ఏపీ ప్రభుత్వం తొలి విదేశీ పర్యటన విజయవంతం*ఏపీ ప్రభుత్వం తొలి విదేశీ పర్యటన విజయవంతం


*


*రూ.5,150 కోట్ల పెట్టుబడులకు సంబంధించి  6 కీలక ఒప్పందాలు*


*ఎంవోయూల ద్వారా భవిష్యత్ లో 3,440 మందికి, 7,800 మందికి ప్రత్యక్ష్యంగా ఉద్యోగావకాశాలు*


*ఆంధ్రప్రదేశ్ రోడ్ షోకి మాత్రమే దుబాయ్ వాణిజ్య మంత్రి హాజరవడం మరింత ప్రత్యేకం*


*ప్రభుత్వం ఏర్పడిన 3 ఏళ్ళలో తొలి విదేశీ పర్యటనలోనే సత్తా చాటిన పరిశ్రమల మంత్రి*


*దుబాయ్ ఎక్స్ పో- 2020లో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ పెవిలియన్*


*ప్రతి రోజు కనీసం 10వేల మంది చొప్పున  పెవిలియన్ ని సందర్శించిన కోటి మంది*


*వాస్తవ రూపానికి అద్దం పట్టే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  విజన్ పట్ల సర్వత్రా ప్రశంసలు*


*400 మందికి పైగా  పారిశ్రామికవేత్తల హాజరు*


*వారం రోజుల పాటు 2 రోడ్ షోలు, సీఎక్స్ వో, బిజినెస్ రౌండ్ టేబుల్,చర్చా కార్యక్రమాల వంటి 100కి పైగా సమావేశాల నిర్వహణ*అమరావతి, ఫిబ్రవరి, 19 (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొలి విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఏపీ  రూ.5,150 కోట్ల పెట్టుబడులకు సంబంధించి  6 కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రభుత్వం ఏర్పడిన నాటి కోవిడ్ వెంటాడుతున్న నేపథ్యంలో తొలిసారి వెళ్లిన దుబాయ్ ఎక్స్ పో-2020లో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సత్తా చాటారు. మంత్రి మేకపాటి నేతృత్వంలోని పరిశ్రమల శాఖ  అధికారుల బృందం 400 మందికి పైగా  పారిశ్రామికవేత్తలను కలిసి   రోడ్ షోలు, సీఎక్స్ వో, బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చా కార్యక్రమాలను నిర్వహించింది.  సీఎం వైఎస్ పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వినూత్న విధానాలు, ప్రజలకు మేలు జరిగే సంస్కరణలు, ప్రజా సంక్షేమం దిశగా చేపడుతున్న కార్యక్రమాల ద్వారా ఏపీ పెట్టుబడులకు స్వర్గధామమని మంత్రి గౌతమ్ రెడ్డి తన వాణిని అంతర్జాతీయంగా వినిపించడంలో సఫలీకృతమయ్యారు. 


*ఎంవోయూలతో ప్రత్యక్ష్యంగా 3,440 మందికి, 7,800 మందికి పరోక్షంగా ఉపాధి : మంత్రి మేకపాటి*


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామమని పరిశ్రమల శాఖ మంత్రి దుబాయ్ ఎక్స్ పో సాక్షిగా చాటి చెప్పారు. రాష్ట్రం 11 రంగాల్లో చేపట్టిన 70 ప్రాజెక్టుల్లో పెట్టుబడి అవకాశాలు వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో యూఏఈ సహా పలు విదేశీ కంపెనీలు ఎంవోయూలు కుదుర్చుకున్నాయని వెల్లడించారు.  రీజెన్సీ గ్రూప్, ముల్క్ హోల్డింగ్స్, షరాఫ్ గ్రూప్, తబ్రీద్, కాజస్ ఈ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు రూ.5,150 కోట్లు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నాయి. తద్వారా 3,440 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు అందనున్నాయి. మరో 7,800 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు అందే అవకాశం ఉంది.  జిప్సమ్ బోర్డు బిల్డింగ్ మెటిరియల్స్, కన్జూమర్ అండ్ ఇండస్ట్రియల్ పాకేజింగ్ యూనిట్, ఆటోమేటివ్, బ్యాటరీస్ , ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్స్ డెవలప్ మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలలోని పలు కంపెనీలు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచాయి. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ లో మరో రూ. 10,350 కోట్ల వరకూ పెట్టుబడులు రానున్నాయి. తద్వారా 5,740 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, పరోక్షంగా ఇంకో 10వేల మందికి ఉద్యోగాలు దక్కుతాయి. ఈ పర్యటనతో ఏపీలో పెట్టుబడుల ప్రవాహం ఖాయమనే విశ్వాసం కలిగిందని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. తొలిసారి పర్యటనలోనే ఇంత మంది స్పందన రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.


*దుబాయ్ ఎక్స్ పో ద్వారా మరిన్ని వాణిజ్య అవకాశాలు : పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్*


పోర్టులు, ఎయిర్ పోర్టులు, లాజిస్టిక్ హబ్ లు, ఫిషింగ్ హార్బర్లు, పారిశ్రామిక పార్కులు, కారిడార్ల వంటి సకల సదుపాయాలున్న ఏపీలో దుబాయ్ ఎక్స్ పో ద్వారా మరిన్ని పెట్టుబడులు రానున్నాయని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులపైనా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎక్స్ పోలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాల సరికొత్తగా చూపిస్తూ పారిశ్రామిక బంధాలను మరింత బలోపేతమయ్యాయని కరికాల తెలిపారు.


*పారదర్శక పారిశ్రామిక విధానం వల్లే పెట్టుబడుల ప్రవాహం : ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది*


పారదర్శిక పారిశ్రామిక విధానం, సుపరిపాలన, అవినీతి లేని పాలన, పుష్కలమైన సహజవనరుల వల్లే ఏపీలో పెట్టుబడులు ప్రవాహం సాధ్యమవుతోందని ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది వెల్లడించారు.  భవిష్యత్ లో ఆటోమొబైల్, టెక్స్ టైల్, స్టీల్ ప్లాంట్, పెట్రో కెమికల్, ప్రజారోగ్యం, ఐ.టీ, వంటి  రంగాలలో పెట్టుబడులకు ఏపీ చిరునామా అవుతందన్నారు.  మౌలిక సదుపాయాల కల్సనకు ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సుబ్రమణ్యం జవ్వాది స్పష్టం చేశారు.


*దుబాయ్ ఎక్స్ పో -2020లో ఏపీ పెవిలియన్ ప్రారంభోత్సవానికి మాత్రమే వచ్చిన యూఏఈ విదేశీ వాణిజ్య మంత్రి*


దుబాయ్ ఎక్స్ పో -2020లో   ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి రోజూ  7వేల నుంచి 10వేల మంది పెవిలియన్ ని విజిట్ చేశారు. దేశంలోని ఎన్నో రాష్ట్రాలు పెవిలియన్ లను నిర్వహించినా దుబాయ్ వాణిజ్య శాఖ మంత్రి వచ్చి  బిన్ అహ్మద్ ఏఐ జియోది, యూఏఈ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి అహ్మద్ అబ్దుల్  రహ్మన్ అల్బాణా హాజరరవడం ప్రత్యేకం,  ఏపీ పెవిలియన్ ప్రారంభొత్పవానికి  మాత్రమే హాజరై పెవిలియన్ ప్రారంభించడం విశేషం. 


మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెంట దుబాయ్ ఎక్స్ పోకి వెళ్లిన వారిలో  ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జుల్ఫీ రావ్జీ,   పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది, కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తదితరులు ఉన్నారు.