గ్రామ, వార్డు స్థాయిలోనే ప్రజా సమస్యల పరిష్కారమే



నెల్లూరు, ఫిబ్రవరి 9 (ప్రజా అమరావతి): గ్రామ, వార్డు స్థాయిలోనే ప్రజా సమస్యల పరిష్కారమే


ధ్యేయంగా  దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ను ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారని, ఈ వ్యవస్థ ద్వారా బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారమవుతుందని జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. 


బుధవారం ఉదయం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో కోవూరు ఎమ్మెల్యే శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో కలిసి కలెక్టర్ సుడిగాలి పర్యటన చేశారు. సుమారు ఒక కోటి 36 లక్షలతో అభివృద్ధి పనులకు వారు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముందుగా కాలయకాగొల్లు, పెనుబల్లి, మినగల్లు గ్రామాల్లో గ్రామ సచివాలయాలను, మినగల్లులో రెండు ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్, ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే పెనుబల్లి గ్రామంలో అంతర్గత రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

  ఈ సందర్భంగా మినగల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన సచివాలయ ప్రారంభోత్సవ సభలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు సచివాలయాల ద్వారా నేరుగా అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో అందుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి ముందుగానే సంక్షేమ క్యాలెండర్ ను ప్రకటించి ఆ తేదీల వారీగా వివిధ పథకాలకు సంబంధించిన ఆర్థిక సహాయాన్ని ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారన్నారు. అన్ని సంక్షేమ పథకాలకు ఆయా సచివాలయాల పరిధిలోనే లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ సచివాలయాల ద్వారా 27 సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. అలాగే కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి కర్నూలు ఎంపీ శ్రీ సంజీవ్ కుమార్, తిరుపతి ఎంపీ శ్రీ గురు మూర్తి తమ ఎంపీ నిధుల ద్వారా తమ ఎంపీ నిధుల ద్వారా చెరొక పది లక్షల రూపాయలు అభివృద్ధి పనులకు కేటాయించారని పేర్కొన్నారు. ఈ నిధులతో ఇందుకూరుపేట,మినగల్లు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్, అధికారుల సహాయ సహకారం తో జిల్లాలో అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు సకాలంలో అందుతున్నాయని కొనియాడారు. 

 మినగల్లు గ్రామంలో ప్రాథమిక పాఠశాల ను ప్రారంభించిన అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. 


 ఈ కార్యక్రమాల్లో  జాయింట్ కలెక్టర్ శ్రీ గణేష్ కుమార్, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ చైర్ పర్సన్ శ్రీమతి మోర్ల సుప్రజ, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ శ్రీ దొడ్డంరెడ్డి నిరంజన్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీ వీరి చలపతి, వవ్వేరు కోపరేటివ్ బ్యాంకు చైర్మన్ శ్రీ సూరా శ్రీనివాసులురెడ్డి, తాసిల్దార్ శ్రీ శ్రీనివాసులు, ఎంపీడీవో శ్రీ నరసింహారెడ్డి, పంచాయతీ రాజ్ డి ఈ శ్రీ గౌతమ్, కాలయకాగొళ్ళు, పెనుబల్లి, మినగల్లు గ్రామ పంచాయతీల సర్పంచ్ లు జ్యోతి చెన్నమ్మ,  పెంచలయ్య, పూజిత తదితరులు పాల్గొన్నారు. 


Comments