నాలెడ్జ్ అసెస్ మెంట్ టెస్ట్ (KAT) చైతన్య పాఠశాల విద్యార్థుల హవా

 *నాలెడ్జ్ అసెస్ మెంట్ టెస్ట్ (KAT)  చైతన్య పాఠశాల విద్యార్థుల హవా


*.


మంగళగిరి (ప్రజా అమరావతి); పట్టణం షరాప్ బజార్ లోని చైతన్య పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయిలో జనవరి 2న కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన KAT - level -2  పోటీ పరీక్షలో  విజయ దుందుభి మోగించారు. పాఠశాలలోని 16 మంది విద్యార్థులు అర్హత  సాధించారు. వీరిలో ఇద్దరు నగదు బహుమతి కి ఎంపికవ్వగా మిగతా 14 మంది విద్యార్థులు మెడల్ మరియు సర్టిఫికెట్ సాధించారని ప్రిన్సిపాల్ కె.వాసు తెలియజేసారు.విజయం సాధించిన విద్యార్థులను  పాఠశాల ఇజీఎం మురళి కృష్ణ ఆర్ ఐ రామారావు,   డీన్ కాళిదాసు బ్యాచ్ ఇంచార్జి రాజశేఖర్ మొదలగువారు అభినందించారు.

Comments