మీమీ మండలాలు అభివృద్ధి లో ఎంపిటిసిలు పనితీరు కీలకంకొవ్వూరు (ప్రజా అమరావతి); 


మండల పరిషత్ సమీక్షా సమావేశాలకు హాజరై తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల అభివృద్ధికి సూచనలు , సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురావచ్చునని ఎంపీపీ కాకర్ల నారాయుడు, డివిజన్ డెవలప్మెంట్ అధికారి పి. జగదాంబ పేర్కొన్నారు. మీమీ మండలాలు అభివృద్ధి లో ఎంపిటిసిలు పనితీరు కీలకంఅన్నారు. 


స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఎంపిపి సమావేశ మందిరంలో సోమవారం కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని  ఎంపిటిసి ల శిక్షణ కార్యక్రమంలోఎంపిటిసి ల విధులు, బాధ్యత లు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపిపి కాకర్ల నారాయుడు మాట్లాడుతూ, మండల అభివృద్ధి తో పాటు గ్రామాభివృద్ధి కోసం ఎంపీటీసీ లు గ్రామ ఎంపీటీసీ సభ్యుడు తాను ప్రాతి నిధ్యం వహించే ప్రాదేశికం పరిధిలో అన్ని పంచాయతీ సమావేశాల్లో పాల్గొనవచ్చునన్నారు.  పనుల్లో అవకతవకలు జరుగుతుంటే ప్రశ్నిం చడమే కాక విషయూన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపే అవకాశం ఉందన్నారు .  తమ పరిధిలోని పాఠశాలలను పరిశీలించి విద్యా ప్రమాణాలు మెరుగుదలకు సూచనలు చేయవచ్చునని, మండల పరిషత్ నిధులు సద్వినియోగం అయ్యేలాగా సూచనలు చెయ్యవొచ్చు నన్నారు. 


డిడిఓ పి. జగదాంబ మాట్లాడుతూ నిధులు కోసం కాకుండా ఎంపిటిసిలు వారి భాద్యత, విధులను సమర్ధవంతంగా నిర్వహిస్తే నిధులు అవే వొస్తాయన్నారు. రాజ్యాంగ కల్పించిన హక్కులు తెలుసుకుని గ్రామాభివృద్ధి కృషిచేయ్యగల మన్నారు. గత మూడు సంవత్సరాలు గా గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల దగ్గరకే పాలన ను తీసుకుని వెళ్లగలిగా మని తెలిపారు. .. జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, మండల స్థాయి లో మండల పరిషత్, గ్రామ స్థాయిలో పంచాయతీ వ్యవస్థలకీ పరిపాలన వ్యవస్థ ను నిర్దేశించడం జరిగిందన్నారు.  ఆయా గ్రామ జనాభా ప్రాతిపదికన ఎంపిటిసి సభ్యులు ఎన్నుకుంటారు. మండల పరిషత్తు నందు ఆ గ్రామ ప్రతినిధిగా ఎంపిటిసి సభ్యులు వ్యవహరిస్తారు. మండలంలో జరిగే అభివృద్ధి పనులకు ఆ గ్రామ పంచాయితీ కి ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు మండల స్థాయి సమావేశాల్లో చర్చించి ఆశావహ నిర్ణయాలు తీసుకోవడం లో ముఖ్య భూమిక పోషించగలుగుతారు. ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం  చేసుకుని, వారి గ్రామాలు ఆర్ధిక , సామాజిక బలోపేతం లో తమ వంతు పాత్రను సద్వినియోగం చేసుకోవచ్చు నని తెలిపారు. 


ఈ కార్యక్రమానికి సామర్లకోట శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ జె. వేణుగోపాల్, చాగల్లు ఎంపీడీఓ  బి.రామ్ ప్రసాద్, యోగా ఫ్యాకల్టీలు, సీనియర్ అధ్యాపకులు ఎపిఓ  కెవివి సత్యనారాయణ, ఎమ్ టి పంచాయతీ కార్యదర్శి కె. శ్రీనివాస్ రెడ్డి శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణ కార్యక్రమానికి కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లుకు చెందిన 50 మంది ఎంపిటిసి లు, కో ఆప్షన్ సభ్యులు హాజరయ్యారు.