పూజ్య దాజీ మరియు శ్రీ గౌతం సవాంగ్ గార్ల చే ప్రారంభమైన “వాయిస్ దట్ కేర్స్” తెలుగు పబ్లిక్ హెల్ప్ లైన్
ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ భాగస్వామ్యంతో సాధారణ ప్రజలకు మనో సామాజిక కౌన్సెలింగ్ సేవ ఉచితంగా అందించబడుతోంది.
హైదరాబాదు/విజయవాడ, ఫిబ్రవరి8 (ప్రజా అమరావతి): హార్ట్ఫుల్నెస్ మరియు రిపుల్స్ ఆఫ్ ఛేంజ్ ఫౌండేషన్ (ROCF) అందించే “వాయిస్ దట్ కేర్స్” అనే హెల్ప్ లైన్ సేవ, సామాజిక-మానసికపరమైన ప్రథమ చికిత్స (సైకో-సోషల్ ఫస్ట్ ఎయిడ్ PFSA) తెలుగులో సాధారణ ప్రజలకు ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ సహకారంతో అందించడం జరుగుతోంది. ఇప్పటికే హిందీలోనూ, ఇంగ్లీషులోనూ అందించే ఈ ఉచిత హెల్ప్ లైన్ సేవ ద్వారా ఉద్వేగపరంగా మానసికపరంగా ఒత్తిళ్ళకు గురయ్యే వ్యక్తులకు మానసికపరమైన, సామాజికపరమైన కౌంసెలింగ్ ఉచితంగా అందించడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ కు సంబంధించిన ఉన్నతాధికారులు, అడిషనల్ డిజిపి, ఐజి,డిఐజి, ఎస్.పి. కమిషనర్లు, ఇంకా ఇతర పోలీస్ అధికారులు, ఎస్.ఐ.లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. హార్ట్ఫుల్నెస్ మార్గదర్శి పూజ్య దాజీ (శ్రీ కమలేష్ డి పటేల్), శ్రీ గౌతం సవాంగ్, ఆంధ్ర ప్రదేశ్ డిజిపి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ఆన్ లైన్లో అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ, మానసిక సమస్యలను, ఉద్వేగపరమైన, మానసికపరమైన వత్తిళ్ళను అధిగమించడం చాలా అవసరమని, ధ్యానము ద్వారా అంతరంగ సమతౌల్యతను సాధించగలమని,అంతేగాక ఇటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా కూడా ఈ ధ్యానం కాపాడుతుందని తెలియజేయడం జరిగింది.
వాయిస్ దట్ కేర్స్ అనే కార్యక్రమాన్ని కోవిడ్ మహమ్మారి సమయంలో జూన్ 2021లోనే ప్రారంభించడం జరిగింది. మానసికంగా దృఢమైన దేశనిర్మాణం అనే దీర్ఘదృష్టితో ప్రారంభించడం జరిగింది. కోవిడ్ 19 మహమ్మారి దీర్ఘకాలం భయంతో కూడిన వాతావరణాన్ని, అనిశ్చితితో కూడిన వాతావరణాన్ని సృష్తించడంతో ఫలితంగా సమాజాల్లో తీరని గాయం చేసి, మానసిక అనారోగ్య సమస్యలు తలెత్తేలా చేసింది. ఇటువంటి వివిధ రకాల మానసిక అనారోగ్యపరమైన సమస్యలకు విచారము, భయము, భయాందోళనలకు, గృహ-హింస, కోపం, మహమ్మారి ప్రభావం చేత కలిగిన మానసిక సమస్యలకు , ఇలా ఇంకా అనేక సమస్యలకు గురయ్యేటువంటి పరిస్థితుల్లో ఉన్నవారికి కౌన్సెలింగ్ సహకారాన్ని అందించడం జరుగుతుంది. ఈ సహాయాన్ని సమర్థవంతంగా అందించడానికి సుశిక్షితులైన కౌన్సెలింగ్ సిబ్బంది ఎంతో సహానుభూతితో వత్తిళ్ళకు గురైనవారికి ఈ హెల్ప్ లైన్ ద్వారా మాట సహాయం, వాళ్ళు తమ ఆరోగ్యాన్ని సంపూర్ణంగా, మానసిక ఆరోగ్యంతో సహా కాపాడుకొనే విధంగానూ, పునరుద్ధరించుకునే విధంగానూ సహాయసహకారాలందిస్తారు.
