ కలిశాం, ఎవరూ సాయం చేయలేదు. ప్రతీ కులానికి ఒక కార్పొరేషన్‌ చైర్మన్‌ని ఇచ్చారు. వారు మా సమస్యలపై వెంటనే స్పందిస్తున్నారు. నాకు ఇద్దరు పిల్లలు, చిన్నపిల్లాడికి కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీ ద్వారా రూ. 8 లక్షల రూపాయల ఖర్చును ఆరోగ్యశ్రీ ద్వారా పొందాను. ఒక్క రూపాయి కూడా ఖర్చులేకుండా నేను ఉచితంగా వైద్యం పొందాను. మా అబ్బాయికి వికలాంగుల ఫించన్‌ ద్వారా రూ. 3 వేలు వస్తున్నాయి. మాకు మీరు చాలా సాయం చేస్తున్నారు. ఇప్పుడు మాకు రేషన్‌ కూడా ఇంటికే వస్తుంది, మా నాయీబ్రాహ్మణులందరి తరపునా మీకు ధన్యవాదాలు. ఎవరూ చేయలేనంతగా మీరు పెద్దన్నగా మాకు సాయం చేస్తున్నారు. మేమంతా ఎప్పటికీ మీ వెంటే ఉంటాం, మీరే మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నాం.


*సరళ, టైలర్, చిన్నాపురం, మచిలీపట్నం*


జగనన్నా నేను 15 ఏళ్ళుగా టైలరింగ్‌ చేస్తున్నాను. మీరు పాదయాత్రలో మా కష్టాలు చూసి మాకు ఆర్ధిక సాయం చేస్తున్నారు. నేను గత ఏడాది వచ్చిన డబ్బుతో నా షాప్‌ డెవలప్‌ చేసుకున్నాను, ఇప్పుడు రెండో విడత వస్తున్న డబ్బును కూడా సద్వినియోగం చేసుకుంటాను. నా పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన వస్తున్నాయి, నా పిల్లలే కాదు రాష్ట్రంలో అనేకమంది పేద పిల్లలకు మీరు మంచి చదువులు చెప్పిస్తున్నారు. మీకు ధన్యవాదాలు. మీరు పెట్టే ప్రతి పథకం చాలా బావుంది, ఇంటికొచ్చి మరీ ఫించన్‌లు ఇస్తున్నారు. మాకు పథకాల గురించి వలంటీర్లు అన్నీ చెప్తున్నారు.

కరోనా టైంలో మీరు చాలా సాయం చేశారు. వ్యాక్సినేషన్‌ కూడా బాగా జరిగింది. మీరు ప్రతీ పథకాన్ని ఆపకుండా నెరవేరుస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అందరి తరపునా కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నా.


*సంతోషికుమారి, టైలర్, విజయనగరం*


జగనన్నా నేను ఇంట్లో టైలరింగ్‌ చేసుకుంటున్నాను. ఈ పథకం గురించి వలంటీర్‌ చెప్పారు, నేను దరఖాస్తు చేసుకోగానే సాయం అందింది. మీరు రెండో విడతగా చేస్తున్న సాయం నాకు ఎంతో ఉపయోగపడుతుంది. మా అమ్మకు ఇంటి స్ధలం వచ్చింది, ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందింది, నాకు డ్వాక్రాలో రుణమాఫీ కూడా జరిగింది. ధ్యాంక్యూ అన్నా.

Comments