శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిశ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి (ప్రజా అమరావతి);, విజయవాడ నందు                     ప్రస్థుతము కరోనా కర్ఫ్యూ  ఆంక్షలు సడలించిన కారణముగా గతములో మాదిరిగా రేపటి నుండి ఉదయం 3.00 గం.ల నుండి 4.00 గం.ల వరకు ప్రాతఃకాలార్చన, 4.00 గం.ల నుండి 5.00 గం.ల వరకు ఖడ్గమాలార్చన నిర్వహించబడును. ఉచిత దర్శనము (ఒక లైను) ఉదయం 4.00 గం.ల నుండి ఏర్పాటు చేయబడును.  మిగిలిన దర్శనములు అన్నియు ఉదయం 5.00 గం.ల నుండి రాత్రి 10.00 గం.ల వరకు యధావిధిగా ఏర్పాటు చేయడమైనది. ఈ విషయములు భక్తులు యావన్మంది గమనించవలసినదిగా ప్రార్ధించడమైనది. 


    ఈ విషయమును పత్రికా ముఖముగా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా భక్తులకు తెలియజేయవలసినదిగా కోరడమైనది.


శ్రీ అమ్మవారి సేవలో..

కార్యనిర్వహణాధికారి.