శివరాత్రి వేడుకలలో భక్తులు అత్యంత శ్రద్ధ భక్తులతో తెల్లవారుజాము నుంచే పొట్టేత్తారు.పోలవరం (పట్టిసం)  (ప్రజా అమరావతి);


మంగళవారం పట్టిసంలో శ్రీ వీరేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలలో భక్తులు అత్యంత శ్రద్ధ భక్తులతో తెల్లవారుజాము నుంచే పొట్టేత్తారు. రెవెన్యూ, పోలీసు, మత్స్య, అగ్నిమాపక, ఆర్ అండ్ బి, విద్యుత్తు, పంచాయతీ తదితర శాఖల అధికారులు మూడు షిఫ్ట్ లలో విధులను నిర్వర్తిస్తున్నారు.


పట్టిసం శివరాత్రి వేడుకల ఛైర్మన్ గా అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.


జంగారెడ్డిగూడెం ఆర్డీవో వై వి ప్రసన్న లక్ష్మీ, పోలవరం డిఎస్పీ కె. లతా కుమారి లు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ పట్టిసం శివరాత్రి వేడుకల్ని ఎటువంటి అవాంతరాలు లేకుండా  నిర్వహించడం జరుగుతొంది. ముగ్గురు తహసీల్దార్ లు ప్రోటోకాల్ విధుల్లో పాల్గొనగా,  ఇతర శాఖల అధికారులు కూడా వారి కేటాయించిన విధులకు హాజరై శివరాత్రి వేడుకలను విజయవంతం చేయడానికి భాగస్వామ్యం అవుతున్నారు.