తాడేపల్లి (ప్రజా అమరావతి);
నిమ్మల రామానాయుడు కి ఘనస్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టి.డి.యల్.పి
ఉప నాయకులుపాలకొల్లు ఎమ్మెల్యేనిమ్మలరామా
నాయుడు పేదలకు టిడ్కో
ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పంపిణీ చేయాలని పాలకొల్లు నుండి రాష్ట్ర సచివాలయం వెలగపూడి (అమరావతి) వరకు సైకిల్ యాత్ర చేపట్టారు ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం తాడేపల్లి ప్రకాశం బ్యారేజీ వద్దకు నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్ర చేరుకుంది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తాడేపల్లి టౌన్ రూరల్ నేతలు కార్యకర్తలు రామానాయుడికి ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పేదలకు టిడ్కో ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి జగన్ మహిళా ద్రోహి అని విమర్శించారు. ఎన్నికలకు ముందు జగన్ మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి మూడు సంవత్సరాలు అయినా హామీనినెరవేర్చలేదని అన్నారు. ప్రజా సమస్యలను వినిపించేందుకే అసెంబ్లీకి వెళుతున్నట్లు చెప్పారు. పేదల పక్షంగా ఎదురొడ్డి పోరాడి న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో తాడేపల్లి
టీడీపీపట్టణ మాజీ అధ్యక్షులు
జంగాల సాంబశివరావు,పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు,మండల అధ్యక్షులు
అమర సుబ్బారావు,కొల్లి శేషు,
జంగాల వెంకటేష్,జుంజు మరియదాసు,మాజీ కౌన్సిలర్ ఓలేటి రాము,మహిళలు అన్నెం కుసుమ,బొర్రా కృష్ణ వందన పి. కృష్ణవేణి,టీడీపీ నాయకులు కార్యకర్తలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment