మహిళ స్వేచ్ఛాజీవనానికి 'దిశ' సమగ్రప్రణాళిక - జాతీయ మహిళా మాక్ పార్లమెంట్ లో హోం మంత్రి సుచరిత



మహిళ స్వేచ్ఛాజీవనానికి 'దిశ' సమగ్రప్రణాళిక

- జాతీయ మహిళా మాక్ పార్లమెంట్ లో హోం మంత్రి సుచరిత


- స్పీకర్ స్థానంలో కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ

- 'దిశ', 50శాతం మహిళా రిజర్వేషన్ తదితర బిల్లుల ఆమోదం


గుంటూరు, 4 మార్చి, 2022 (ప్రజా అమరావతి): సమాజంలో మహిళ ఎవ్వరికీ భయపడకుండా స్వేచ్చగా జీవనం సాగిస్తూ సమగ్రమైన దిశలో పయనించినప్పుడే మహిళ అన్ని రంగాల్లో రాణించేందుకు మార్గం ఏర్పడుతుందని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. శుక్రవారం ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో ' జాతీయ మహిళ పార్లమెంట్ -2022' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అధ్యక్షత వహించగా,

రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్యక్రమం ప్రారంభంలో తిరుపతి నుంచి వచ్చిన అర్చకులు ప్రత్యేకంగా పూజాకార్యక్రమాలు నిర్వహించి, తీర్ధ ప్రసాదాలను అతిధులకు అందించారు. యువత మహిళా చైతన్య గీతాలను ఆలపించారు. అనంతరం జాషువా కల్చరల్ అకాడమీ నుంచి యువత ‘స్ర్తీ గమనం’ అనే నాటకాన్ని ప్రదర్శించి బాలికల రక్షణపై గీతాలను పాడి వినిపించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో విశాఖ పట్నం ఆంధ్రా విశ్వ విద్యాలయంకు చెందిన డిస్టెంట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ పి. ఉష రచించిన ‘ఎఫైరింగ్ స్టేటజీ ఫర్ ట్రైబల్ గాల్స్’ అనే పుస్తకాన్ని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, అతిధులు ఆవిష్కరించారు.

 రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ప్రజలు,మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని కొనియాడారు. కోవిడ్ పరిస్థితులను తట్టుకొని పరిపాలనలో సమూల మార్పులు తీసుకురావడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా మహిళల ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రయోజనాలను కల్పించేందుకు చేస్తున్న కృషి కొనియాడారు. అమ్మఒడి, చేయూత, ఆసరా, ఇంటి పట్టాలు మహిళల పేరిట అందించడంతో పాటు ఇల్లు కట్టించే ప్రక్రియకు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. తద్వారా అనేక రంగాల్లో మహిళలు స్థిర అభివృద్ధిని సాధించేందుకు బాటలు వేస్తున్నారని అభినందనలు తెలిపారు. మహిళల రక్షణ కోసం దిశా యాప్ ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు దిశా చట్టం అమలు చేసేందుకు రాష్ట్ర శాసన సభలో తీర్మానం చేసి కేంద్రం ఆమోదం కోసం పంపిన విషయాన్ని గుర్తు చేశారు. నవరత్నాల పధకాలన్నీ మహిళలను దృష్టిలో పెట్టుకొని చేసినవేనని తెలిపారు. మహిళకు భవిష్యత్తు మార్గాలను సరళం చేసి రాష్ట్రంలో ప్రతీ మహిళ తలెత్తుకుని తిరిగేందుకు మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారని కొనియాడారు.

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ కేంద్రంలో జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు వర్శిటిలో జాతీయ మహిళా పార్లమెంట్ - 2022 కార్యక్రమం నిర్వహణతో  మహిళల్లో చైతన్యం తీసుకురావడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో మహిళా సాధికారతను సాధించేందుకు అవసరమైన 5 ముఖ్యాంశాల అజెండాను దృష్టిలో ఉంచుకొని జాతీయ మహిళా పార్లమెంట్ – 2022 కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ కార్యకలాపాలు, కమిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చూపిన చొరవ, రాష్ట్ర మహిళా కమిషన్ నిర్వహించిన కార్యక్రమాలు, కేంద్రంలో జాతీయ మహిళా కమిషన్ అందిస్తున్న సహకారం, మహిళలకు మహిళా సాధికారత, మహిళలు పని చేసే ప్రదేశాల్లో  లైంగిక వేధింపులు, ఆహారం, ఆరోగ్యం, విద్య, బాలలు, మహిళాసదనాల సందర్శన వంటి అంశాలను పేర్కొన్నారు.