వాయిస్ కేర్ ప్రారంభించిన ఏడు మాసాల్లో 23 రాష్ట్రాల నుండి 6500 కాలర్ల పైచిలుకు మందికి సుమారు1700 గంటల కౌన్సెలింగు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతీ 5 కాలర్లకు 18 నుండి 30 వయసు గల ముగ్గురు యువకులున్నారు, మానసిక డిప్రెషన్ 23% ఉంటే, ఆందోళనతో బాధపడేవ్అళ్ళు 17% ఉన్నారు.ఇవే ప్రధాన సమస్యలు. ఈ సేవలను ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు తెలుగులో కూడా అందించడం జరుగుతోంది. ఎందుకంటే 6500 కాలర్లలో 19% ఈ రాష్ట్రానికి చెందినవారే గనుక.
హార్ట్ఫుల్నెస్ మార్గదర్శి ఈ విధంగా అన్నారు: “ధ్యానం అంతరంగ శక్తిని పెంచుతుంది, ఉద్వేగపరమైన బలాన్ని పెంచుతుంది; మనిషిని సమత్వ స్థితిలో ఉంచుతుంది; కాని ఏ వ్యక్తి అయితే ముందే వత్తిళ్ళకు లోనై కృంగిపోయి ఉంటాడో అటువంటి వ్యక్తికి ఈ కౌన్సెలింగ్ సహకారం చాలా అవసరం. ఈరోజున్న వత్తిడిపూరిత వాతావరణంలో, భౌతిక సుఖాలు చాలానే ఉన్నప్పటికీ, మానసిక ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. సహాయం కోసం ఆక్రందనలున్నాయి, కాని వాళ్ళ బాధను అనుభూతి చెందేవాళ్ళు గాని అర్థం చేసుకునేవారు కాని ఎవ్వరూ లేరు. ఈ ‘వాయిస్ దట్ కేర్స్’ హెల్ప్ లైన్ ద్వారా మన శిక్షణ పొందిన కౌన్సెలర్లు మొదటి దశ సహానుభూతితో కూడిన సహాయాన్నందిస్తారు; దాంతో వారి సమస్య తీవ్రం గాకుండగా ఆపడం జరుగుతుంది. ఈ సేవలను ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ సహాయంతో రాష్ట్రమంతటా అందిస్తున్నందులకు సంతోషిస్తున్నాను. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ కేవలం వత్తిళ్ళకు గురయ్యేవారిని కాపాడటమే గాక, ఆ పరిస్థితి రాకుండానే ప్రజలకు ఉద్వేగపరమైన, మానసిపరమైన శక్తిని పెంపొందించుకునేలా సహాయక చర్యలు చేపట్టడం ద్వారా తమ స్థాయిని మరింత ఉన్నతంగా వృద్ధి చేసుకున్నారు.”
