సంక్షేమ పధకాలను సోషల్ మీడియా కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి



తాడేపల్లి- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రకార్యాలయం (ప్రజా అమరావతి);



*పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్లతో సమావేశమైన పార్టీ అనుబంధ విభాగాల ఇన్ ఛార్జ్, రాజ్యసభసభ్యులు శ్రీ వి.విజయసాయిరెడ్డి.*



*- సంక్షేమ పధకాలను సోషల్ మీడియా కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి.*


*-తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి.*


*-ప్రతి కార్యకర్తకు, వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది.*


*-సోషల్ మీడియా విభాగంపై పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ ప్రత్యేక దృష్టి సారించారు.*


*-కేసుల వల్ల ఇబ్బంది పడేవారికి లీగల్ సెల్ ద్వారా సహాయం.*


*-సోషల్ మీడియా కోఆర్డినేటర్ల సమావేశంలో పార్టీ అనుబంధ విభాగాల ఇన్ ఛార్జ్, రాజ్యసభసభ్యులు శ్రీ వి.విజయసాయిరెడ్డి.*


         వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని పార్టీలోని మహిళా,యువత,విద్యార్ది,రైతు విభాగాలతో  సంఘటిత పరుస్తామని పార్టీ అనుబంధ విభాగాల ఇన్ ఛార్జ్,రాజ్యసభసభ్యులు శ్రీ వి.విజయసాయిరెడ్డి తెలియచేశారు.


 తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్ల సమావేశం జరిగింది. 


పార్టీ అనుబంధ విభాగాల ఇన్ ఛార్జ్,రాజ్యసభసభ్యులు వి.విజయసాయిరెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఆయా విభాగాలను సమన్వయపరచడం ద్వారా ప్రభుత్వ పధకాలను క్షేత్రస్దాయికి తీసుకువెళ్లాలనేది ప్రధాన లక్ష్యం అన్నారు.  పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా శ్రీ వైయస్ జగన్, నవరత్నాల పధకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు.  నవరత్నాల పధకాలు రాష్ర్టంలోని అత్యధికమంది పేదలకు ముఖ్యంగా బిసి,ఎస్సిఎస్టి,మైనారిటీ వర్గాలతో పాటు అగ్రవర్ణాలల్లోని పేదలకు కూడా అందుతున్నా యన్నారు. మధ్యవర్తులకు, దళారులకు అవకాశం  లేకుండా నేరుగా లబ్దిదారుల అకౌంట్లలో డబ్బులు పడేవిధంగా చేస్తున్నారన్నారు. మహిళా సాధికారిత,యువతకు విద్య,ఉపాధి అవకాశాలు,విద్యార్ధులకు విద్యను అందుబాటులోకి తేవడం,రైతులకు పంట వేసిన దగ్గరనుంచి గిట్టుబాటు ధర వచ్చే వరకు అనేక పధకాలను అమలు చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా కూడా ఈ విధంగా  సమగ్రంగా పధకాలను అందచేస్తున్న పరిస్దితి లేదన్నారు. 


కాబట్టి సోషల్ మీడియా కార్యకర్తలు ఆ పధకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేవిధంగా చూడాలన్నారు.ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ప్రకటించిన విధంగా కులం,మతం,ప్రాంతం,పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడాలని సూచించారు.

               సోషల్ మీడియా కార్యకర్తలు వారికి వ్యక్తిగత సమస్యలు ఉన్నా,లేదా వారి దృష్టికి వచ్చే ప్రజా సమస్యలను పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం పార్టీ గ్రీవెన్స్ సెల్ ప్రత్యేకంగా పనిచేస్తుందని తాను కూడా ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ బనాయించిన అక్రమకేసుల విషయంలో పార్టీ వారికి అండగా నిలబడతుందని అన్నారు. ఇందుకోసం సోషల్ మీడియా విభాగంతో పార్టీ లీగల్ సెల్ ను సమన్వయం చేయడం జరుగుతుందని వివరించారు. పార్టీ సభ్యత్వం ద్వారా ఇచ్చే ఐడి కార్డులను సోషల్ మీడియా కార్యకర్తలకు ఇస్తామని దాంతోపాటు సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రత్యేక యాప్ రూపొందిస్తామని వివరించారు.

              వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని శక్తివంతంగా తీర్చిదిద్దేలా చేయడంతోపాటు  ప్రభుత్వంపైన,పార్టీపైనా ప్రతిపక్షపార్టీ తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు.


   జాబ్ మేళాలు

-----------------------          

      పార్టీలోని సోషల్ మీడియా విభాగానికి సంబంధించి అర్హులైన వారికి ఉద్యోగవకాశాలు కల్పించాలనే ధ్యేయంతో రాష్ర్టంలోని మూడు ప్రాంతాలలో  జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు విజయసాయిరెడ్డి వివరించారు. ఏప్రిల్ 16,17 తేదీలలో తిరుపతిలో చిత్తూరు,వైయస్సార్ కడప,కర్నూలు,అనంతపురం,పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలవారికి మొదటి జాబ్ మేళా నిర్వహిస్తామని తెలిపారు. ఐటి,మాన్యూఫాక్చరింగ్,ఐటిఇఎస్,రిటైల్,ఆటోమోబైల్,ఈ కామర్స్ రంగాలలో దాదాపు ఐదువేల ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఏప్రిల్ 23,24 తేదీలలో వైజాగ్ లో తూర్పుగోదావరి,వైజాగ్,విజయనగరం,శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి రెండో జాబ్ మేళా ఉంటుందన్నారు. దాదాపు 4,500 ఉద్యోగాలకు అభ్యర్దులను  ఎంపిక చేస్తారన్నారు. ఇక్కడ ఐటి,టెక్స్ట్ టైల్,ఫార్మా,లైఫ్ సైన్సెస్, మాన్యూఫాక్చరింగ్,ఐటిఇఎస్,రిటైల్,ఆటోమోబైల్,రిటైల్ రంగాల ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఏప్రిల్ 30,మే ఒకటో తేదీన తాడేపల్లిలో గుంటూరు,విజయవాడ,ప్రకాశం,పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించి మూడో జాబ్ మేళా నిర్వహిస్తారన్నారు. ఐటి,టెక్స్ టైల్ ,మాన్యూఫాక్చరింగ్,ఐటిఇఎస్,రిటైల్,ఆటోమోబైల్,ఫార్మా,రిటైల్ రంగాలకు సంబంధించిన ఉద్యోగాలు దాదాపు 4,500 వరకు అందుబాటులో ఉంటాయన్నారు. ఇక రాష్ర్టంలోని 660 మండలాలు,నగరాలలోని వార్డులు,డివిజన్లలో కలిపి దాదాపు వేయిమంది వరకు సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ లను నియమించడం జరుగుతుందని తెలియచేశారు.


      సమావేశంలో పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు,శాసనమండలి సభ్యులు శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి,పిఠాపురం శాసనసభ్యులు శ్రీ దొరబాబు,  శ్రీ అంకంరెడ్డి నారాయణ మూర్తి(గ్రీవెన్స్ సెల్) పాల్గొన్నారు.  

సమావేశానికి సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు.

Comments