శాసన మండలి సభ్యురాలు పోతుల సునీత మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు ప్రయోజనాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి నిరంతరం పాటు పడుతున్నారని తెలిపారు. గతంలో కన్నా ఇప్పుడు మహిళలకు అన్ని రంగాల్లో పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశాలను కల్పించిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు.

ఉపాధ్యాయ శాసన మండలి సభ్యురాలు కల్పలత మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి నాలుగు రోజుల ముందే జాతీయ మహిళా పార్లమెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చేయడం అభినందనీయమన్నారు.  గతంలో ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి మహిళా చైతన్య కార్యక్రమాలు చేపట్టలేదని నిర్వహకులను అభినందించారు. విద్యకు తగిన ప్రాధాన్యత, ఆరోగ్యపరిరక్షణ, మహిళల సంరక్షణకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆమె కొనియాడారు. తాడికొండ నియోజకవర్గ శాసన సభ్యురాలు డాక్టర్. ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న నేపథ్యాన్ని వివరించారు. విద్యార్ధి దశ నుంచే యువతలకు, మహిళలకు ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పధకాల ద్వారా తగిన సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. 50శాతం మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలను కల్పిస్తున్న సీఎం జగన్ కు అందరం రుణపడి ఉన్నామన్నా రు. యునిసెఫ్ (ఏ.పి. తమిళనాడు, కర్నాటక) రాష్ట్రాల ప్రతినిధి సోనీ జార్జీ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అద్భుతమైన విధానాలను అనుసరిస్తోందని పేర్కొన్నారు. సమాజంలో మహిళలకు అందిస్తున్న సహకారం అద్భుతమన్నారు. మహిళల అభివృద్ధికి కృషిచేస్తున్న ప్రభుత్వానికి తామ చిత్త శుద్ధితో తగిన సహకారం అందిస్తామన్నారు. ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయ ఉప కులపతి పి, రాజశేఖర్ మాట్లాడుతూ మహిళల అభివృద్ధి, సాధికారితకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా తగిన రీతిలో ఎప్పుడూ సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పలు విభాగలకు మహిళా హెచ్.ఓ.డి లను ఏర్పాటు చేశామని పలువురు మహిళా అధికారులను సభలో పరిచయ చేశారు. జాతీయ మహిళా పార్లమెంట్ నిర్వహణకు ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం వేదిక కావడం గొప్ప విషయమన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి సుచరిత, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తల్లి భారతిని, కార్యక్రమానికి విచ్చేసిన అతిధులను సత్కరించి మెమోంటో లను బహూకరించారు.


దిశ బిల్లు, రిజర్వేషన్ బిల్లకు ఆమోదం:

-----------------------

 అనంతరం ‘జాతీయ మహిళా పార్లమెంట్ – 2022’ నిర్వహణ పేరుతో పార్లమెంట్ విధానాలు, అక్కడ మహిళ సంక్షేమం కోసం చర్చించాల్సిన ఐదు ప్రధాన అంశాలను మాక్ పార్లమెంట్ ముందుంచారు. ఇప్పటికే ఉన్న చట్టాలను బలోపేతం చేయడం - గృహహింస చట్టం, 125 సీఆర్.పీసీ, పోష్ చట్టం, వివాహ ఆర్డర్ అమలులో వయస్సు పెంపు, దిశ బిల్లు తదితర చట్టాలకు సంబంధించి సిఫార్సు చేసిన అవకాశాలతో లోపాలను పూరించడంపై చర్చించారు. అదేవిధంగా మహిళలకు ఆర్థిక సహాయాన్ని ప్రోత్సహించడానికి మహిళల ఆర్థిక సాధికారత అంశంపై ప్రధానంగా ఫోకస్ తో చర్చించారు. లింగ సాధికారత - అన్ని పాఠ్యాంశాల్లో లింగ సున్నితత్వం/ సమానత్వంతో కూడిన కొత్త విద్యా విధానంపై ఆసక్తికర చర్చ నడిపించారు. మహిళలు, బాలికల భద్రత - దిశ యాప్. సైబర్ క్రైమ్ జోక్యం, పోస్కో కోసం అన్ని జిల్లాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు. అక్రమ రవాణా మరియు ఇతర చర్యలపై పరిశీలనాత్మకంగా చర్చించారు. చివరి అంశంగా మహిళల ఆరోగ్యం & శ్రేయస్సు అనే ప్రధానాంశంగా చర్చించి ఆయా అజెండాలపై ఫోరమ్ నుండి చర్చ తర్వాత అంశాలవారీగా తీర్మానాలను చేశారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించిన దిశ బిల్లును, 50శాతం మహిళా రిజర్వేషన్, 21 సంవత్సరాల వివాహ వయసు పెంపు తదితర బిల్లులను మాక్ పార్లమెంట్ లో ఆమోదించారు. సభకు పార్లమెంట్ స్పీకర్ గా వాసిరెడ్డి పద్మ, మిగతా ప్రధాన మంత్రి, ఇరత కేంద్ర మంత్రులుగా రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు గజ్జల లక్ష్మి, కర్రి జయశ్రీ, బూసి వినీత, గడ్డం ఉమ, షేక్ రుకియాబేగం వ్యవహరించగా.. ఎంపీలుగా వాసవ్య మహిళా మండలి ప్రతినిధులు కీర్తి, పోలిశెట్టి సుభాషిణి, రష్మి, కుమారి, వర్శిటీ ప్రొఫెసర్ లు విమల, సరస్వతి, విశ్వ విద్యాలయ అధ్యాపకులు, హెచ్.ఓ.డి లు, న్యాయవాదులు, పోలీసు అధికారులు, ఎన్.జి.ఒ లు పాల్గొన్నారు. 