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఆంధ్ర ప్రదేశ్) శ్రీ గౌతం సవాంగ్ ఇలా అన్నారు: “మానసికంగానూ ఉద్వేగపరంగానూ ఆరోగ్యంగా ఉండటం సమాజం మొత్తం ఆరోగ్యంగా ఉండాలంటే చాలా కీలకమైన అంశాలు. లా అండ్ ఆర్డర్ సమ్రక్షించడంలో వీటి ప్రాధాన్యత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ అర్థం చేసుకోగలదు. ‘వాయిస్ దత్ కేర్స్’ తో సహకరించడం ద్వారా ప్రజల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తున్న సంస్యలను పరిష్కరించడంలో క్రియాశీలకంగా ఉంది. హార్ట్ఫుల్నెస్ ఇంస్టిట్యూట్ మరియు రిప్పుల్స్ ఆఫ్ ఫౌండెషన్ తో కలిసి ఈ సైకోసోషల్ ఫస్ట్ ఎయిడ్ ను యావదాంధ్ర ప్రదేశ్ ప్రజలకు తెలుగులో అందించడం ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. హార్ట్ఫుల్నెస్ వెల్నెస్ ప్రోగ్రాముల ద్వారా అందించే సేవలు సమాజంలోని సభ్యులందరికే గాక, పోలీస్ శాఖ సభ్యులందరికీ కూడా బాగా ఉపయోగపడతాయని ప్రగాఢంగా నమ్ముతున్నాను. ముందస్తుగానే ఈ దిశగా అంటే ఉద్వేగపరమైన వత్తిడి, మానసికపరమైన వత్తిళ్ళ దిశలో దృష్టిని సారిస్తే, దీని ప్రభావం సమాజంలో ఉండే లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందని నమ్ముతున్నాను. ”
రిపుల్స్ ఆఫ్ చేంజ్ ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీ నగేష్ కరుటూరి ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. వాయిస్ దట్ కేర్స్ (విటిసి) ని పరిచయం చేస్తూ, విటిసి ప్రాజెక్టు మేనేజర్, విటిసి హెల్ప్ లైన్ గురించి స్థూలంగా చెప్పడం జరిగింది. ముఖ్య అతితులకు స్వాగతం పలుకుతూ, హెల్ప్లైన్ భాగస్వామ్యం గురించి కూడా తెలియపరచడం జరిగింది. అధికారికంగా తెలుగు హెల్ప్ లైన్ లాంచ్ అయిన తరువాత ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది; ఆ తరువాత పోలీస్ శాఖ సభ్యులకు వర్క్-లైఫ్ బ్యాలంస్ ను ఏ విధంగా సమంగా చూసుకోవాలో, ఉద్వేగాలను బ్యాలంస్ చెయ్యడంలో ధ్యానం ప్రాముఖ్యత, మానసికబలాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి అన్న విషయాలపై చిట్కాలు తెలియజేయడంతో కార్యక్రమం ముగిసింది.
‘వాయిస్ దట్ కేర్స్’ కార్యక్రమాన్ని గురించి
‘వాయిస్ దట్ కేర్స్’ అనేది ఒక మానసిక-సామాజిక ప్రథమ చికిత్సకు సంబంధించిన హెల్ప్ లైన్. (సైకోసోషల్ ఫస్ట్ ఎయిడ్ హెల్ప్ లైన్) ఇందులో భాగంగా ఆందోళన, భయం, ఫోబియాలు, అపరాధ భావం, విచారం, ఒంటరితనం, కోపం, పరీక్షా వత్తిడి, మహమ్మారి వల్ల కలిగిన మానసిక సమస్యలు, ఇంకా మరెన్నో మానసిక రుగ్మతలతో బాధపడుతున్నవారికి ఉచితంగా మానసిక కౌన్సెలింగ్ అందించ్డం జరుగుతుంది. హెల్ప్ లైన్ నెంబర్: 8448-8448-45, వారానికి 7 రోజులూ, ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ పని చేస్తుంది. అవసరం పెరుగుతున్న కొద్దీ హెల్ప్ లైన్ సామర్థ్యాన్ని విస్తరించడం జరుగుతుంది. దీన్ని హార్ట్ఫుల్నెస్ (https://heartfulness.org/in/voice-that-cares/) మరియు ఆర్.ఒ.సి.ఎఫ్. (https://www.rocf.org/voice-that-cares/) వారు చూసుకుంటారు.
