మార్చి-ఏప్రిల్ నెలలో 45 రోజులపాటు రైల్వే గేట్స్ 164 తాత్కాలికంగా మూసివెయ్యడం జరగనుంది.. వి.నాగేశ్వరరావు



తణుకు (ప్రజా అమరావతి) ; 


మార్చి-ఏప్రిల్ నెలలో 45 రోజులపాటు రైల్వే గేట్స్  164 తాత్కాలికంగా మూసివెయ్యడం జరగనుంది.. వి.నాగేశ్వరరావు


కాల్దరి మరియు అంబేద్కర్ కాలనీ, శెట్టిపేట (రైల్వే గేట్ 164) గ్రామాల  రహదారి మార్గంలో లెవెల్ క్రాసింగ్ గేట్ నెంబర్లు  164  వద్ద నిర్మించనున్న రైల్వే అండర్ బ్రిడ్జ్ (RUB) పనుల కోసం మార్చి 5  ఉదయం 8 గంటల నుంచి ఏప్రిల్ 18 సా.6.00 గంటల వరకు 45 రోజుల పాటు రైల్వే గేటు మూసిఉంచడం జరుగుతున్నట్లు రైల్వే భద్రతా అధికారి వి. నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటన లో తెలియ చేశారు .



అలాగే కాల్దరి -  శెట్టిపేట గ (రైల్వే గేట్ 163) గ్రామాల  రహదారి మార్గంలో లెవెల్ క్రాసింగ్ గేట్ నెంబర్లు  163 వద్ద నిర్మించనున్న రైల్వే అండర్ బ్రిడ్జ్ (RUB) పనుల కోసం మార్చి 12 ఉదయం 8 గంటల నుంచి ఏప్రిల్ 25  సా.6.00 గంటల వరకు 45 రోజుల పాటు రైల్వే గేటు మూసి ఉంచడం జరుగుతున్నట్లు  వి. నాగేశ్వరరావు తెలిపారు. 


ఈ విషయమై జిల్లా కలెక్టర్, పశ్చిమ గోదావరి జిల్లా వారికి జిల్లా యంత్రాంగం తరపున ప్రత్యన్నాయ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించే దిశగా క్షేత్రస్థాయి అధికారులకు సూచనలు జారీ చేయాల్సిందిగా కోరుతూ రైల్వే అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ జి ఎన్ ఏ శివకుమార్ లేఖ వ్రాయడం జరిగిందని ఆయన తెలిపారు.



 45 రోజుల పాటు తాత్కాలికంగా రైల్వే గేట్ మూసివేయడం వలన కాల్దారి, శెట్టిపేట, 

 గ్రామలకు చెందిన ప్రజలు, ఆయా గ్రామాల మీదుగా వెళ్లే వాహనాలు, తదితరులు మళ్లింపు మార్గాలు ద్వారా ప్రయాణాలు చేయవలసిందిగా కోరియున్నారు. ఈ సమయంలో రైల్వే అండర్ బ్రిడ్జ్, అప్రోచ్ రహదారి నిర్మాణ పనులు కోసం ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యన్మాయ మార్గాలు విషయం పై ప్రజలకు అవగాహన కల్పించాలని రైల్వే సంస్థ తరపున కోరడం జరిగిందని తెలిపారు.



Comments