Comments
Popular posts
వైసీపీఎమ్మెల్యేల దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
Image
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చెయ్యం... • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు • ఉచిత విద్యుత్ కొనసాగించి తీరుతాం... • రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు • విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... : మంత్రి శ్రీనివాసరెడ్డి సచివాలయం (prajaamaravati), అక్టోబర్ 28 : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని కోరారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనe సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని, ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు... తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగడి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని. రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిస్కమ్ లకు సంపూర్ణ సహకారం... విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సత్వర సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ 2020 నెలలకు సంబంధించి కొవిడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న జీతాలు త్వరలో చెల్లిస్తామన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై నివేదిక అందించామని, అదనంగా ఏ వివరాలు ఏం కావాలన్నా ఇస్తామని తెలిపారు. RTPP ని అమ్మేస్తామని వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా పంపామని మంత్రి వెల్లడించారు. 1-2-1999 నుంచి 31-08-2004 మధ్య నియమించిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం విషయం లో ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 1/02/1999 నుంచి 31/08/2004 మధ్య నియమించిన ఉద్యోగుల కోసం EPF నుండి GPF సౌకర్యం అమలు కోసం 02/10/2020న ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని, దీనిపైనా సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు జీతాలు నేరుగా ఇచ్చేందుకు సంబంధించి కూడా ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి పంపారన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇది కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా జీతాలు చెల్లించే విషయం ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషను నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా, A.P. ట్రాన్స్ కో ఇప్పటికే T.O.O (28-11-2008) తేదీన జారీ చేసిందన్నారు. పెండింగులో ఉన్న నియామకాలపై సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి క్యాష్ లెస్ వైద్య విధానాని కి సంబంధించి కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. APGENCO, APTRANSCO & AP DISCOM లలోని అన్ని ట్రస్టులలో ADVISORY కమిటీ సభ్యత్వం ఇస్తామన్నారు. APPCC లో HR నిర్ణయాలు JAC తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్ (జెఎల్ఎమ్ గ్రేడ్ -2) మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలకు అనుమతిలిచ్చామన్నారు. ఓ అండ్ ఎం సిబ్బందికి 9వ పెయిడ్ హాలిడే ఆదేశాలిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు సాంకేతికంగా దేశంలోనే అత్యంత సమర్థులని, ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పాత్రను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారు చేసే సేవలను అభినందిస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలోనూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ఎంతటి కష్టకాలంలో నైనా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రసంశనీయమని మంత్రి బాలినేసి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు ఎస్.నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగ జేఏసీతో మంత్రి శ్రీనివాసరెడ్డి చర్చలు... అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎపిడిసిఎల్ సీఎండీ నాగలక్ష్మి,, ఆయా విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
Image
ప్రగల్బాలు పలికిన మంత్రి పెద్దిరెడ్డి ఒక చేతగాని దద్దమ్మ
Image
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
Image
సమన్వయంతో పనిచేయాలి.. పనుల్లో వేగం పెంచాలి
Image