యువతి పై అత్యాచారంకు పాల్పడిన కేస్ ను 24గంటలలో ఛేదించిన దిశ మహిళా పోలీసు వారు

 కృష్ణాజిల్లా మచిలీపట్నం (ప్రజా అమరావతి);


*మచిలీపట్నంకు చెందిన 19సంవత్సరాల యువతి పై అత్యాచారంకు పాల్పడిన కేస్ ను 24గంటలలో ఛేదించిన దిశ మహిళా పోలీసు వారు*



*నిందితులు పోసిన నాగబాబు మరియు యర్రంశెట్టి మణిదీప్ లను అరెస్టు చేసి దిశ మహిళా పోలీసు వారు*

 

*కేస్ కు సంబంధించిన వివరాలను దిశ మహిళా పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించిన దిశ మహిళా పోలీసు స్టేషన్ డి‌ఎస్‌పి గారు గోపు రాజీవ్ కుమార్ గారు, DSP బందరు మాసుం బాష  గారు.*


_మచిలీపట్నంకు చెందిన 19సంవత్సరాల యువతి తన స్నేహితుడు ది 09.03.2022 వ తేదీన మద్యాహ్నం 03.30గంటల సమయంలో పల్లెపాల్లే బీచ్ సమీపంలో ఏకాంతంగా కూర్చుని ఉండగా నింధితులు వారి వద్దకు వెళ్ళి ఫిర్యాది స్నేహితుడిని చెట్టుకి కట్టివేసి ఆమెను మానభంగం చేసినట్లుగా ది 10.03.2022 వ తేదీన బందర్ తాలూకా పోలీసు స్టేషన్ నందు రిపోర్ట్ ఇవ్వగా కేస్ నమోదు చేసినారు._


_సదరు కేస్ విచారణను జిల్లా ఎస్‌పి  శ్రీ సిద్దార్ధ్ కౌశల్ IPS గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సర్కిల్ ఇన్స్పెక్టర్ విచారణ చేసే కేస్ అయినప్పటికి దిశ పోలీసు స్టేషన్ డి‌ఎస్‌పి శ్రీ గోపు రాజీవ్ కుమార్ గారిని ప్రత్యేకంగా విచారణ అధికారిగా నియమించడం జరిగింది 

దర్యాప్తు చేపట్టిన దిశ డి‌ఎస్‌పి ఈ కేస్ ను త్వరితగతిన చేధించాలని కృత నిశ్చయంతోజిల్లా ఎస్‌పి గారి ఆదేశాల మేరకు దిశ CI మరియు SI ల ఆద్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం విచారించి మరియు సాక్ష్యాల సేకరించి గ్రామంలో అనుమానం ఉన్న చోట గాలింపు చర్యలను చేపట్టి అసలైన నింధితులైన పోసిన నాగబాబు మరియు యర్రంశెట్టి మణిదీప్ అను చినకరగ్రహారం గ్రామంకు చెందిన వారిని ఈ రోజూ అరెస్ట్ చేయడం జరిగింది_

 

_విచారణలో నింధితులు ఏకాంతంగా ఉన్న ఫిర్యాది మరియు ఆమె స్నేహితుడుని బెదిరించి ఫిర్యాది స్నేహితుడిని చెట్టుకి కట్టివేసి  A1-పోసిన నాగబాబు పిర్యాదిని మానభంగం చేసినట్లు A2 –యర్రంశెట్టి మణిదీప్ నేరం జరుగుటకు సహకరించినట్లు ఇరువురూ చేసిన నేరంను అంగీకరించడం జరిగింది. నింధితులు ఇరువురికీ మద్యం సిగిరెట్లు  మరియు వ్యభిచారం వంటి దురవ్యసనాలు కలవు.  వీరు విచక్షణ కోల్పోయి మానవత్వం కోల్పోయి పిర్యాదిని మానభంగం చేసినట్లుగా నేరం అంగీకారం చేయడం జరిగింది. నింధితులు ఇరువురు దిన సరి కూలీలు A1ముఠా పని A2 సెంట్రింగ్ పని చేసుకుని జీవనం సాగిస్తారు. అరెస్ట్ నింధితులు ఇరువురిని రిమాండ్ నిమిత్తం కోర్ట్ కి తరలిస్తున్నామని, 7 రోజులలో దర్యాప్తు ముగించి చార్జ్ షీట్ వేస్తామని, చట్టపరంగా ఆమెకు రావాల్సిన విక్టిమ్ కంపెన్సేషన్ వచ్చేలా చేస్తామని, అంధోలనగా ఉన్న పిర్యాదిని కౌన్సెల్లింగ్ చేసి ఎల్లవెళ్ళాల పోలీసు సహాయం ఉంటుందని భరోసా కల్పించమని మరియు ఇటువంటి నేరాలు జరగడానికి అవకాశం ఉన్న ప్రదేశాలలో నిఘా పెంచుతామని దిశ మహిళా DSP గారు మరియు బందరు DSP గారు  పత్రిక సమావేశంలో తెలిపిన్నారు. 

నింధితుల వివరాలు_


1.పోసిన నాగబాబు,  29 సంవత్సరాలు,  గౌడ కులస్థుడు, చినకరగ్రహం, బందరు మండలము 

2.యర్రంశెట్టి మణిదీప్ ,30 సంవత్సరాలు,కాపు కులస్థుడు, చినకరగ్రహం,  బందరు మండలము

ప్రత్యేక బృందాలకు ప్రశంసలు 

అత్యాచార కేస్ ను కేవలం 24 గంటల వ్యవధిలోనే ఛేదించిన దిశ పోలీసు స్టేషన్ DSP గారిని మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్‌పి శ్రీ సిద్దార్ధ్ కౌశల్ IPS గారు ప్రత్యేకంగా అబినంధిచారు.

Comments