ఏప్రిల్ 22 నుండి మే 12 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు


ఏప్రిల్ 22 నుండి మే 12 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు

నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ ప్రకటించిన జెఇఇ షెడ్యూల్ ప్రకారం మార్పు

     రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

అమరావతి,మార్చి 3 (ప్రజా అమరావతి)


:  రాష్ట్రంలో  ఇంటర్మీడియట్ ప్రథమ,ద్వితీయ సంవత్సరం పరీక్షలను ఈ ఏడాది ఏప్రిల్ 22 నుండి  మే 12 వరకూ నిర్వహించనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఐ.ఐ.టి.ల్లో అడ్మిషన్ల కోసం ఢిల్లీకి చెందిన నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ జెఇఇ షెడ్యూల్ ను ఖరారు చేసిన నేపథ్యంలో దానికి అనుగుణంగా  రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలను నిర్వహించేందుకు రివైజ్డు షెడ్యూల్ ను జారీచేసినట్లు  మంత్రి తెలిపారు.గురువారం సచివాలయం నాల్గో బ్లాక్ లోని ప్లబిసిటీ సెల్ లో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జెఇఇ పరీక్షలు ఈ ఏడాది  ఏప్రిల్ 16 నుండి 21 వరకు  జరుగుతాయన్నారు.ఆ పరీక్షలకు రాష్ట్రం నుండి హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి నష్టం కలగకుండా జెఇఇ షెడ్యూల్  ప్రకారం ఇంటర్మీడియెట్ పరీక్షల రివైజ్డ్  షెడ్యూలును ఖరారు చేయడం జరిగిందన్నారు.ఈరివైజ్డు షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్ 22 నుండి మే 11 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్ 23 నుండి మే 12 వరకు జరుగుతాయన్నారు. సైన్సు విద్యార్థులకు నిర్వహించే  ప్రాక్టికల్ పరీక్షలు ఈ ఏడాది మార్చి 11 నుండి 31 వరకు ప్రతి రోజు రెండు సెషన్స్ లో అనగా  ఉదయం 9.00 నుండి మద్యాహ్నం 12.00 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు (ఆదివారం సెలవు దినాలు సహా)  జరుగుతాయన్నారు. 

ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణ తేదీలను మంత్రి వివరిస్తూ  ఏప్రిల్ 22 శుక్రవారం నాడు సెంకడ్ లాంగ్వేజ్ పేపర్-1ను,25 న ఇంగ్లీష్ పేపర్ -1ను,27 న మేథమెటిక్స్ పేపపర్-IA, బొటనీ పేపర్-1, సివిక్స్ పేపర్-1ను,29 న మేథమెటిక్స్ పేపపర్-IB, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1, మే 2 న ఫిజిక్స్ పేపర్ -1, ఎకనామిక్స్ పేపర్ -1ను,6 న  కెమిస్టీ పేపర్ -1, కామర్సు పేపర్ -1, సోషియాలజీ పేపర్ -1, పైన్ ఆర్ట్సు, మ్యూజిక్ పేపర్-1ను,9న పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, లాజిక్ పేపర్ -1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ -1 (బైపిసి విద్యార్థులకు) మరియు మే 11 న మోడరన్ లాంగ్వేజ్ పేపర్ -1, జియోగ్రఫీ పేపర్ -1 పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 

అదే విధంగా ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణ తేదీలను మంత్రి వివరిస్తూ  ఏప్రిల్ 23 శనివారం నాడు సెంకడ్ లాంగ్వేజ్ పేపర్-2,అలాగే 26 న ఇంగ్లీష్ పేపర్ -2ను,28 న మేథమెటిక్స్ పేపపర్-IIA, బొటనీ పేపర్-2, సివిక్స్ పేపర్-2,అదే విధంగా 30 న మేథమెటిక్స్ పేపపర్-IIB, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2, మే 5 న ఫిజిక్స్ పేపర్ -2, ఎకనామిక్స్ పేపర్ -2ను,7వతేదీన  కెమిస్టీ పేపర్ -2, కామర్సు పేపర్ -2, సోషియాలజీ పేపర్ -2, పైన్ ఆర్ట్సు, మ్యూజిక్ పేపర్-2 ను,10 న పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, లాజిక్ పేపర్ -2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ -2 (బైపిసి విద్యార్థులకు) మరియు మే 12 న మోడరన్  లాంగ్వేజ్ పేపర్ -2, జియోగ్రఫీ పేపర్ -2 పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.అదే విధంగా మార్చి 7న సోమవారం ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకూ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వేల్యూస్ పరీక్ష జరుగుతుందని తెలిపారు.అలాగే మార్చి 9వతేదీ బుధవారం ఉ.10గం.ల నుండి మధ్యాహ్నం 1గం.వరకూ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జరుగుతుందని మంత్రి తెలిపారు.కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలను తీసుకుంటూ ఈ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని,ఈ పరీక్షల నిర్వహణకు జిల్లా కలెక్టర్లు అందరూ పటిష్టమైన ఏర్పాట్లు చేస్తారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎం.శేషగిరిబాబు మాట్లాడుతూ ఈ ఏడాది  నిర్వహించే ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం  పరీక్షలకు  సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు.  థియరీ పరీక్షలను 1,400 కేంద్రాల్లోను మరియు ప్రాక్టికల్ పరీక్షలను సుమారు 975 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల అవసరార్థం అవసరమైతే మరికొన్ని కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. 


Comments