పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నజిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా


చెరుకుపల్లి (ప్రజా అమరావతి);

              

        జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా


  చెరుకుపల్లి మండలం నందు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ను స్థానిక రాజ్యసభ సభ్యులు శ్రీ  మోపిదేవి వెంకటరమణ రావు గారి తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. దేవాలయ విస్తరణకు మరియు ముస్లిం కమ్యూనిటీ ప్రజల అవసరాల కోసం ముస్లిం కమ్యూనిటీ హల్ నకు శంకుస్థాపన చేసి వాటి నిర్మాణాలను ప్రారంభించారు. 

               ఈ కార్యక్రమంలో  మాజీ ఎమ్మెల్యే శ్రీ డి.మల్లికార్జున ,ఎంపీపీ ఎం.దివాకర రత్న ప్రసాద్ , జెడ్పీటీసీ శ్రీమతి మర్రివాడ వెంకట పావని , ప్రభుత్వ అధికారులు, స్థానిక సర్పంచ్ శ్రీమతి చెన్ను శివమ్మ  మరియు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు,ప్రజలు పాల్గొన్నారు.

Comments