వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం


వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం


రాష్ట్ర విద్యుత్ శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ 

అమరావతి,ఫిబ్రవరి 19 (ప్రజా అమరావతి):  రాష్ట్రంలో విద్యుత్ వినియోగ దారులు అందరికీ నాణ్యమైన విద్యుత్ 24 గంటల పాటు నిరంతరాయంగా అందిచాలన్నదే  ప్రభుత్వ లక్ష్యమని  రాష్ట్ర విద్యుత్ శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ పేర్కొన్నారు. శనివారం సచివాలయం నాల్గో బ్లాక్ లోని ప్లబిసిటీ సెల్ లో ఎపి-జన్కో మేనేజింగ్ డైరెక్టర్ బి.శ్రీధర్ తో కలి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.  రాష్ట్రంలోని రైతులందరికీ పగటి పూట తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ ను అందజేయడం జరుగుతున్నదని, ఇందుకై 18 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు  6 వేల 663 ఫీడర్ల ద్వారా విద్యుత్ ను సరఫరా చేస్తూ రూ.7,714 కోట్ల విద్యుత్ రాయితీని  ప్రభుత్వం భరిస్తున్నదని ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.9,717 కోట్లను విద్యుత్ రాయితీగా ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. సాంకేతిక లోపంతో ఎక్కడన్నా తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే, అదే రోజు ఆ సాంకేతిక లోపాన్ని సరిదిద్ది విద్యుత్ ను సరఫరా చేయడం జరుగుచున్నదన్నారు. 

   చౌకధరలకే నాణ్యమైన విద్యుత్ ను పరిశ్రమలకు, వాణిజ్య సంస్థలకు, దేశీయ ప్రయోజనాలకు అందజేయాలనే ప్రభుత్వ లక్ష్యమన్నారు.  ఎంతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్న కోవిడ్ సమయంలో కూడా ఆసుపత్రులకు, ఆక్సిజన్ కేంద్రాలన్నింటికీ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడం జరిగిందన్నారు. గత పక్షం రోజుల్లో రోజుకు సగటున 204 మిలియన్ యూనిట్లు విద్యుత్ను వినియోగం జరుగుతుండగా, గత ఏడాది  ఇదే రోజుల్లో  రోజుకు సగటున 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగించడం జరిగిందన్నారు. ఈ 204 మిలియన్ యూనిట్లలో 170  మిలియన్  యూనిట్లను  దీర్ఝకాలిక ఒప్పందం విదానంలో ఎపి-జన్కో, కేంద్ర విద్యుత్ సంస్థలు అయిన ఎన్.టి.పి.సి., నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్, న్యుక్లియర్ పవర్ ప్లాంట్స్, ప్రైవేటు విద్యుత్ సంస్థల  నుండి పొందడం జరుగుతున్నదన్నారు. అదే విధంగా మిగిలిన 34  మిలియన్ యూనిట్లను  మార్కెట్ నుండి కొనుగోలు చేయడం ద్వారా గాని, స్పల్పకాలిక ఒప్పందాల ద్వారా గాని  పొందడం జరుగుచున్నదన్నారు.  ప్రత్యేకించి వేసవి కాలం మూడు మాసాల పాటు ఈ అదనపు డిమాండు ఉంటుందని, దీని కోసం 25 ఏళ్ల కాలానికి సంబందించిన దీర్ఝకాలిక ఒప్పందాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. 

