నెల్లూరు, మార్చి 20 (ప్రజా అమరావతి): ఐదు రోజుల పాటు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి క్రీడా ప్రాంగణంలో ఉత్సాహ భరితంగా సాగిన 9వ జిల్లాస్థాయి రెవెన్యూ క్రీడోత్సవాలు
ఉద్యోగుల కేరింతలు, కోలాహలం మధ్య అట్టహాసంగా ముగిశాయి.
ఆదివారం ఉదయం ఈత పోటీలతో క్రీడలను జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు ప్రారంభించి ఈత కొలనులో క్రీడాకారుల విన్యాసాలను వీక్షించారు. అనంతరం విజేతలకు మెడల్స్ బహూకరించి అభినందించారు.
ఈ క్రీడోత్సవాల్లో డి ఆర్ ఓ, క్రీడల ఆర్గనైజింగ్ కన్వీనర్ శ్రీ చిన్న ఓబులేసు, నెల్లూరు, గూడూరు, ఆత్మకూరు, నాయుడుపేట, కావలి ఆర్డీవోలు శ్రీ హుస్సేన్ సాహెబ్, శ్రీ మురళీకృష్ణ, కుమారి చైత్ర వర్షిని, శ్రీమతి సరోజిని, శ్రీ సీనా నాయక్, చీఫ్ కోచ్ శ్రీ యతిరాజ్, సెట్నల్ సీఈవో పుల్లయ్య పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
విజేతల వివరాలు
........................
35 సంవత్సరాల పైబడినవారికి నిర్వహించిన 100 మీటర్ల స్విమ్మింగ్ పోటీల పురుషుల విభాగంలో గూడూరు డివిజన్ కు చెందిన బీ కామేశ్వరరావు మొదటి స్థానం, నెల్లూరు డివిజన్ కు చెందిన డివి రమణయ్య రెండో స్థానం, నెల్లూరు కలెక్టరేట్ కు చెందిన వేణుగోపాల్ తృతీయ స్థానంలో నిలిచారు.
35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల వారికి నిర్వహించిన 100 మీటర్ల పురుషుల స్విమ్మింగ్ పోటీల్లో నెల్లూరు డివిజన్ కు చెందిన నారాయణ, నాయుడుపేట డివిజన్కు చెందిన హేమంత్, నెల్లూరు కలెక్టరేట్కు చెందిన గోపి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.
35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల మహిళలకు నిర్వహించిన 50 మీటర్ల స్విమ్మింగ్ పోటీల్లో నెల్లూరు కలెక్టరేట్ కు చెందిన ఎస్ కె మోహసిన్, నాయుడుపేటకు చెందిన కె రమాదేవి ప్రథమ ద్వితీయ స్థానాలలో నిలిచారు.
త్రో బాల్ లో కావలి డివిజన్ విన్నర్ గా, నెల్లూరు డివిజన్ రన్నర్సగా నిలిచాయి.
కోకో పోటీల్లో నెల్లూరు డివిజన్ విన్నర్ గా, కావలి డివిజన్ రన్నర్ గా నిలిచాయి.
బాస్కెట్బాల్ విభాగంలో నెల్లూరు డివిజన్ విన్నర్స్ గా, గూడూరు డివిజన్ రన్నర్ గా నిలిచాయి.
టగ్ ఆఫ్ వార్ విజేతగా కావలి డివిజన్, రన్నర్గా నెల్లూరు డివిజన్ నిలిచాయి.
addComments
Post a Comment