హార్ట్ఫుల్నెస్ ఇన్ స్టిట్యూట్ గురించి (www.heartfulness.org)
హార్ట్ఫుల్నెస్ ఇంస్టిట్యూట్ ఒక లాభాపేక్ష లేని అంతర్జాతీయ సంస్థ; యునైటెడ్ నేషంస్ డి.పి.ఐ.తో కూడి పని చేస్తున్న 75 సంవత్సరాల చరిత్ర గల సంస్థ. హార్ట్ఫుల్నెస్ ఆత్మ-వికాసం కోసం, రిలాక్సేషన్, ధ్యానము, పునరుజ్జీవనం అనే విశిష్ఠమైన, సరళమైన, లౌకిక యౌగిక ప్రక్రియలను అందరికీ అందిస్తోంది. ఆంతరంగిక ప్రశాంతత, నిశ్చలత్వంమనలో పెంపొందడానికి ఈ తీవ్రగతిని నడుస్తున్న ప్రపంచంలో ఎంతగానో సహాయపడతాయి. హార్ట్ఫుల్నెస్ ధ్యానం అందరికీ ఉచితంగా ఏ రుసుమూ లేకుండానే అందించడం జరుగుతుంది. ఈ రోజున హార్ట్ఫుల్నెస్ 130 దేశాలకు పైగా విస్తరించిఉన్నది; సుమారు 40 లక్షల సాధకులు అనుసరిస్తూ ఉన్నారు; 14000 మంది ట్రైనర్లున్నారు; ప్రపంచవ్యాప్తంగా 265 ధ్యాన కేంద్రాలు, 75 రిట్రీట్ సెంటర్లు ఉన్నాయి. అంతేగాక హార్ట్ఫుల్నెస్ కార్యక్రమాలన్నీ కూడా వర్చువల్ గా అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ల ద్వారా, హార్ట్-ఇన్-ట్యూన్ ఆప్ ద్వారా సుఖంగా ఇంట్లో కూర్చొనొ నేర్చుకోవచ్చు. హార్ట్ఫుల్నెస్ తన దూరదృష్టితోనూ, తన విలువలకు అనుగుణంగా పని చేస్తూ విద్య, పర్యావరణం, ఆరోగ్య రంగాల్లో కూడా విశేషంగా కృషి చేస్తున్నది.
రిపుల్స్ ఆఫ్ ఛేంజ్ ఫౌండేషన్ (www.rocf.org)
రిపుల్స్ ఆఫ్ ఛేంజ్ ఫౌండేషన్ అనేది ఒక ఎన్.జి.ఒ. సంస్థ. దీని దృష్టి మానవీయ సమస్యలపైన, సామాజిక-ఆర్థిక పరమైన అభివృధి కార్యక్రమాలపైన, కేంద్రీకృతమై ఉంటుంది. కోవిడ్-19 మహమ్మారి ని ఎదుర్కొనే సమయంలో ప్రభుత్వం చేసిన ప్రయత్నాల్లో ప్రధాన పాత్ర పోశించింది ఈ సంస్థ. ఆర్.ఒ.సి.ఎఫ్. ప్రధానంగా విద్యారంగంలోనూ, నైపుణ్యాలను పెంపొందించడంలోనూ, పర్యావరణం, ఆరోగ్యం వెల్ నెస్ రంగాల్లో ప్రముఖ పాత్ర వహిస్తుంది. పుట్టుకొస్తున్న సామాజిక సవాళ్ళను ఎదుర్కొనే దిశగా పని చేస్తూ, ఇంక్యుబేషన్ హబ్ పోషణలోనూ, నవీన రూపకల్పనలల్లోనూ, వినూత్నమైన, దీర్ఘకాల, విస్తరించగల పరిష్కారాలను పెంపొందించడంలోనూ, సమాజంలో ఉండే అత్యవసరమైన సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తూ సమాజంపై ప్రభావం ప్రస్ఫుటంగా ఉండెలా చేస్తుంది.
For Further query, please contact Perfect Relations:
Chandra Reddy @ 9603576330, Chandra.polaggari@perfectrelations.com
Divyatha @ +91 99850 25068, Divyatha.Bandiatmakur@perfectrelations.com
addComments
Post a Comment