ఒప్పందాల ప్రకారం జన్కో రోజుకు 2,656 మెగావాట్స్ సరఫరా చేయాల్సి ఉండగా, నిన్న ఉదయం 2,504 మెగావాట్స్ ను, సాయంత్రం  2,460 మెగావాట్స్ ను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. కృష్ణపట్నం థర్మల్ పవర్ ఫ్లాంట్  1,333 మెగా వాట్స్ సరఫరాకు గాను దాదాపు 950 మెగావాట్స్ ను అందుబాటులో ఉంచడం జరుగుతున్నదన్నారు. సెంట్రల్ జనరేషన్ ఫ్లాంట్స్ 1,700 మెగా వాట్స్ వరకు అందుబాటులో ఉంచాల్సి ఉండగా దాదాపు 1,568 మెగా వాట్స్ ను ప్రతి రోజు అందుబాటులో ఉంచడం జరుగుచున్నదన్నారు. ప్రైవేట్ థర్మల్ ప్లాంట్స్ 222 మెగా వాట్స్ ను, గ్యాస్ , హైడల్, విండ్ విద్యుత్ సంస్థలు వరుసగా 125 మె.వా., 300 మె.వా.  మరియు 500-1000 మెగా వాట్స్ వరకూ అందుబాటులో ఉంచడం జరుగుతున్నదని ఆయన తెలిపారు. మిగిలిన 700 నుండి 2000 మెగా వాట్స్ ను ప్రతి పావుగంటకు మార్కెట్ లో ఆక్షన్ ద్వారా కొనుగోలు చేయడం జరుగుచున్నదన్నారు. ఈ ఆక్షన్ లో అన్ని రాష్ట్రాలతో పాటు మనం కూడా పాల్గొని నిర్థారణ అయిన రేట్ల ప్రకారం కొనుగోలు చేయడం జరుగచున్నదన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం 1,000 మెగా వాట్స్ విద్యుత్ ను మార్చి మొదటి వారానికల్లా హెచ్.ఎన్.పి.సి.ఎల్. అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన తెలిపారు. 

కొరతగానున్న విద్యుత్ ను  మార్కెట్ నుండి కొనుగోలు చేయడం జరుగుచున్నదని, విద్యుత్ వినియోగించే సమయాలను బట్టి  రేట్లలో మార్పులు ఉంటాయని,   అర్థరాత్రి పూట  ఒక యానిట్ రూ.2/లు ఉంటే  సాయంత్రం వేళల్లో  రూ.5/- లు పైబడి  విద్యుత్ ధర ఉంటున్నట్లు ఆయన వివరించారు.  తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఇండస్ట్రియల్ డిమాండ్  పెరగడం వల్ల మార్కెట్ లో ఎక్కువ బిడ్డింగా చేసి పవర్ ను కొనుగోలు చేస్తున్నారని, ఆ సమయాల్లో మన రాష్ట్రంలో ఎటు వంటి  కొరత రాకుండా అదే తరహాలో బిడ్డింగ్ చేయడం జరుగుచున్నదని ఆయన తెలిపారు. ఈ విధంగా రాష్ట్రంలో ఎటు వంటి విద్యుత్ కొరత లేకుండా తగు జాగ్రతలు తీసుకుంటూ రైతుల పంపు సెట్లకు, గృహ, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్ ను సరఫరా చేయడం జరుగుచున్నదని ఆయన వివరించారు. 

విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాదానం చెపుతూ విద్యుత్ కొనుగోలు చెల్లింపులకు సంబందించి గత  ఏడాది నర్ర  నుండి   కేంద్రం నిబందనలను కఠిన తరం చేసిందని, అడ్వాన్సుగా చెల్సించాల్సి వస్తున్నదన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా గత రెండేళ్ల నుండి  పెద్ద ఎత్తున నిధులను విద్యుత్ అవసరాలకై  కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్.టి.పి.సి. విషయంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ సమస్య ఉత్పన్నమైతే రాష్ట్ర ప్రభుత్వం,  ఆర్థిక శాఖ ఆసమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు. 

ఎపి జన్కో మేనేజింగ్  డైరెక్టర్ బి.శ్రీధర్ మాట్లాడుతూ ఎపి జన్కో కు సంబందించి  విజయవాడ, కృష్ణపట్నం, రాయసీమ కడప,ముద్దనూరులలో మూడు  ధర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నారుని వీటి ద్వారా సుమారు  5,010 మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్లు ఆయన తెలిపారు. వీటిలో నున్న మొత్తం 15 యూనిట్స్ ఫంక్షనింగ్ లో ఉన్నాయని, వీటి ద్వారా రోజుకు  80 మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్లు ఆయన తెలిపారు.  ఈ థర్మల్ ప్లాట్స్ కు రోజుకు  60 వేల మెట్రిక్ టన్నుల బొగ్గ వినియోగించాల్సి ఉంటుందని, నాలుగు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని,  బొగ్గు సమస్య రాకుండా కేంద్ర విద్యుత్ శాఖ అధికారులతో పాటు  పవర్, కోల్ ,రైల్వే అధికారులు కమిటీగా ఏర్పడి పర్యవేక్షిస్తున్నారని, బొగ్గు సమస్యల ఏమాత్రం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. 

ఏ.పి. స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సి.ఇ.ఓ. చంద్రశేఖర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

 

Comments