మధుబని రైల్వే స్టేషన్లో రైలులో మంటలు..
పాట్నా (ప్రజా అమరావతి): బీహార్‌లోని మధుబని రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
ఆగి ఉన్న రైల్లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. అన్ని బోగీలకు మంటలు వ్యాపించడంతో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది, కూలీలు, అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో రైల్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
addComments
Post a Comment